Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తికమక పెడుతున్న Gold, వెండి.. నేటి పరిస్థితి ఇదే!

ఇటీవల భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. కొద్ది రోజుల కరెక్షన్‌ తర్వాత ఈ రెండు విలువైన లోహాలకు మరోసారి రెక్కలొచ్చాయి. ఫ్యూచర్స్ మార్కెట్‌లో వెండి ధరలు దాదాపు ఐదు శాతం వరకు పెరిగి ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో (MCX) మార్చి నెల వెండి కాంట్రాక్ట్ 4.74 శాతం పెరిగి కిలోకు ₹2,61,745కు చేరింది. ఒక్కరోజులోనే దాదాపు ₹11 వేల పెరుగుదల నమోదైంది. అదే సమయంలో ఏప్రిల్ కాంట్రాక్ట్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర 1.3 శాతం పెరిగి ₹1,57,540 వద్ద ట్రేడవుతోంది. అంటే సుమారు ₹2 వేల వరకు లాభపడింది.

Gold

దేశీయ బులియన్ మార్కెట్‌లో నేటి ధరల తటస్థంగా ఉన్నాయి. విజయవాడ నగరంలో ప్రస్తుతం 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర ₹15,791గా ఉంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర ₹14,475గా, 18 క్యారెట్ల బంగారం ధర ₹11,844గా నమోదైంది. హైదరాబాద్ నగరంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

వెండి ధరల్లో మాత్రం నిన్నటి ధరలే కొనసాగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 1 గ్రాము వెండి ధర ₹300గా, కిలో వెండి ధర ₹3,00,000గా ఉంది. ప్రస్తుతం స్థానిక మార్కెట్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు.

Gold రికార్డ్..

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం మరో కీలక మైలురాయిని దాటింది. స్పాట్ గోల్డ్ ధర మళ్లీ ఔన్సుకు 5,000 డాలర్ల మార్క్‌ను అధిగమించింది. సోమవారం మధ్యాహ్నం సమయానికి బంగారం ఔన్సు ధర 5,004 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, వెండి ధర ఔన్సుకు సుమారు 81 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ ధరలను అనుసరించే దేశీయంగా కూడా ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం దాదాపు ₹1.60 లక్షల వరకు పలుకుతుండగా, వెండి ధర ₹2.70 లక్షల పైనే కొనసాగుతోంది.

భారీ కరెక్షన్

ఇటీవల బంగారం, వెండిలో భారీ కరెక్షన్ రావడంతో ధరలు గణనీయంగా దిగొచ్చాయి. ముఖ్యంగా వెండి ధరలు ఒక దశలో సగానికి పైగా పడిపోవడంతో, కనిష్ఠ స్థాయిల వద్ద ట్రేడర్ల నుంచి బలమైన కొనుగోళ్ల మద్దతు లభిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. డాలర్ విలువ బలహీనపడటం కూడా ఈ లోహాలకు అనుకూలంగా మారింది.

భారీగా బంగారం కొన్న చైనా..

ఇదే సమయంలో చైనా సెంట్రల్ బ్యాంక్ వరుసగా 15వ నెల కూడా పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేయడం వల్ల గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ మరింత పెరిగింది. ఈ వారం వెలువడనున్న అమెరికా ఉద్యోగ గణాంకాలు, ద్రవ్యోల్బణ డేటా, అలాగే ఫెడరల్ రిజర్వ్ తీసుకునే పరపతి విధాన నిర్ణయాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇటీవల ఈ రెండు లోహాల్లో తీవ్ర ఊగిసలాటకు చైనా ట్రేడర్ల స్పెక్యులేటివ్ ట్రేడింగే ప్రధాన కారణమని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ వ్యాఖ్యానించారు

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+