పాతాళానికి దిగజారుతున్న బంగారం ధరలు
బంగారం, వెండి ధరలు నేడు కూడా తగ్గుముఖం పట్టాయి. భారీగా పెరిగిన మరుసటి రోజే ధరలో డౌన్ ట్రెండ్ కనిపించింది. వీటి ధరలు తగ్గడం వరుసగా ఇది రెండో ట్రేడింగ్ సెషన్. యుద్ధం ప్రారంభమైన తర్వాత, దేశీయ బులియన్ మార్కెట్లు వారంలో తొలి ట్రేడింగ్ సెషన్‌ను నష్టాలతో చూశాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నప్పటికీ, భారతీయ బంగారు ధరలలో మాత్రం లాభాల స్వీకరణ కనిపించింది. ఫలితంగా వీటి రేట్లు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.
గత రెండు ట్రేడింగ్ సెషన్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో భారీ పతనం కనిపించింది. భారత్‌లో 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు రూ. 17,002, 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 15,585 వద్ద ట్రేడ్ అయ్యాయి. సోమవారం నాటి క్లోజింగ్ సెషన్ తో పోల్చుకుంటే 10 గ్రాముల బంగారం ధరలో 2,200 రూపాయలకు పైగా క్షీణత కనిపించింది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో బలహీనత, అమెరికన్ డాలర్ బలం పుంజుకోవడం ఈ ధరల క్షీణతకు కారణమైంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి దాదాపు అయిదు శాతం మేర పడిపోయింది. ఔన్స్‌కు సుమారు 5,050 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో గోల్డ్ ఫ్యూచర్స్ అస్థిరమైన ట్రేడింగ్ సెషన్‌ను చవి చూసింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 2,890 తగ్గి రూ. 16,762కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల ధర రూ. 2,650 తగ్గి రూ. 1,53,650 వద్ద స్థిరపడింది. ఇదే ఒత్తిడి 18 క్యారెట్ల ధరలపై పడింది. 10 గ్రాముల 18 క్యారరెట్ల బంగారం రూ. 2,160 తగ్గి రూ. 1,25,720కి చేరింది.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 16,582, 22 క్యారెట్లు - రూ. 15,200, 18 క్యారెట్లు - రూ. 13,100
ముంబై..
24 క్యారెట్లు - రూ. 16,451, 22 క్యారెట్లు- రూ. 15,080, 18 క్యారెట్లు - రూ. 12,338
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 16,451, 22 క్యారెట్లు- రూ. 15,080, 18 క్యారెట్లు - రూ. 12,338
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 16,451, 22 క్యారెట్లు- రూ. 15,080, 18 క్యారెట్లు - రూ. 12,338
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 16,451, 22 క్యారెట్లు- రూ. 15,080, 18 క్యారెట్లు - రూ. 12,338
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 16,451, 22 క్యారెట్లు- రూ. 15,080, 18 క్యారెట్లు - రూ. 12,338
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications