గేమ్ ఛేంజర్: పిల్లలు ఎంత పెరిగితే బైక్ కూడా అంతే పెరుగుతుంది!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హీరో మోటోకార్ప్‌కు చెందిన విడా (Vida) బ్రాండ్ భారత మార్కెట్లో వినూత్నమైన ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేయడం ద్వారా ఒక కొత్త శకాన్ని ప్రారంభించింది. "Hero Vida Dirt.E K3" పేరుతో వచ్చిన ఈ ఆఫ్-రోడ్ ఎలక్ట్రిక్ బైక్ ప్రత్యేకంగా 4 నుంచి 10 ఏళ్ల వయస్సు గల పిల్లల కోసం రూపొందించబడింది. ఈ బైక్‌ను పిల్లలు సులభంగా, అత్యంత భద్రతతో నడపడానికి వీలుగా అత్యాధునిక ఫీచర్లతో రూపొందించారు. ఈ బైక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.69,990 గా నిర్ణయించబడింది. మొదటి 300 యూనిట్లకు మాత్రమే ఈ పరిచయ ధర వర్తిస్తుంది. దీని తర్వాత ధర పెరిగే అవకాశం ఉంది.
విడా డర్ట్.ఈ K3 బైక్ పనితీరు, స్పీడ్ పరంగా పూర్తి నియంత్రణను అందిస్తుంది. ఇందులో మూడు రకాల రైడింగ్ మోడ్స్‌ను (లో, మిడ్, హై) అందించారు. ఈ మోడ్స్ ద్వారా గరిష్ట వేగాన్ని 8 కేఎంపీహెచ్ నుంచి 25 కేఎంపీహెచ్ వరకు సెట్ చేసుకోవచ్చు. విద్యుత్ సరఫరా కోసం 360Wh(Wh-వాట్ అవర్) సామర్థ్యం గల రిమూవబుల్ లిథియం-అయాన్ బ్యాటరీని అమర్చారు. 500W శక్తి గల మోటార్‌ను ఉపయోగించారు. మోటార్‌స్పోర్ట్స్ పట్ల ఆసక్తి ఉన్న పిల్లలకు ఈ బైక్ ఒక గొప్ప అవకాశం. ముఖ్యంగా దీని బరువు కేవలం 22 కిలోలు మాత్రమే ఉండటం వల్ల, పిల్లలు సులభంగా నియంత్రించడానికి వీలవుతుంది.

ఈ బైక్ ముఖ్య ఆకర్షణ దాని అడ్జస్టబుల్ డిజైన్. పిల్లల పెరుగుదలకు అనుగుణంగా బైక్‌ను మార్చుకునే వెసులుబాటు ఇందులో ఉంది. అడ్జస్టబుల్ ఛాసిస్ కారణంగా, సీట్ హైట్‌ను 454mm (స్మాల్), 544mm (మీడియం), 631mm (హై) వరకు మార్చుకోవచ్చు. దీనితో పాటు వీల్‌బేస్, హ్యాండిల్ హైట్‌ను కూడా పిల్లల ఎత్తుకు తగినట్లుగా మార్చవచ్చు. రిమూవబుల్ ఫుట్‌పెగ్‌లను ఇవ్వడం వల్ల అవసరమైతే పిల్లలు సైకిల్ మాదిరిగా నెట్టుకుంటూ (Pedal) కూడా నడపగలరు.
భద్రత విషయంలో కంపెనీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. పిల్లలు కింద పడినప్పుడు తక్షణమే బైక్‌ను ఆపివేయడానికి మ్యాగ్నెటిక్ కిల్ స్విచ్‌ను ఇందులో అమర్చారు. అలాగే హ్యాండిల్‌పై అమర్చిన చెస్ట్ ప్యాడ్ ప్రమాదవశాత్తు కింద పడినప్పుడు పిల్లలకు గాయాలు కాకుండా కాపాడుతుంది. బ్రేకింగ్ కోసం కేవలం వెనుక బ్రేక్ మాత్రమే అందించబడింది. తల్లిదండ్రుల సౌకర్యం కోసం ఇందులో స్మార్ట్‌ఫోన్ యాప్ సపోర్ట్ ఉంది. ఈ యాప్ ద్వారా పిల్లలు నడిపే స్పీడ్ లిమిట్‌ను, యాక్సిలరేషన్‌ను నియంత్రించడంతో పాటు రైడ్ డేటాను పర్యవేక్షించవచ్చు. యాక్సెసరీస్‌గా ఫ్రంట్ బ్రేక్, పెద్ద వీల్స్, సస్పెన్షన్ మరియు రోడ్ లీగల్ టైర్లను అదనంగా కొనుగోలు చేసుకునే అవకాశం కూడా ఉంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications