భారీగా పడిపోతున్న బంగారం ధరలు
దేశీయ రిటైల్ మార్కెట్ లో నేడు పసిడి ధరలు క్షీణించాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిణామాలు, సౌదీ అరేబియాపై హౌతీ తిరుగుబాటుదారుల డ్రోన్ దాడులు, అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల పరిణామాలు బంగారం, వెండి ధరలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఈ పరిస్థితుల్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా దూసుకుపోవడంతో దేశీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరల్లో తగ్గుదల నమోదైంది.
దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో ఈ ఉదయం ట్రేడింగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 920 రూపాయల మేర తగ్గింది. ప్రస్తుతం రూ. 1,51,830 వద్ద ట్రేడ్ అయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 850, 18 క్యారెట్లు రూ. 690 మేర తగ్గుదలను నమోదు చేశాయి. అదే సమయంలో కిలో వెండి ఫ్యూచర్స్ ధర కూడా 0.39 శాతం నష్టపోయి సుమారు రూ. 2,31,670 వద్ద ట్రేడవుతోంది. ఈ రెండింటి రేట్లు కూడా క్షీణించడం సామాన్య కొనుగోలుదారులకు కొంతమేర ఊరటనిచ్చింది.

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు 4,300.96 డాలర్లకు పడింది. ఇందులో 0.4 శాతం మేర క్షీణత కనిపించింది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,51,6210, 22 క్యారెట్లు రూ. రూ. 1,39,003, వెండి కిలో రూ. 2,31,610 వద్ద స్థిరపడింది. బెంగళూరులో ఇవే రేట్లు వరుసగా రూ. 1,51,760, రూ. 1,39,113, రూ. 2,31,800 గా నమోదయ్యాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్లు రూ. 1,51,740, 22 క్యారెట్లు రూ. 1,39,095, వెండి రూ. 2,31,730 వద్ద కొనసాగింది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,51,940, 22 క్యారెట్లు రూ. 1,39,278, వెండి రూ. 2,32,040 వద్ద ట్రేడ్ అయింది.
వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,317, 22 క్యారెట్లు - రూ. 14,040, 18 క్యారెట్లు - రూ. 11,810
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,317, 22 క్యారెట్లు- రూ. 14,040, 18 క్యారెట్లు - రూ. 11,488
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,317, 22 క్యారెట్లు- రూ. 14,040, 18 క్యారెట్లు - రూ. 11,488
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,317, 22 క్యారెట్లు- రూ. 14,040, 18 క్యారెట్లు - రూ. 11,488
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,317, 22 క్యారెట్లు- రూ. 14,040, 18 క్యారెట్లు - రూ. 11,488
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,317, 22 క్యారెట్లు- రూ. 14,040, 18 క్యారెట్లు - రూ. 11,488

Click it and Unblock the Notifications