రైతులకు గుడ్‌న్యూస్.. ఉల్లి ఎగుమతులపై 20 శాతం సుంకం రద్దు !
రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది! ఉల్లి ఎగుమతులపై గతంలో విధించిన 20% సుంకాన్ని పూర్తిగా రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్పు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. 2023 డిసెంబర్ 8నుంచి మే 3, 2024 వరకు ప్రభుత్వం ఉల్లి ఎగుమతిని పూర్తిగా నిషేధించింది. అనంతరం, 2024 సెప్టెంబర్‌లో 20% ఎగుమతి సుంకం విధించింది. అయినప్పటికీ, ఈ ఆర్థిక సంవత్సరంలో మార్చి 18 వరకు 1.17 మిలియన్ టన్నుల ఉల్లి ఎగుమతులు జరిగాయి.
రైతులకు ప్రయోజనం - పంటకు మంచి ధర
తాజా నిర్ణయంతో ఉల్లి రైతులు మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. గత కొంతకాలంగా ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టడంతో, రైతుల ఆదాయాన్ని కాపాడే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వినియోగదారుల వ్యవహారాల శాఖ సూచన మేరకు, రెవెన్యూ శాఖ సుంకం రద్దుకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. పంట దిగుబడి పెరగడంతో ప్రధాన ఉల్లి ఉత్పత్తి రాష్ట్రాల్లో ధరలు తగ్గడం ప్రారంభమైంది. ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి హోల్‌సేల్ మార్కెట్లైన మహారాష్ట్రలోని లాసల్‌గావ్, పింపల్‌గావ్ మార్కెట్లలో మార్చి 21న క్వింటాల్ ఉల్లి ధర వరుసగా ₹1,330, ₹1,325గా ఉంది.

భారీ ఉత్పత్తి అంచనా - మార్కెట్ స్థిరీకరణ
ఉల్లి ధరలు తగ్గడంతో రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఎగుమతలపై గతంలో విధించిన 20 శాతం సుంకాన్నీ పూర్తిగా రద్దుచేసింది. ఈ నిర్ణయంతో రైతులు పండించిన ఉల్లికి మంచి ధర పలుకుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది రబీ సీజన్ ఉల్లి ఉత్పత్తి 22.7 మిలియన్ టన్నులుగా ఉండొచ్చని వ్యవసాయ మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. గత ఏడాది 19.2 మిలియన్ టన్నుల ఉత్పత్తితో పోలిస్తే ఇది 18% పెరుగుదల. భారతదేశం మొత్తం ఉల్లి ఉత్పత్తిలో 70-75% వాటా రబీ పంటదే. ఖరీఫ్ ఉల్లి పంట అక్టోబర్-నవంబర్‌లో మార్కెట్‌కు రాకపోతే, రబీ ఉత్పత్తి దేశీయ ధరల్ని నియంత్రించడంలో కీలకంగా మారుతుంది.
రైతులకు రక్షణ, వినియోగదారులకు లాభం
"రైతులకు గిట్టుబాటు ధరలతో పాటు, సామాన్యులకు ఉల్లి అందుబాటు ధరలో ఉండేలా చూసే ప్రభుత్వ నిబద్ధతకు ఈ నిర్ణయం మరో నిదర్శనం" అని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం రైతులకు నిజమైన వరం . తమ పంటకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు, వినియోగదారులకు కూడా ఉల్లి అందుబాటు ధరలో లభించేందుకు వీలు ఉంటుందని పేర్కొంటున్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications