Gold Price Today : బంగారం ధరల భారీ పతనం.. నగలు కొనాలంటే ఇదే టైం!
బంగారానికి మక్కువ ఉన్నవారికి ఇది నిజంగా ఊరట కలిగించే వార్త. గత కొద్ది రోజులుగా పరుగులు పెడుతున్న పసిడి ధరలకు బ్రేకులు పడ్డాయి. అమెరికా అధ్యక్షుడు ఇటీవల ప్రకటించిన సుంకాల కారణంగా అంతర్జాతీయంగా బంగారం ధరలు పడిపోయాయి. ఇదే ప్రభావం మన దేశ రిటైల్ మార్కెట్లపై కూడా పడింది. అధిక ధరల భయంతో పక్కన పడిన కొనుగోళ్లకు ఇప్పుడు మళ్లీ ఊపు వచ్చే అవకాశముంది.
రాజకీయ పరిణామాలు, ట్రంప్ వేసి సుంకాలు, ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న ద్రవ్యోల్బణ భయాలను తగ్గించడంతో బంగారం మార్కెట్‌పై పడింది.. దీని ప్రభావంతో పసిడి ధరలు భారీగా తగ్గిపోవడం మొదలైంది. ముఖ్యంగా రిటైల్ మార్కెట్లలో డిమాండ్ తగ్గడంతో బులియన్ వ్యాపారులు ధరలను తగ్గించారు.

ఈ రోజు ఎంత తగ్గిందంటే?
ఈ రోజు దేశవ్యాప్తంగా 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 60 తగ్గి రూ. 8,255కి చేరింది. ఇదే సమయంలో 24 క్యారెట్ పసిడి రూ. 65 తగ్గి రూ. 8,973గా నమోదైంది. అంటే 100 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ. 6,000 మేర తగ్గింది. అలాగే 24 క్యారెట్ల బంగారం కూడా 100 గ్రాములకు రూ. 6,500 మేర తగ్గుదల నమోదు చేసింది.
ఢిల్లీ, ముంబైలో గోల్డ్ ధర..
దేశంలోని ప్రముఖ నగరాల్లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం రేట్లు చూస్తే చెన్నై, ముంబై, కలకత్తా, బెంగళూరు, కేరళ, మంగళూరు, బళ్లారి రూ. 8,225, ఢిల్లీ, జైపూర్, లక్నో, అయోధ్య, నోయిడా, గురుగ్రామ్ రూ. 8,240, వడోదర రూ. 8,230, నాశిక్ రూ. 8,228లకు చేరింది. 24 క్యారెట్ల గోల్డ్ ధరలు విషయాలనికొస్తే చెన్నై, ముంబై, కలకత్తా, బెంగళూరు, కేరళ, మంగళూరు, బళ్లారిలో రూ.8,973 లకు దిగివచ్చింది. ఢిల్లీ, జైపూర్, లక్నో, అయోధ్య, నోయిడా, గురుగ్రామ్ రూ. 8,988గా ఉంది. నాశిక్ రూ. 8,976, వడోదర రూ.8,230 దిగివచ్చింది.
హైదరాబాద్, విజయవాడలో ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో కూడా బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడల్లో చూస్తే 22 క్యారెట్ల బంగారం ధర రూ.8,225, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 8,973 చేరింది. ఇక వెండి విషయానికి వస్తే, రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర కిలోకు ₹1,03,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు ఇప్పుడే షాపింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. పసిడి ధరల తగ్గుదల మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉండటంతో, ఇది ఓ మంచి అవకాశం కావచ్చు. కానీ మరింత స్పష్టత కోసం రోజువారీ రేట్లను గమనిస్తూ కొనుగోలు చేయడం మేలంటున్నారు నిపుణులు.












Click it and Unblock the Notifications