Wife: బెడ్ రూమ్ లో భార్యను పక్కాప్లాన్ తో చంపేశాడు, గుండెపోటు డ్రామాలు, అత్త ఎంట్రీతో సీన్ రివర్స్!
బెంగళూరు: కుటుంబ సభ్యులు చూపించిన మహిళను వివాహం చేసుకన్న వ్యక్తి అతని భార్యతో మొదట సంతోషంగా కాపురం చేశాడు. భార్య ఇంట్లో ఉంటే భర్త డ్రైవర్ గా పని చేస్తూ అతని భార్యను పోషిస్తున్నాడు. వివాహం జరిగిన రెండు సంవత్సరాల తరువాత దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. పుట్టింటి నుంచి డబ్బులు తీసుకుని వస్తే తాను వ్యాపారం చేసి డబ్బులు బాగా సంపాదిస్తానని, మనం సుఖపడటానికి అవకాశం ఉంటుందని భర్త అతని భార్యకు చెప్పాడు. పుట్టింటి నుంచి డబ్బులు, బంగారు నగలు తీసుకురావడానికి అతని భార్య నిరాకరించింది.
అక్కడే దంపతుల మద్య గొడవలు మొదైనాయి. రానురాను భర్త అతని భార్యతో ఏదో ఒక విషయంలో గొడవపెట్టుకుని రాద్దాంతం చెయ్యడం మొదలు పెట్టాడు. చివరికి భార్యను చంపేయాలని భర్త డిసైడ్ అయ్యాడు. బెడ్ రూమ్ లో నిద్రపోతున్న భార్య గొంతును దుప్పటితో బిగించి చంపేశాడు. అత్తకు ఫోన్ చేసిన అల్లుడు మీ కూతురు గుండెపోటుతో చనిపోయిందని చెప్పాడు. అత్త ఎంట్రీతో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.

కుటుంబ సభ్యులు చేసిన పెళ్లి
బెంగళూరు నగర శివార్లలోని బ్యాడరహళ్ళిలో యోగేష్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మూడు సంవత్సరాల క్రితం సౌమ్యా (26) అనే మహిళను యోగేష్ కు ఇచ్చి పెళ్లి చెయ్యాలని పెద్దలు మాట్లాడుకున్నారు. యోగేష్ ను పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని సౌమ్యా చెప్పింది. కుటుంబ సభ్యులు చూపించిన సౌమ్యాను వివాహం చేసుకన్న యోగేష్ అతని భార్యతో మొదట్లో సంతోషంగా కాపురం చేశాడు.

భర్త ఆటో డ్రైవర్
బెంగళూరులోని సుంకదకట్ట సమీపంలోని మునేశ్వరబ్లాక్ లో యోగేష్, సౌమ్యా దంపతులు కాపురం పెట్టారు. భార్య సౌమ్యా ఇంట్లో ఉంటే ఆమె భర్త యోగేష్ సొంతంగా ఆటో తీసుకుని డ్రైవర్ గా పని చేస్తూ అతని భార్యను పోషిస్తున్నాడు. వివాహం జరిగిన రెండు సంవత్సరాలు యోగేష్, సౌమ్యా దంపతుల చాల సంతోషంగా ఉన్నారు. తరువాత యోగేష్, సౌమ్యాల మద్య గొడవలు మొదలైనాయి.

విపరీతంగా అప్పులు చేసిన భర్త
ఇటీవల యోగేష్ విపరీతంగా అప్పులు చేశాడని తెలిసింది. వెంటనే రూ. 2 లక్షలు అప్పులు తీర్చడానికి యోగేష్ కు డబ్బులు చాలా అవసరం అయ్యింది. పుట్టింటి నుంచి డబ్బులు తీసుకుని వస్తే తాను వ్యాపారం చేసి డబ్బులు బాగా సంపాదిస్తానని, మనం సుఖపడటానికి అవకాశం ఉంటుందని యోగేష్ అతని భార్య సౌమ్యాకు చెప్పాడు.

భార్యను చంపేయాలని డిసైడ్ అయ్యాడు
పుట్టింటి నుంచి డబ్బులు, బంగారు నగలు తీసుకురావడానికి సౌమ్యా నిరాకరించింది. అక్కడే యోగేష్, సౌమ్యా దంపతుల మద్య గొడవలు మొదైనాయి. రానురాను యోగేష్ అతని భార్య సౌమ్యాతో ఏదో ఒక విషయంలో గొడవపెట్టుకుని రాద్దాంతం చెయ్యడం మొదలు పెట్టాడు. నా భార్య సౌమ్యా చెప్పినమాట వినడం లేదని యోగేష్ గిలిపోయాడు.

భార్యను చంపేసి గుండెపోటు డ్రామాలు
చెప్పినమాట వినకుండా తన అప్పులు పెరిగిపోవడానికి కారణం అయిన భార్య సౌమ్యాను చంపేయాలని యోగేష్ డిసైడ్ అయ్యాడు. బెడ్ రూమ్ లో నిద్రపోతున్న భార్య సౌమ్యా గొంతును దుప్పటితో బిగించి చంపేశాడు. అత్తకు ఫోన్ చేసిన యోగేష్ మీ కూతురు గుండెపోటుతో చనిపోయిందని చెప్పాడు. సౌమ్యా తల్లి ఎంట్రీతో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. సౌమ్యాను మా అల్లుడు యోగేష్ హత్య చేశాడని ఆమె తల్లి కేసు పెట్టింది. పోలీసుల విచారణలో సౌమ్యాను గొంతు నులిమి చంపేశాడని వెలుగు చూసింది. భార్య సౌమ్యాను హత్య చేసి గుండెపోటు డ్రామాలు ఆడిన యోగేష్ ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications