Swamiji: స్వామీజీకి షాక్, ఫోక్సో కేసు దెబ్బతో గర్ల్స్ హాస్టల్ మొత్తం ఖాళీ చేయించిన అధికారులు, అమ్మాయిలు !
బెంగళూరు/చిత్రదుర్గ: మురుగా మఠానికి చెందిన అక్కమ్మదేవి విద్యాసంస్థలో చదువుకుంటున్న మైనర్ అమ్మాయిల మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని చిత్రదుర్గాకు చెందిన స్వామిజీ, మురుగా మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరును పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇదే సందర్బంలో మురుగా మఠంలోని హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్న అమ్మాయిలను హాస్టల్ నుంచి అధికారులు ఖాలీ చేయించారు. మురుగా మఠంలో ఉన్న అమ్మాయిలను మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించడంతో కథ కొత్తమలుపు తిరిగింది.

హాస్టల్ అమ్మాయిలతో స్వామీజీ?
కర్ణాటకలోని చిత్రదుర్గాలోని మురుగా మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరుకు కర్ణాటకలో మంచి పేరుప్రతిష్టలు ఉన్నాయి. మురుగా మఠం ఆధీనంలోని అక్కమదేవి విద్యాసంస్థల్లో చదువుకుంటూ హాస్టల్ లో ఉంటున్న ఇద్దరు మైనర్ అమ్మాయిలు శివమూర్తి మురగా శరణరు మామీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని కేసు పెట్టడం ఇటీవల కలకలం రేపింది.

పోలీసు కస్టడీలో స్వామీజీ
చిత్రదుర్గా మురుగా మఠానికి చెందిన అక్కమ్మదేవి విద్యాసంస్థలో చదువుకుంటున్న మైనర్ అమ్మాయిల మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామిజీ, మురుగా మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరును అరెస్టు చేసిన పోలీసులు చిత్రదుర్గా జిల్లా జైలుకు పంపించారు. కోర్టు అనుమతితో శివమూర్తి మురుగా స్వామీజీని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

మురుగా మఠంలో హాస్టల్ ఖాళీ
లైంగిక వేధింపులు జరిగాయని ఆరోపణలు వచ్చిన మురుగా మఠం ఆధీనంలోని హాస్టల్ లో చదువుకుంటున్న అమ్మాయిలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. మురుగా మఠానికి చెందిన హాస్టల్ లో నివాసం ఉంటూ 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న అమ్మాయిలు అందరిని హాస్టల్ లో నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

పండుగకు ఊరికి వెళ్లిన అమ్మాయిలు?
వినాయకచవితి పండుగ కోసం 37 మంది అమ్మాయిలు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఇప్పటికే ఊరికి వెళ్లారని, వారిని తరువాత మురార్జీ దేశాయ్ హాస్టల్ కు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు అంటున్నారు. కొందరు అమ్మాయిలను మహిళా, శిశు సంక్షేమ శాఖకు చెందిన భవనాలకు తరలించారు. మొత్తం మీద మురుగా మఠం ఆధీనంలోని అమ్మాయిల హాస్టల్ ఖాళీ చేయించడంతో మరోసారి స్వామీజీ హాట్ టాపిక్ అయ్యారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications