అంతా పీఎంవో చేతుల్లోనే, నోట్ల రద్దు-జీఎస్టీలతో భారత్‌కు దెబ్బ: రఘురాం రాజన్
వాషింగ్టన్: భారత్‌లో అధికార కేంద్రీకరణ ఎక్కువగా ఉందని, నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ వెనుకబడుతోందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ విమర్శలు గుప్పించారు. ఆయన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు.
రాజకీయ నిర్ణయాల్లో అధికార కేంద్రీకరణ మరీ ఎక్కువగా అయిందని, ఇదే భారత్‌కు ప్రధాన సమస్య అన్నారు. ఇటీవల ఆవిష్కరించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహమే అందుకు ఉదాహరణ అన్నారు.

ఈ విగ్రహావిష్కరణకు ప్రధానమంత్రి కార్యాలయం అనుమతి ఇచ్చిందని చెప్పారు. అధికార కేంద్రీకరణ రాజకీయ నిర్ణయాల్లో మరీ ఎక్కువ అన్నారు. సర్దార్ విగ్రహావిష్కరణలో ఉన్న వేగం అన్నింటా ఉండాలన్నారు. ప్రధాని కార్యాలయమే ఎక్కువ నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. భారత్‌లో ప్రధాని కార్యాలయం అనుమతి లభిస్తే తప్పు ముందడుగు పడట్లేదన్నారు.
రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడే ప్రధానమంత్రిపై ఆధారపడే అన్నీ జరుగుతున్నాయన్నారు. సర్దార్ విగ్రహం అంశాన్ని ప్రస్తావిస్తూ ఏదైనా జరగాలి అని భావిస్తే దానిని చేసి తీరుతుందని, దీనిని ప్రతీ అంశంలోనూ మనం చూడలేమా అన్నారు. అధికార కేంద్రీకరణ ఎక్కువగా ఉండటంతో పాటు అధికారుల లేదా ఉద్యోగుల చేతిలో అధికారం లేకపోవడం కూడా మరో ప్రధాన సమస్య అన్నారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులు తమకు తాముగా ఏ నిర్ణయం తీసుకోలేక పోతున్నాయని చెప్పారు. అవినీతి కుంభకోణాలు బయటపడుతున్నప్పటి నుంచీ ఉద్యోస్వామ్యం వెనకడుగు వేసిందని విమర్శించారు. నోట్ల రద్దు భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధిని అడ్డుకుంటోందన్నారు. నోట్ల రద్దుతో పాటు జీఎస్టీ ప్రభావం భారత్ పైన బాగా పడ్డాయన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications