బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Marriage: లవ్ మ్యారేజ్, బార్యది విలాసవంతమైన జీవితం, యూట్యూబ్ స్కెచ్ తో ?, అప్పట్లో హైదరాబాద్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చెయ్యడానికి దొంగతనాలు చేసిన యువకుడు జైలుపాలైనాడు. కొంతకాలం తరువాత బెయిల్ మీద బయటకు వచ్చి వేరే సిటీకి పారిపోయి అక్కడ డ్రైవర్ అవతారం ఎత్తాడు. అందంగా ఎర్రగా, బలంగా ఉన్న బంగ్లాదేశ్ యువతిని ప్రేమించిన అతను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. లవ్ మ్యారేజ్ చేసుకున్న భార్యతో కలిసి బాంగ్లాదేశ్ వెళ్లిపోయాడు. బాంగ్లాదేశ్ లో బతకలేక భార్యతో కలిసి ఐటీ హబ్ చేరుకున్నాడు.

డ్రైవర్ గా భర్త సంసాధిస్తున్న డబ్బు భార్య విలాసాలకు సరిపోలేదు. నువ్వు సంపాధించే డబ్బు నాకు సరిపోదు, డబ్బు ఎక్కువగా సంసాధిస్తే నీతో కలిసికాపురం చేస్తాను, లేదంటే లేదు అని భార్య తేల్చి చెప్పింది. భార్య విలాసవంతమైన జీవితం గడపడానికి భర్త సూపర్ స్కెచ్ వేశాడు. భార్య, భర్త యూట్యూబ్ చూసి అందులో స్కెచ్ ప్రకారం పని ముగించేసి లక్షల్లో డబ్బులు సంపాధించి ఇంతకాలం ఎంజాయ్ చేశారు. అయితే గ్రహాలు అనుకూలించకపోవడంతో భర్త పోలీసులకు చిక్కిపోయాడు.

Illegal affair: లేడీ టీచర్ కు ఇద్దరు భర్తలు, మద్యలో మూడోవాడు, రెండో భర్త ఏం చేశాడంటే ?, కూతురిని!Illegal affair: లేడీ టీచర్ కు ఇద్దరు భర్తలు, మద్యలో మూడోవాడు, రెండో భర్త ఏం చేశాడంటే ?, కూతురిని!

హైదరాబాద్ లో పోటుగాడు.... ఆరు కేసులు

హైదరాబాద్ లో పోటుగాడు.... ఆరు కేసులు

తెలంగాణకు చెందిన వినోద్ కుమార్ అలియాస్ వినోద్ అనే యువకుడు హైదరాబాద్ లో నివాసం ఉండేవాడు. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చెయ్యడానికి వినోద్ కుమార్ దొంగతనాలు చేశాడు. పరిస్థితులు అనుకూలించకపోవడంతో 2015లో వినోద్ కుమార్ హైదరాబాద్ పోలీసులకు చిక్కిపోయాడు ఆరు చోరీ కేసుల్లో వినోద్ కుమార్ నిందితుడు. హైదరాబాద్ పోలీసులు అరెస్టు చెయ్యడంతో వినోద్ కుమార్ జైలుపాలైనాడు. కొంతకాలం తరువాత వినోద్ కుమార్ బెయిల్ మీద బయటకు వచ్చాడు.

బాంగ్లాదేశ్ అమ్మాయితో లవ్ మ్యారేజ్

బాంగ్లాదేశ్ అమ్మాయితో లవ్ మ్యారేజ్

బెయిల మీద బయబకు వచ్చి హైదరాబాద్ నుంచి కోల్ కత్తాకు పారిపోయిన వినోద్ కుమార్ అక్కడ డ్రైవర్ అవతారం ఎత్తాడు. కోల్ కత్తాలో బాంగ్లాదేశ్ కు చెందిన అందంగా ఎర్రగా, బలంగా ఉన్న బంగ్లాదేశ్ నివాసి రోహిత మండల్ అనే యువతిని ప్రేమించిన వినోద్ కుమార్ ఆమెను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు.

బతకలేక బెంగళూరు వచ్చేశారు

బతకలేక బెంగళూరు వచ్చేశారు

లవ్ మ్యారేజ్ చేసుకున్న భార్య రోహిత మండల్ తో కలిసి వినోద్ కుమార్ బాంగ్లాదేశ్ వెళ్లిపోయాడు. బాంగ్లాదేశ్ లో సరైన సంపాధనలేకపోవడంతో వినోద్ కుమార్ అతని భార్య రోహిత మండల్ ను పోషించలేకపోయాడు. బాంగ్లాదేశ్ లో బతకలేక భార్య రోహిత మండల్ తో కలిసి వినోద్ కుమార్ ఐటీ హబ్ బెంగళూరు చేరుకున్నాడు.

భార్య విలాసవంతమైన జీవితం

భార్య విలాసవంతమైన జీవితం

డ్రైవర్ గా భర్త వినోద్ కుమార్ సంసాధిస్తున్న డబ్బు అతని భార్య రోహిత మండల్ విలాసాలకు సరిపోలేదు. నువ్వు సంపాధించే డబ్బు నాకు సరిపోదు, డబ్బు ఎక్కువగా సంసాధిస్తే నీతో కలిసి కాపురం చేస్తాను, లేదంటే లేదు అని భార్య రోహిత మండల్ తేల్చి చెప్పడంతో వినోద్ కుమార్ అయోమయంలో పడిపోయాడు.

యూట్యూబ్ చూసి 26 చోరీలు

యూట్యూబ్ చూసి 26 చోరీలు

భార్య రోహిత మండల్ విలాసవంతమైన జీవితం గడపడానికి ఆమె భర్త వినోద్ కుమార్ ముందులాగా చోరీలు చెయ్యాలని సూపర్ స్కెచ్ వేశాడు. వినోద్ కుమార్, రోహిత మండల్ యూట్యూబ్ చూసి అందులో స్కెచ్ ప్రకారం పని ముగించేసి లక్షల్లో డబ్బులు సంపాధించారు. బెంగళూరులో కొంతకాలంలోనే వినోద్ కుమార్ 26 ప్రాంతాల్లో చోరీలు చేశాడు. భర్త వినోద్ కుమార్ చోరీలు చెయ్యడానికి అతని భార్య రోహిత మండల్ కూడా సహకరించింది. చోరీలు చేస్తూ ఇద్దరూ ఇంతకాలం ఎంజాయ్ చేశారు. అయితే గ్రహాలు అనుకూలించకపోవడంతో వినోద్ కుమార్ బెంగళూరు పోలీసులకు చిక్కిపోయాడు.

English summary
Wife: Karnataka police arrested thiefs who started robbing after watching youtube in Bengaluru city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X