సమోసాలతో వేల కోట్ల సామ్రాజ్యం.. హల్దీరామ్స్ సక్సెస్ సీక్రెట్ ఇదే!

మన వీధి సందు చివర దొరికే వేడి వేడి సమోసా, కారకారంగా ఉండే భుజియా ముందర పాశ్చాత్య దేశాల బర్గర్లు, పిజ్జాలు తేలిపోతున్నాయి. మనం రోజూ సరదాగా తినే పక్కా దేశీ స్నాక్స్.. అంతర్జాతీయ బ్రాండ్లకు చుక్కలు చూపిస్తూ, వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా విస్తరిస్తాయని ఎవరైనా ఊహించారా? కానీ ఇది నిజం! విదేశీ ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి భారతదేశాన్ని ముంచెత్తుతోందని భావిస్తున్న వేళ, మన సాంప్రదాయ రుచులతోనే ఓ భారతీయ సంస్థ దిగ్గజ బహుళజాతి కంపెనీలకు నిద్రలేకుండా చేస్తోంది.

సంఖ్యల్లో మనోళ్ల హవా.. వాళ్లు ఎక్కడ? మనం ఎక్కడ?

వ్యాపార గణాంకాలను ఒక్కసారి పరిశీలిస్తే ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవల ఢిల్లీ, నాగ్‌పూర్ బిజినెస్‌లను కలిపి రూపుదిద్దుకున్న 'హల్దీరామ్ స్నాక్స్ ఫుడ్' మార్కెట్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఒక్క ఏడాదిలోనే ఈ సంస్థ దాదాపు రూ. 12,977 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించడమే కాకుండా, అందులో సుమారు రూ. 1,195 కోట్ల నికర లాభాన్ని సొంతం చేసుకుంది. అదే సమయంలో భారతదేశంలో ఎంతో హంగామా చేసే ప్రముఖ అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ చైన్ మెక్‌డొనాల్డ్స్ (వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వర్ల్డ్) ఆదాయం దాదాపు రూ. 2,657 కోట్లుగా, లాభం రూ. 323 కోట్లుగా మాత్రమే నమోదైంది. అంటే లాభాల్లోనూ, ఆదాయంలోనూ మన దేశీ రుచులు మెక్‌డొనాల్డ్స్ కంటే చాలా ముందంజలో ఉన్నాయి.

Haldiram s vs McDonald s How Samosas Defeated Burgers to Build a Multi-Billion-Dollar Snack Giant in India
Success Story: అప్పుతో మొదలైన అసాధారణ ప్రస్థానం! తెలుగోడి సైకిల్ విప్లవం
Success Story: అప్పుతో మొదలైన అసాధారణ ప్రస్థానం! తెలుగోడి సైకిల్ విప్లవం

అన్ని వర్గాలకూ చేరువైన 'హైబ్రిడ్' నెట్‌వర్క్

ఇది కేవలం సమోసాకు, బర్గర్‌కు మధ్య జరిగిన పోటీ మాత్రమే కాదు.. వారి వ్యాపార వ్యూహాల మధ్య ఉన్న వ్యత్యాసానికి నిదర్శనం. మెక్‌డొనాల్డ్స్ కేవలం త్వరితగతిన ఆహారాన్ని అందించే రెస్టారెంట్లపైనే ఆధారపడితే, హల్దీరామ్స్ ఒక అడుగు ముందుకేసి 'హైబ్రిడ్' నమూనాను ఎంచుకుంది. స్వీట్లు, నమ్‌కీన్, రెడీ-టు-ఈట్ ప్యాకెట్లను కిరాణా షాపుల ద్వారా ప్రతీ ఇంటికీ చేర్చడంతో పాటు, సొంతంగా భారీ రెస్టారెంట్లను నడుపుతోంది. చిన్న బంక్ షాపు నుంచి పెద్ద సూపర్ మార్కెట్ వరకు ప్రతీ చోటా వీళ్ల ఉత్పత్తులు అందుబాటులో ఉండటమే ఈ అపార విజయం వెనుక ఉన్న అసలు రహస్యం.

'చింతగింజలకు ఉప్పు': దీని వెనుక ఇన్ని కోట్ల బిజినెస్ ఉందా? తెలుసుకుంటే షాకే!
'చింతగింజలకు ఉప్పు': దీని వెనుక ఇన్ని కోట్ల బిజినెస్ ఉందా? తెలుసుకుంటే షాకే!

మన రుచులే మన బలం.. ప్రపంచానికి పాఠం!

విదేశీ బ్రాండ్లను, వారి సంస్కృతిని గుడ్డిగా అనుకరిస్తేనే వ్యాపారంలో సక్సెస్ సాధిస్తామనుకోవడం పొరపాటని హల్దీరామ్స్ నిరూపించింది. మన ప్రాంతీయ రుచులకు ఆధునిక తయారీ విధానం, అద్భుతమైన ప్యాకేజింగ్, పక్కా సరఫరా వ్యవస్థను తోడు చేస్తే ఏ స్థాయి వ్యాపారాన్నైనా నిర్మించవచ్చని స్పష్టం చేసింది. సామాన్యమైన సమోసాలు, కారంతో మొదలైన ఒక చిన్న వ్యాపారం.. నేడు ప్రపంచ వేదికపై బిలియన్ డాలర్ల సామ్రాజ్యంగా నిలవడం ప్రతీ భారతీయ బ్రాండ్‌కూ ఒక గొప్ప స్ఫూర్తి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+