Gold Rate Today : భగ్గుమంటున్న బంగారం ధరలు.. ఏ నగరంలో ఎంత పెరిగిందో తెలుసా?

బంగారం... ఇది కేవలం ఒక లోహం కాదు. ఇది భారతీయుల సంస్కృతిలో భాగం. ఇది పెట్టుబడి, ఇది ఆభరణం, ఇది శుభసూచకం. అందుకే బంగారం ధరలు పెరిగినా, తగ్గినా సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు అందరి దృష్టి దానిపైనే ఉంటుంది. పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు, బంగారం దుకాణాల వద్ద సందడి నెలకొంటుంది.

పసిడి ధరలు తగ్గేటప్పుడు రూ. 10లలో తగ్గి పెరిగేటప్పుడు అమాంతం వందల్లో పెరుగుతోంది. సామాన్యుడు అటు వైపు చూడలేని విధంగా చుక్కలు చూపిస్తున్నాయి. రోజు రోజుకు రాకెబ్ వేగంతో దూసుకెళ్తున్నాయి. నిన్నటి ధరలతో పోల్చితే ఈ రోజు భారీగీ గోల్డ్ ధరలు పెరిగాయి. 22 క్యారెట్ గోల్డ్ గ్రాముకు రూ. 105 పెరగ్గా.. 24 క్యారెట్ బంగారం గ్రాముకు రూ . 114 పెరిగింది.

gold-prices-skyrocket-check-latest-rates-across-indian-cities

ఢిల్లీ, ముంబైలో బంగారం ధరలు ఇలా..
దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ. 8,355 గా ఉంది. ఇక స్వచ్ఛమైన 24 క్యారెట్ల గోల్డ్ ధర గ్రాముకు రూ. 9,133 పలుకుతోంది. ఇక్కడ 22 క్యారెట్ గోల్డ్ నిన్నటితో పోల్చితే గ్రాముకు 105, 24 క్యారెట్ బంగారం గ్రాముకు రూ.114 పెరిగింది. లక్నోలో 22 క్యారెట్ గోల్డ్ గ్రాముకు రూ. 8355, చేరింది. 24 క్యారెట్ బంగారం గ్రాముకు రూ.9,113 పెరిగింది.పశ్చిమ భారతదేశంలోని ముంబై, పూణే, కోల్‌కతాలో కూడా దాదాపు ఇంతే స్థాయిలో ధరలు ఉన్నాయి.

హైదరాబాద్, విజయవాడలో గోల్డ్ ధరలు..
దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాలైన చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్నం నగరాల్లో బంగారం ధరలు దాదాపు ఒకే విధంగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖలో 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ. 8340 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 9098 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ గోల్డ్ గ్రాముకు రూ. 8,340, 24 క్యారెట్ బంగారం రూ.9,098 కి పెరిగింది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.9,090 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.8,340 ఉంది. అంటే 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు రూ.83,400 , 24 క్యారెట్ పసిడి రూ 90,980 చేరింది.

అటు వెండి కూడా కొండెక్కి కూర్చోంది . గ్రాముకు రూ. 3 లు, కేజీకి రూ. 3000 పెరిగింది. గ్రాము వెండి రూ. 105 చేరుకోగా.. కేజీ లక్షా 5 వేలకు చేరింది. అయితే వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉంటాయి. స్థానిక పన్నులు, రవాణా ఛార్జీలు, డిమాండ్, సరఫరా వంటి అంశాలు ధరలను ప్రభావితం చేస్తాయి. అంతేకాకుండా, నగరాల్లోని నగల వ్యాపారుల సంఘాలు కూడా ధరలను నిర్ణయించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.

Take a Poll

బంగారం కొనుగోలు చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. నమ్మకమైన నగల దుకాణాలలో మాత్రమే కొనండి. బంగారం స్వచ్ఛతను నిర్ధారించుకోండి. 22 క్యారెట్ల మరియు 24 క్యారెట్ల బంగారం ధరలను సరిపోల్చుకోండి. కొనుగోలు సమయంలో తప్పకుండా బిల్లు తీసుకోవడం మర్చిపోవద్దు.

గమనిక: పైన పేర్కొన్న ధరలు ప్రస్తుత మార్కెట్ ధరలు మాత్రమే. ఇవి ఎప్పుడైనా మారవచ్చు. కొనుగోలు చేసే ముందు మీ స్థానిక నగల దుకాణంలో ధరలను నిర్ధారించుకోవడం ఉత్తమం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+