తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు
కిందటివారం బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. చివరి మూడు రోజులూ బంగారం రేట్లు పెరగడం కనిపించింది. ఫలితంగా ఈ వారం కూడా పెరుగుదల కొనసాగుతుందనే అంచనాలు మార్కెట్ వర్గాల్లో వ్యక్తమౌతున్నాయి. ఈ పెరుగుదల ఉన్నప్పటికీ వీటి రేట్లు రికార్డు గరిష్ఠ స్థాయిల కంటే చాలా తక్కువ ధరకే ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా, వెండి. ఒక దశలో కిలో వెండి 4,00,000 రూపాయలను అందుకుంది. ఆ తర్వాత ఒక్కసారిగా తగ్గింది. దాదాపు 1.67 లక్షలు తక్కువకు ట్రేడ్ అవుతోంది.
అలాగే బంగారం కూడా. 24 క్యారెట్ల బంగారం కూడా రికార్డుస్థాయి ధర కంటే 36,000- 40,000 వేల రూపాయల వరకు తక్కువగా ఉంటోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో వెండి ఫ్యూచర్స్ ధరలో గత వారం గణనీయమైన పెరుగుదల నమోదైంది. ఈ నెల 13న కేజీ వెండి 2,44,360 వద్ద ముగిసింది. ఆ తర్వాత నిరంతర కొనుగోళ్ల కారణంగా శుక్రవారం నాటికి దాని ధర రూ. 2,52,944కి చేరింది. ఇలా వారం రోజుల్లో వెండి సుమారు రూ8,584 మేర ఖరీదుగా మారింది.

బంగారం ధరలో కూడా గత వారం పెరుగుదల నమోదైంది. MCXలో 10 గ్రాముల బంగారం ఫిబ్రవరి 13న రూ. 1,55,895 వద్ద ముగిసింది. వారం చివరి నాటికి ఇది రూ. 1,56,876కి చేరింది. అంటే, వారం రోజుల్లో 10 గ్రాముల బంగారం 981 రూపాయల మేర పెరిగింది. ఈ పెరుగుదల కూడా చివరి మూడు రోజుల్లో చోటు చేసుకుంది. బంగారం కూడా జనవరి 29న తన రికార్డు స్థాయిని తాకింది. ఆ రోజు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,93,096కి చేరుకుంది. ఆ తర్వాత లాభాల స్వీకరణ, మార్కెట్ ఒత్తిడి కారణంగా ధరలు తగ్గాయి.
ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకారం, దేశీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు ఇక ముందు కూడా పెరగొచ్చు. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,55,066, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,51,340 గా నమోదు కాగా.. ఇవి 1,60,000 రూపాయల వరకు వెళ్లొచ్చనే అంచనాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్త అనిశ్చితి, డాలర్ ఇండెక్స్‌లో హెచ్చుతగ్గులు, వడ్డీ రేట్లకు సంబంధించిన సూచనల కారణంగా బంగారం, వెండి ధరల్లో అస్థిరత కొనసాగవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 16,015, 22 క్యారెట్లు - రూ. 14,680, 18 క్యారెట్లు - రూ. 12,560
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,928, 22 క్యారెట్లు- రూ. 14,600, 18 క్యారెట్లు - రూ. 11,946
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,928, 22 క్యారెట్లు- రూ. 14,600, 18 క్యారెట్లు - రూ. 11,946
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,928, 22 క్యారెట్లు- రూ. 14,600, 18 క్యారెట్లు - రూ. 11,946
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,928, 22 క్యారెట్లు- రూ. 14,600, 18 క్యారెట్లు - రూ. 11,946
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,928, 22 క్యారెట్లు- రూ. 14,600, 18 క్యారెట్లు - రూ. 11,946
-
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
Gold: భారీగా పెరిగిన బంగారం ధరలు. పసిడి మార్కెట్లో పూనకాలు -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications