భూకంపం పుట్టించిన బంగారం ధరలు: అల్లకల్లోలం: రూ. 1,56,000లకు పైమాటే.. !!
బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోని నెలకొంటోన్న పరిణామాలు, సురక్షిత పెట్టుబడికి పెరుగుతున్న డిమాండ్, యూఎస్ డాలర్ బలహీనపడటం వంటి కారణాలతో బులియన్ మార్కెట్‌లో కొనుగోళ్లు జోరందుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నాలు యూర్‌పతో వాణిజ్య యుద్ధానికి, నాటో కూటమిలో అలజడికి దారితీస్తాయన్న భయాలు మార్కెట్‌ను ప్రభావితం చేశాయి.
ఫ్యూచర్స్ మార్కెట్‌లో ఎంసీఎక్స్ గోల్డ్ ధర రాత్రికి రాత్రి ఏకంగా 6,000 రూపాయలకు పైగా పెరిగింది. 10 గ్రాములకు రూ. 1,55,886 వద్ద ట్రేడ్ అయ్యింది. వెండి ధర అదే స్థాయిలో జోరందుకుంది. 0.69 శాతం పెరిగి కిలోకు రూ. 3,25,903కు చేరింది. ఈ రెండింటి రేట్లు కూడా ఈ స్థాయికి చేరుకోవడం చరిత్రలో ఇదే తొలిసారి.

ముంబై స్పాట్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,54,800కి పెరిగింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,41,900 వద్ద లభించింది. వెండి కూడా స్పాట్ మార్కెట్‌లో కిలోకు రూ. 3,25,100 వద్ద సరికొత్త గరిష్ఠాన్ని తాకింది. మెట్రో నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,41,900 నుండి రూ. 1,42,050 వరకు నమోదైంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,54,800 నుండి రూ. 1,54,950 వరకు పలికింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర ఒక ఔన్స్ 4,800 డాలర్లను అధిగమించింది. ఇది రికార్డు. యూఎస్ స్పాట్ గోల్డ్ 1.2 శాతం పెరిగి 4,821.26 డాలర్ల వద్ద ముగిసింది.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,546, 22 క్యారెట్లు - రూ. 14,250, 18 క్యారెట్లు - రూ. 11,890
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,480, 22 క్యారెట్లు- రూ. 14,190, 18 క్యారెట్లు - రూ. 11,611
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,480, 22 క్యారెట్లు- రూ. 14,190, 18 క్యారెట్లు- రూ. 11,611
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,480, 22 క్యారెట్లు- రూ. 14,190, 18 క్యారెట్లు- రూ. 11,611
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,480, 22 క్యారెట్లు- రూ. 14,190, 18 క్యారెట్లు- రూ. 11,611
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,480, 22 క్యారెట్లు- రూ. 14,190, 18 క్యారెట్లు- రూ. 11,611
-
Gold: భారీగా పెరిగిన బంగారం ధరలు. పసిడి మార్కెట్‌లో పూనకాలు -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!











Click it and Unblock the Notifications