ఘోర రోడ్డు ప్రమాదం... ఏడుగురు అక్కడికక్కడే మృతి... డెలివరీ కోసం గర్భిణిని తరలిస్తుండగా..

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.కల్బుర్గి జిల్లాలోని సవలగై గ్రామ సమీపంలో ఆగి వున్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ గర్భిణీ స్త్రీ సహా ఏడుగురు మృతి చెందారు. డెలివరీ కోసం ఆమెను కారులో కల్బుర్గిలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతులంతా అలంద్ పట్టణానికి చెందినవారిగా గుర్తించారు.

మృతులను ఇర్ఫానా బేగం(25),రుబియా బేగం(50),అదెదాబి బేగం(50),జయాచున్‌బీ(60),మునీర్(28),మహమ్మద్ అలీ(38),షౌకత్ అలీ(29)గా గుర్తించారు. పోస్టుమార్టమ్ తర్వాత మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు. ఘటనపై కేసు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

seven died after a car rammed into a parked lorry in karnataka

కర్ణాటకలో ఇటీవల తరుచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది మార్చిలో తూమకూరు జిల్లా కొణిగల్ సమీపంలోని బెంగళూరు-మంగళూరు హైవేపై రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో 13 మంది దుర్మరణం చెందారు.బెంగళూరు నుంచి ధర్మస్థలం వెళ్తున్న ఓ బ్రీజా కారు.. అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. డివైడర్‌ను ఢీకొట్టిన అనంతరం.. కారు పల్టీలు కొడుతూ వెళ్లి ఎదురుగా వస్తున్న చెవర్‌లెట్ కారును ఢీకొట్టింది.బ్రీజా కారులో ఉన్నవారిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. చెవర్‌లెట్ ఉన్నవారిలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు.

Recommended Video

    Durgam Cheruvu Cable Bridge Inaugurated by KTR | Oneindia Telugu

    ఇదే ఏడాది అగస్టులో చిత్రదుర్గ జిల్లాలోని హిరియారులో ఓ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగిన ఘటనలు ఐదుగురు సజీవ దహనమయ్యారు. బస్సు బెంగళూరు నుండి విజయపురా వెళ్తుండగా
    ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+