పుట్టింటిలో ఫస్ట్ భార్య, రెండో భార్య నర్సుతో పోలీసు ఫుల్ టైమ్ రొమాన్స్, పోలీసు క్వాటర్స్ లో?
బెంగళూరు/బళ్లారి: పోలీసు శాఖలో ఓ యువకుడికి ఉద్యోగం వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న యువకుడికి ఇచ్చి పెళ్లి చెయ్యడానికి అమ్మాయిల కుటుంబ సభ్యులు పోటీపడ్డారు. ఇదే సమయంలో యువకుడి మతానికి చెందిన యువతితో పెద్దలు పెళ్లి జరిపించారు. పోలీసు క్వాటర్స్ లో నివాసం ఉంటున్న వ్యక్తి అతని భార్యతో చక్కగా కాపురం చేశాడు. ఇదే సమయంలో మరో మతానికి చెందిన యువతి పరిచయం కావడంతో అక్కడ కథ అడ్డం తిరిగింది.
కర్ణాటకలోని బళ్లారిలో జాఫర్ షరీఫ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. పోలీసు శాఖలోని డీఏఆర్ విభాగంలో జాఫర్ కు ఉద్యోగం వచ్చింది. పోలీసు ఉద్యోగం చేస్తున్న జాఫర్ కు కొన్ని సంవత్సరాల క్రితం ముస్లీం యువతితో వివాహం అయ్యింది. బళ్లారిలోని పోలీసు క్వాటర్స్ లో భార్యతో కలిసి జాఫర్ కాపురం పెట్టాడు. భార్యతో కలిసి చక్కగా కాపురం చేస్తున్న జాఫర్ ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్లి వచ్చేవాడు. ఇదే సమయంలో జాఫర్ జీవితంలో ఊహించని మలుపు తిరిగింది.
హనుమక్క అలియాస్ హనీ అనే యువతి బళ్లారిలో నర్సుగా ఉద్యోగం చేస్తున్నది. నర్సు ఉద్యోగం చేస్తున్న హనీకి రెండు సంవత్సరాల క్రితం కానీస్టేబుల్ జాఫర్ పరిచయం అయ్యాడు. కొంతకాలం పాటు జాఫర్, హనీ ఇద్దరు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేశారు. ఇంట్లో భార్యను పెట్టుకున్న కానీస్టేబుల్ జాఫర్ నర్సు హనీతో ప్రేమలో పడ్డాడు. తరువాత ఇద్దరు విహారయాత్రలు, సినిమాలు, షికార్లకు తిరిగేశారు. ప్రియురాలు హనీ మోజులో పడిపోయిన కానీస్టేబుల్ జాఫర్ అతని భార్యను పుట్టింటికి పంపించాడు.

భార్యను పుట్టింటికి పంపిచిన జాఫర్ అతని ప్రియురాలు నర్సు హనీని రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యను పుట్టింటికే పరిమితం చేసిన జాఫర్ అతని రెండో భార్య హనీతో కలిసి పొలీసు క్వాటర్స్ లోని అతని ఇంటిలో కాపురం పెట్టారు. మొదటి భార్యకు మ్యాటర్ తెలిసినా ఆమె ఏమీ చెయ్యలేక సైలెంట్ గా ఉండిపోయింది. అత్తారింటికి వెళ్లి వస్తున్న జాఫర్ అతని మొదటి భార్యతో కూడా అప్పుడప్పుడు కాపురం చేస్తున్నాడు.
రెండో భార్య హనీతో జాఫర్ ఫుల్ టైమ్ కాపురం చేస్తున్నాడు. పోలీసు క్వాటర్స్ ఆవరణంలో జాఫర్ తలకు తీవ్రగాయాలై కుప్పకూలిపడిపోయిన విషయం గుర్తించిన సాటి పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై జాఫర్ చనిపోయాడు. పోలీసుల విచారణలో జాఫర్ తల మీద ఇనుప రాడ్ తో దాడి చేసి చంపేశారని వెలుగు చూసింది.
పోలీసులు లోతుగా విచారణ చెయ్యగా జాఫర్ ను అతని రెండో భార్య హనీ అలియాస్ హనుమక్క ఇనుప రాడ్ తో కొట్టి చంపేసిందని వెలుగు చూసింది. నర్సు హనీని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను విచారణ చేస్తున్నారు. జిల్లా రిజర్వ్ పోలీసును అతని రెండో భార్య హత్య చెయ్యడం బళ్లారిలో హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications