బంగారం ధరల సీన్ రివర్స్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో యుద్ధాన్ని మరికొన్ని వారాల పాటు కొనసాగిస్తామని ప్రకటించిన నేపథ్యంలో దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఒక శాతానికి పైగా పడిపోయాయి. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,49,910 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర 1,37,350 రూపాయల వద్ద నమోదైంది. ఈ ఉదయం ట్రేడింగ్‌లో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ధరలు 4.45 శాతం తగ్గి 1,51,400 వద్ద సిద్ధపడ్డాయి.

అదే సమయంలో, వెండి ధరలు 4.54 శాతం క్షీణించి కిలో 2,32,444 రూపాయలకు దిగొచ్చాయి. ఈ నెలలో బంగారం ధరలు 14 శాతం కంటే ఎక్కువ పడిపోయాయి. 2008 అక్టోబర్ తర్వాత అత్యధిక పతనం. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధరలు పతనం అయ్యాయి. స్పాట్ గోల్డ్ 1.3 శాతం తగ్గి 4,694.48 డాలర్లకు చేరగా, అమెరికన్ గోల్డ్ ఫ్యూచర్స్ 1.9 శాతం పడి 4,723.70 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

Gold Slips as Trump Iran Remarks Trigger Market Pullback Mumbai 24K Gold Dips to Rs 149910 per 10g

దేశంలోని ప్రధాన నగరాలలో నేటి బంగారం ధరలను పరిశీలిస్తే ఢిల్లీ, జైపూర్‌లో 22 క్యారెట్లు రూ. 1,37,500 కాగా, 24 క్యారెట్లు రూ. 1,50,060 వద్ద నిలిచింది. అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు రూ. 1,37,400, 24 క్యారెట్లు రూ. 1,49,960 పలుకుతోంది. పూణే, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,37,350, 24 క్యారెట్లు రూ.1,49,910గా నమోదైంది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 15,218, 22 క్యారెట్లు - రూ. 13,950, 18 క్యారెట్లు - రూ. 11,635

ముంబై..

24 క్యారెట్లు - రూ. 15,142, 22 క్యారెట్లు- రూ. 13,880, 18 క్యారెట్లు - రూ. 11,357

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 15,142, 22 క్యారెట్లు- రూ. 13,880, 18 క్యారెట్లు - రూ. 11,357

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 15,142, 22 క్యారెట్లు- రూ. 13,880, 18 క్యారెట్లు - రూ. 11,357

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 15,142, 22 క్యారెట్లు- రూ. 13,880, 18 క్యారెట్లు - రూ. 11,357

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 15,142, 22 క్యారెట్లు- రూ. 13,880, 18 క్యారెట్లు - రూ. 11,357

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+