Student: లా కాలేజ్ అమ్మాయి ఆత్మహత్యకు అసలు కారణం అదే, అమ్మాయి రాసిన డెత్ నోట్ లో?
బెంగళూరు: బెంగళూరు నగరంలో లా కాలేజ్ అమ్మాయి ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. కాలేజ్ లో అందరూ క్లాస్ రూమ్ లో ఉన్న సమయంలో అదే కాలేజ్ లోని 7వ అంతస్తు నుంచి దూకి లా కాలేజ్ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం బెంగళూరులో కలకలం రేపింది. లా కాలేజ్ అమ్మాయి ఆత్మహత్యకు అసలు కారణం తెలిసింది.
బెంగళూరులోని బనశంకరిలో వాణి (23) అనే యువతి నివాసం ఉంటున్నది. బెంగళూరులోని మల్లేశ్వరం సమీపంలోని వీవీ పురంలోని బెంగళూరు ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ లో వాణి ఎల్ఎల్ బీలో చేరింది. వాణి ఎల్ఎల్ బీ మొదటి సంవత్సరం చదువుతోంది. శనివారం కాలేజ్ లో స్నేహితులతో వాణి సంతోషంగానే ఉందని వెలుగు చూసింది.

సోమవారం ఉదయం బనశంకరిలోని ఇంటి నుంచి బయలుదేరిన వాణి నేరుగా బెంగళూరు లా కాలేజ్ కు వెళ్లింది. ఆ సందర్బంలో వాణి కాలేజ్ లో ఆమె స్నేహితులతో మాట్లాడలేదని సమాచారం. లాకాలేజ్ లోని 7వ అంతస్తు మీదకు వెళ్లిన వాణి ఒక్కసారిగా కిందకు దూకేసింది. 7 అంతస్తుల మీద నుంచి దూకడంతో వాణికి తీవ్రగాయాలై ఆమె చనిపోయింది.
ఎల్ఎల్ బీ చదువుతున్న వాణి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది ? అని పోలీసులు ఆరా తీశారు. వాణి ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన డెత్ నోట్ పోలీసులకు చిక్కిందని సమాచారం. ప్రేమ విఫలం అయ్యిందని వాణి ఆత్మహత్య చేసుకుందని ఓ పోలీసు అధికారి అంటున్నారు. వాణి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు.

లా కాలేజ్ లో వాణి స్నేహితుల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాణి శవానికి పోస్టుమార్టుం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే వాణి ప్రేమ విఫలం కావడానికి కారణం అయిన యువకుడి వివరాలు మాత్రం పోలీసులు బయటకు చెప్పలేదు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications