ఇన్ఫోసిస్‌కు మరో సీనియర్ గుడ్‌బై: సీఎఫ్ఓ రాజీనామా, కారణమిదే!

న్యూఢిల్లీ: దేశీయ ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్‌ నుంచి మరో సీనియర్ అధికారి వైదొలిగారు. కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌(సీఎఫ్‌వో) రంగనాథ్‌ తన పదవికి రాజీనామా చేశారు. 18ఏళ్ల పాటు ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్న రంగనాథ్‌ 'కొత్త విషయాల్లో వృత్తిపరమైన అవకాశాల' దృష్ట్యా తన బాధ్యతల నుంచి వైదొలిగినట్లు కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ.. 'ఇన్ఫోసిస్‌లో 18ఏళ్ల విజయవంతమైన కెరీర్‌ తర్వాత కొత్త విషయాల్లో వృత్తిపరమైన అవకాశాల కోసం నేను సిద్ధమయ్యాను. గత మూడేళ్లలో కంపెనీకి ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. అయినప్పటికీ వాటిని అధిగమించి మేం ఉత్తమ ఆర్థిక ఫలితాలను సాధించామని చెప్పేందుకు గర్వపడుతున్నా' అని అన్నారు.

Infosys CFO M D Ranganath resigns

రంగనాథ్‌ రాజీనామాపై ఇన్ఫోసిస్‌ బోర్డు ఛైర్మన్‌ నందన్‌ నీలేకని స్పందించారు. 'గత 18ఏళ్లలో రంగనాథ్‌ కంపెనీలో ఎన్నో కీలక బాధ్యతలు చేపట్టారు. కంపెనీ విజయాల్లో భాగమయ్యారు. ఈ సుదీర్ఘ కాలంలో ఆయనలోని విస్తృత నాయకత్వ లక్షణాలను చూశాను' అని నీలేకని వ్యాఖ్యానించారు.

అయితే, ఈ సంవత్సరం నవంబరు 16 వరకు రంగనాథ్‌ సీఎఫ్‌వో పదవిలో కొనసాగుతారు. దీంతో కొత్త సీఎఫ్‌వో కోసం ఇన్ఫోసిస్‌ బోర్డు ఇప్పటికే వేట మొదలుపెట్టింది. గతంతో సీఎఫ్‌వోగా పనిచేసిన రాజీవ్‌ బన్సాల్‌ రాజీనామా చేయడంతో 2015లో రంగనాథ్‌ ఈ బాధ్యతలు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+