పండుగ పూట దిగొచ్చిన బంగారం.. 10 గ్రాముల ధర ఎంతంటే..?

దసరా సంబరాలు మొదలయ్యాయి. శరన్నవరాత్రులు, బతుకమ్మ ఉత్సవాలతో దేశం మొత్తం పండగ వాతావరణంలో మునిగిపోయింది. ఈ శుభ సందర్భంలో బంగారం కొనుగోళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అయితే, గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతూ ఆందోళన కలిగించిన బంగారం ధరలు, సెప్టెంబర్ 22న స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. కొనుగోలుదారులకు ఇది కాస్త ఊరట కలిగించే విషయమే.

ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో బంగారం, వెండి ధరలు గతేడాది రికార్డు స్థాయికి చేరాయి. ప్రత్యేకించి, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం, హెచ్-1బీ వీసా ఫీజు పెంపు వంటి అంశాలు ప్రపంచ బులియన్ మార్కెట్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. దీంతో బంగారం ధరలు అమాంతం పెరిగి కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేశాయి.

Gold Rates in september 22th 2025

హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు (సెప్టెంబర్ 22, 2025)

బంగారం ధరలు:

24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం: 10 గ్రాముల ధర నిన్నటి ధర వద్దే స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం దీని ధర రూ. 1,12,150గా ఉంది.

22 క్యారెట్ల బంగారం: నగల తయారీకి ఉపయోగించే 10 గ్రాముల బంగారం ధరలో ఎటువంటి మార్పు లేదు. ఇది రూ. 1,02,800 వద్ద ట్రేడవుతోంది.

వెండి ధరలు:

వెండి: వెండి ధరలు కూడా రెండు రోజులుగా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 1,45,000 మార్క్‌ వద్ద నిలకడగా కొనసాగుతోంది. అయితే, దేశంలోని ఇతర ప్రధాన నగరాలైన పుణె, వడోదర, ఢిల్లీ, కోల్‌కతా వంటి చోట్ల కిలో వెండి ధర రూ.1,35,000 వద్ద ఉంది.

పండగల సీజన్‌లో బంగారం ధరలు స్థిరంగా ఉండడం కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చినప్పటికీ, రికార్డు స్థాయి ధరలు మాత్రం ఇప్పటికీ ఆందోళన కలిగించే విషయమే. కొనుగోలు చేసే ముందు తాజా ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+