Shock: నాజీవితంలో ఆరెండు ఫినిష్, బాయ్ ఫ్రెండ్, డేటింగ్ పై రమ్యా మేడమ్ క్లారిటీ, వైరల్, ఆ రోజుల్లో?
బెంగళూరు: ప్రముఖ నటి, మాజీ ఎంపీ రమ్యా అలియాస్ దివ్యా స్పందన సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ (COVID-19) దెబ్బతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదర్కొంటున్న సమయంలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు రమ్యా మేడమ్ సమాధానాలు ఇచ్చారు. ఇదే సమయంలో పెళ్లి, సినిమాలు, రాజకీయాలు, లవర్, డేటింగ్ తదితర విషయాల గురించి నటి రమ్యా మేడమ్ వీరలెవల్లో సమాధానాలు ఇవ్వడంతో ఆమె అభిమానుల మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ రోజుల్లో రమ్యా మేడమ్ అంటూ అభిమానులు చేసిన చాటింగ్ వైరల్ అయ్యింది.

మీకు లవర్ ఉన్నాడా ? డేటింగ్ చేస్తున్నారా
ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు రమ్యా మేడమ్ సమాధానాలు ఇచ్చారు. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా ?, మీరు ఎవరినైనా లవ్ చేస్తున్నారా ?, మీరు ఎవరితోనైనా డేటింగ్ చేస్తున్నారా? లాంటి ప్రశ్నలకు నటి రమ్యా ఏం సమాధానం ఇచ్చారంటే ?, ఒకే ఒక్క మాటలో లేదు అని సమాధానం ఇవ్వడంతో అభిమానులు షాక్ అయ్యారు.

నాకు ఒక కుక్కపిల్ల ఉంది
మీకు మైకాంతి అంటే ఇష్టమా అంటే అవును అని నటి రమ్యా సమాధానం ఇచ్చింది. తాను తీరికవేళల్లో తాను పెంచుకుంటన్న కుక్క పిల్లతో టైమ్ పాస్ చేసుకుంటున్నానని, నేను దానితో చాలా ఎంజాయ్ చేస్తున్నానని, ఇప్పుడు తనకు హాయిగా ఉందని నటి రమ్యా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

సినిమాలు, రాజకీయాల చాఫ్టర్ క్లోజ్
తన జీవితంలో సినిమాలు, రాజకీయాలు ముగిసిన అధ్యాయం అంటూ నటి రమ్యా, కర్ణాటకలోని మండ్య లోక్ సభ నియోజక వర్గం మాజీ ఎంపీ, మాజీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రమ్య అలియాస్ దివ్యా స్పందన సంచలనమైన స్టేట్ మెంట్ ఇవ్వడంతో ఆమె అభిమానులు అయోమయానికి గురైనారు. ఇక నాజీవితంలో వీటి గురించి ఆలోచించను అని నటి రమ్యా అన్నారు.

రక్షిత్ శెట్టిని పెళ్లి చేసుకుంటారా?
మీరు ప్రముఖ కన్నడ హీరో రక్షిత్ శెట్టిని పెళ్లి చేసుకోవచ్చు కదా ? అని అభిమానులు ప్రశ్నించడంతో నటి రమ్యా ఆ నటుడు రక్షిత్ శెట్టి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను ట్యాగ్ చేస్తూ స్మైల్ సింబల్ ఒకటి తగిలించి ఆ ఫోటో పెట్టి ఆ టాపిక్ అంతటితో కట్ చేసేసింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా, ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్ చార్జ్ గా ఓ వెలుగు వెలిగిన నటి రమ్యా గత లోక్ సభ ఎన్నికల సందర్బంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ మీద విరుచుకుపడింది. లోక్ సభ ఎన్నికల ఫలితాల తరువాత ప్రధాని మోదీ మరోసారి ప్రధానమంత్రి అయిన తరువాత నటి రమ్యా ఇటు రాజకీయాలకు, కాంగ్రెస్ పార్టీకి, ప్రత్యక్ష రాజకీయాలకు పూర్తిగా దూరం అయ్యింది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications