కంపెనీ బంపర్ ఆఫర్: ఉద్యోగులకు రూ.1.5 కోట్ల ఇల్లు ఫ్రీ!

నేటి కాలంలో ఒకే కంపెనీలో ఎక్కువ కాలం పనిచేయడం అనేది చాలా అరుదుగా కనిపిస్తోంది. ఐటీ రంగం నుంచి మాన్యుఫ్యాక్చరింగ్ రంగం వరకు ఎక్కడైనా సరే మెరుగైన జీతం లేదా ప్యాకేజీ రాగానే ఉద్యోగులు త్వరగా కంపెనీలు మారిపోతున్నారు. ఇలాంటి తరుణంలో తమ దగ్గర ఉన్న నైపుణ్యం కలిగిన సిబ్బందిని వేరే కంపెనీలకు వెళ్లకుండా కాపాడుకోవడానికి చైనాకు చెందిన ఓ ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కళ్లు చెదిరే బంపర్ ఆఫర్ ప్రకటించింది. అదేమిటంటే.. తమ కంపెనీలో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి సుమారు రూ.1.5 కోట్ల విలువైన విలాసవంతమైన ఫ్లాట్లను ఉచితంగా అందజేస్తోంది.

ఈ ఆఫర్ ఇస్తున్న కంపెనీ ఇదే?
చైనాలోని వెన్‌జౌ నగరంలో ప్రధాన కార్యాలయం కలిగిన 'జెజియాంగ్ గుయోషెంగ్ ఆటోమొబైల్' ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఆటోమొబైల్ రంగంలో కీలకమైన 'ఫాస్టెనర్‌లను' తయారు చేసే ఈ కంపెనీలో దాదాపు 450 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. కంపెనీలో కీలకంగా వ్యవహరించే మేనేజ్‌మెంట్ స్థాయి అధికారులు, సాంకేతిక నిపుణులు ఇతర కంపెనీల వైపు చూడకుండా ఉండేలా ఈ 'హౌసింగ్ స్కీమ్'ను ప్రవేశపెట్టింది.

China Company Offers Free Rs 1 5 Crore Luxury Flats to Employees After 5 Years

ఈ పథకం కోసం కంపెనీ దాదాపు రెండేళ్ల క్రితమే ముందస్తు ప్రణాళికతో వ్యవహరించింది. అప్పట్లో ప్రాపర్టీ ధరలు తక్కువగా ఉన్న సమయంలోనే సుమారు 10 మిలియన్ యువాన్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 12.7 కోట్లు) వెచ్చించి 18 ఫ్లాట్లను కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఆ ఫ్లాట్ల విలువ గణనీయంగా పెరగడం వల్ల ఇప్పుడు వాటిని అందుకుంటున్న ఉద్యోగులకు అది ఒక పెద్ద ఆస్తిగా మారుతోంది.

ఫ్లాట్ పొందేందుకు ఉండాల్సిన అర్హతలు ఏమిటి?
ఈ ఫ్లాట్ ఉచితంగా పొందడానికి కంపెనీ కొన్ని నిబంధనలను పెట్టింది. ఉద్యోగి కనీసం ఐదేళ్ల పాటు కంపెనీలో నిరంతరాయంగా పనిచేసి ఉండాలి. ఫ్లాట్ పొందిన తర్వాత, ఆ ఉద్యోగి మరో ఐదేళ్ల పాటు కంపెనీలోనే కొనసాగుతామని బాధ్యతాయుతమైన ఒప్పందం చేసుకోవాలి. మొత్తం 10 ఏళ్ల సర్వీస్ (మొదటి 5 ఏళ్లు + ఫ్లాట్ వచ్చాక మరో 5 ఏళ్లు) పూర్తయిన తర్వాతే ఆ ఇంటిపై పూర్తి స్థాయి చట్టపరమైన హక్కులు ఉద్యోగికి బదిలీ అవుతాయి.

ఇప్పటికే లబ్ధి పొందిన ఉద్యోగులు
2025 సంవత్సరంలో ఇప్పటి వరకు ఐదుగురు అదృష్టవంతులు ఈ ఫ్లాట్లను అందుకున్నారు. ఇందులో విశేషం ఏమిటంటే.. కేవలం ఉన్నత స్థాయి అధికారులకు మాత్రమే కాకుండా సాధారణ స్థాయి నుంచి మేనేజ్మెంట్ స్థాయికి ఎదిగిన వారికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ఒక ఉద్యోగి దంపతులకైతే ఏకంగా 144 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన ఫ్లాట్‌ను కేటాయించారు. వచ్చే రెండేళ్లలో మిగిలిన 13 ఫ్లాట్లను కూడా అర్హులైన సిబ్బందికి అందజేయనున్నట్లు కంపెనీ జనరల్ మేనేజర్ వాంగ్ జియాయువాన్ స్పష్టం చేశారు.

ఫ్లాట్ల విశిష్టత, నిబంధనలు
ఈ ఫ్లాట్లు కంపెనీకి కేవలం 5 కిలోమీటర్ల లోపే ఉండటం వల్ల ఉద్యోగులకు ప్రయాణ ఇబ్బందులు కూడా తప్పుతాయి. ఒక్కో ఫ్లాట్ 100 నుంచి 150 చదరపు మీటర్ల వైశాల్యం కలిగి ఉండి, ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ. 1.2 కోట్ల నుండి రూ. 1.5 కోట్ల వరకు పలుకుతోంది. అయితే ఫ్లాట్ పొందిన వారు ఇంటి మరమ్మతులు లేదా రెనోవేషన్ ఖర్చులను మాత్రం తమ సొంత డబ్బుతో చేసుకోవాల్సి ఉంటుందని కంపెనీ నిబంధన పెట్టింది.

ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కోసం కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. కేవలం వేతనాలు పెంచితే సరిపోదని, వారి జీవితాలకు భద్రతనిచ్చేలా 'సొంత ఇల్లు' వంటి ప్రోత్సాహకాలు ఇస్తే ఉద్యోగులు కంపెనీని వదిలి వెళ్లరని ఈ చైనా సంస్థ నిరూపిస్తోంది. ఇతర కంపెనీలు కూడా భవిష్యత్తులో ఇలాంటి వినూత్న మార్గాలను అనుసరించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+