తగ్గిన బంగారం ధరలు.. ఇప్పుడే కొనుగోలు చేయండి!

నవంబర్ 20, గురువారం నాడు దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా డాలర్ బలపడటం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను త్వరలో తగ్గిస్తుందనే అంచనాలు మందగించడం ఈ పతనానికి ప్రధాన కారణాలు. దీంతో పాటు పెట్టుబడిదారులు ఇప్పుడు అమెరికాకు సంబంధించిన తదుపరి కీలక ఆర్థిక నివేదిక అయిన యూఎస్ ఉద్యోగాల నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఈరోజు ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.1,24,870 గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,14,460 వద్ద నమోదైంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు(10 గ్రాములకు)

*దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,24,870 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,14,460గా ఉంది.

*దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,24,870 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,14,460గా ఉంది.

*హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,24,870 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,14,460గా ఉంది.
*చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,24,870 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,14,460గా ఉంది.
*బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,24,870 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,14,460గా ఉంది.
*కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,24,870 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,14,460గా ఉంది.
*పుణెలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,24,870 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,14,460గా ఉంది.
*జైపూర్ లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,24,870 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,14,460గా ఉంది.
*అహ్మదాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,24,920 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,14,510గా ఉంది.

Gold Prices For Thursday 20-11-2025

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో డిసెంబర్ 5 కాంట్రాక్టులకు బంగారం ధర 0.27% తగ్గి 10 గ్రాములకు రూ.1,22,719 వద్ద ట్రేడ్ అవుతోంది.ప్రపంచ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర 0.1% తగ్గి ఔన్స్‌కు 4,077.13 డాలర్ల వద్ద ఉంది.

గమనిక: పైన పేర్కొన్న ధరల్లో GST, TCS, తయారీ ఛార్జీలు (Making Charges) చేర్చబడలేదు. ఆయా రాష్ట్రాల పన్నులు, స్థానిక మార్కెట్ ధరల ఆధారంగా తుది ధరలో మార్పులు ఉండవచ్చు.

వెండి ధర: స్పాట్ మార్కెట్‌లో వెండి (సిల్వర్) ధర కిలోగ్రాముకు రూ.1,68,100 వద్ద ఉంది. ఫ్యూచర్స్ మార్కెట్‌లో మాత్రం వెండి 0.36% పెరిగి కిలోగ్రాముకు రూ.1,55,660 వద్ద ట్రేడవుతోంది.

బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు
ఒక బంగారం కొనుగోలుదారు లేదా పెట్టుబడిదారు తెలుసుకోవలసిన ముఖ్యమైన అంశాలు ఇవి. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరగడం వల్ల బంగారం ధర ఇతర కరెన్సీల వారికి మరింత ఖరీదైనదిగా మారుతుంది, తద్వారా ధరలు తగ్గుతాయి. US ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించే అంచనాలు బలహీనపడటం వల్ల డాలర్, బాండ్ ఈల్డ్ పెరుగుతాయి, ఇది సాధారణంగా బంగారం ధరను తగ్గిస్తుంది. భారతదేశంలో దిగుమతి సుంకాలు , రాష్ట్ర పన్నులు (GST), ఎక్స్ఛేంజ్ రేట్లలో హెచ్చుతగ్గులు ధరలను ప్రభావితం చేస్తాయి.పండుగలు, వివాహాల సీజన్లలో దేశీయంగా డిమాండ్ పెరగడం కూడా ధరలను కొంతవరకు ప్రభావితం చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+