అగ్నిపర్వతం పేలినట్టు పేలుతున్న బంగారం ధరలు
దేశంలో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. కిందటి రోజుతో పోల్చుకుంటే రెండు శాతం వరకు వీటి రేట్లల్లో పెరుగుదల కనిపించింది. ఇక ఇప్పట్లో తగ్గే పరిస్థితులు లేకపోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్ పోకడలు, దేశీయ డిమాండ్ అలాగే మారుతున్న కరెన్సీ రేట్ల ప్రభావం బంగారం ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తోన్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం వీటి వైపు జనం మొగ్గుచూపడం కూడా అగ్నికి ఆజ్యం పోసినట్టయింది.
అంతర్జాతీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రెండు శాతానికి పైగా పెరిగి కొత్త రికార్డును సృష్టించాయి. బంగారం ఔన్సుకు 4,682 డాలర్లకు చేరువైంది. అదే సమయంలో వెండి 3.79 శాతం పెరిగి ఔన్సుకు 93 డాలర్ల వద్ద స్థిరపడింది. ముంబై మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,47,280గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,35,000 వద్ద నిలిచింది. మల్టీకమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో గోల్డ్ ఫ్యూచర్స్ 1.39 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.1,47,670 వద్ద ట్రేడ్ అయింది.

సిల్వర్ ఫ్యూచర్స్ 2.08 శాతం పెరిగి కిలోకు రూ. 3,16,721కి చేరుకుంది. భారత మార్కెట్‌లో వెండి కిలోకు రూ. 10,000 మేర పెరిగి రూ. 3,15,000 వద్ద నమోదైంది. ఢిల్లీ, జైపూర్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,35,100 కాగా, 24 క్యారెట్ల బంగారం రూ. 1,47,430 పలికింది. అహ్మదాబాద్, పుణెలో 22 క్యారెట్లకు రూ. 1,35,050, 24 క్యారెట్లకు రూ.1,47,330 నమోదయ్యాయి. ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,35,000 వద్ద ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,47,280కి చేరింది.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 14,848, 22 క్యారెట్లు - రూ. 13,610, 18 క్యారెట్లు - రూ. 11,355
ముంబై..
24 క్యారెట్లు - రూ. 14,728, 22 క్యారెట్లు- రూ. 13,500, 18 క్యారెట్లు - రూ. 11,046
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 14,728, 22 క్యారెట్లు- రూ. 13,500, 18 క్యారెట్లు- రూ. 11,046
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 14,728, 22 క్యారెట్లు- రూ. 13,500, 18 క్యారెట్లు- రూ. 11,046
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 14,728, 22 క్యారెట్లు- రూ. 13,500, 18 క్యారెట్లు- రూ. 11,046
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 14,728, 22 క్యారెట్లు- రూ. 13,500, 18 క్యారెట్లు- రూ. 11,046












Click it and Unblock the Notifications