Girl: అమ్మాయిని కారులో పిలుచుకుని వెళ్లి బలవంతంగా మద్యం తాగించి ఫ్రెండ్ తో కలిసి?, కామాంధుడికి!
బెంగళూరు/హోస్ పేట్: దంపతులు వారి కుమార్తెను బాగా చదివించాలని అనుకున్నారు. అమ్మాయి వాళ్ల అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. అమ్మమ్మ ఇంటి నుంచి ఆ అమ్మాయి ఆమె సొంత ఇంటికి బయలుదేరింది. ఆ సందర్బంలో అమ్మాయికి పరిచయం ఉన్న యువకుడు ఆమెకు ఫోన్ చేశాడు. తాను ఇక్కడే ఉన్నానని, నువ్వు వస్తే కారులో మీఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పాడు.
అమ్మాయి ఆయువకుడు చెప్పిన ప్రాంతానికి వెళ్లింది. కారులో అమ్మాయి కుర్చున్న తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. కారులో స్నేహితుడితో కలిసి అమ్మాయి కాళ్లు, చేతులు కట్టేసి ఆమెతో బలవంతంగా మద్యం తాపించిన కామాంధులు ఆమె మీద లైంగిక దాడి చెయ్యడానికి ప్రయత్నించడం కలకలం రేపింది.

9వ తరగతి అమ్మాయి
కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోని సింధనూరులో 15 ఏళ్ల అమ్మాయి నివాసం ఉంటున్నది. ఈ అమ్మాయి సింధనూరులోని ఓ స్కూల్ లో 9వ తరగతి చదువుతోంది. దంపతులు వారి కుమార్తెను బాగా చదివించాలని అనుకున్నారు. ప్రతిరోజు అమ్మాయిని తండ్రి స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తున్నాడు. అమ్మాయి అమ్మమ్మ హోస్ పేట్ సమీపంలో నివాసం ఉంటున్నది.

అమ్మమ్మ ఇంటిలో మూడు రోజులు
గత నెల 25వ తేదీన అమ్మాయి హోస్ పేట్ మీపంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. రెండు రోజులు అమ్మమ్మ ఇంటిలోనే ఆమె ఉంది. తరువాత నవంబర్ 27వ తేదీన మద్యాహ్నం సింధనూరులోని ఇంటికి ఆమె బయలుదేరింది. ఆ సందర్బంలో అమ్మాయికి పరిచయం ఉన్న సచిన్ అనే యువకుడు ఆమెకు ఫోన్ చేశాడు.

కారులో అమ్మాయిని పిలుచుకుని?
తాను హోస్ పేట్ లో ఉన్నానని, నువ్వు వస్తే కారులో సింధనూరులోని మీఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని సచిన్ ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పాడు. అమ్మాయి ఆమె స్నేహితుడు సచిన్ చెప్పిన హోస్ పేట్ బస్ స్టాండ్ సమీపంలోని ప్రాంతానికి వెళ్లింది. కారులో అమ్మాయి కుర్చున్న తరువాత సచిన్, అతని స్నేహితుడు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అమ్మాయితో బలవంతంగా మద్యం తాగించి?
హోస్ పేట్ దాటిన తరువాత రోడ్డు పక్కన కారు నిలిపిన సచిన్ అతని స్నేహితుడు సమీపంలోని వైన్ షాపులోకి వెళ్లి మద్యం తీసుకున్నారు. తరువాత కారులో ఉన్న అమ్మాయి కాళ్లు, చేతులు వేల్ తో కట్టేసి ఆమెతో బలవంతంగా మద్యం తాగించారు. సచిన్ అతని స్నేహితుడు కారును నిర్జనప్రదేశంలోకి తీసుకెళ్లారు.

కామాంధులు ఎస్కేప్
కామాంధుడు సచిన్, అతని స్నేహితుడు 9వ తరగతి అమ్మాయి మీద లైంగిక దాడి చెయ్యడానికి విఫలయత్నం చేశారు. ఈ వియ బయటకు చెబితే నిన్ను చంపేస్తామని, నీ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని చెప్పి ఆ అమ్మాయిని సింధనూరు సమీపంలో వదిలేసి వెళ్లిపోయారు. బాధితురాలు ఇంటికి వెళ్లి ఆమె తల్లికి విషయం మొత్తం చెప్పింది. అమ్మాయి తల్లి ఫిర్యాదు చెయ్యడంతో సచిన్, అతని స్నేహితుడి మీద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని లేడీ ఎస్ఐ సౌమ్యా మీడియాకు చెప్పారు. కామాంధులకు ఇంకా కొందరు సహకరించి ఉంటారని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications