బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే..

అమెరికా డాలరులో క్షీణత తర్వాత దేశంలో బంగారం ధరలు అత్యధిక ధరతో ప్రారంభమయ్యాయి. ఆ ధర అలా ఉన్నప్పటికీ పెట్టుబడిదారులు సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచుతుందా? లేదా? అని ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తున్నారు. వడ్డీ ధరల పెంపు బంగారం ధరలపై ప్రభావం చూపుతుందనే విషయం తెలిసిందే. మార్కెట్ పరిస్థితుల ప్రకారం బంగారం ధరలు ఎలా మారనున్నాయో తెలుసుకుందాం.

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 2023, అక్టోబర్ ఎక్స్‌పైరీ గల గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 10 గ్రాములకు రూ.59,550 వద్ద ప్రారంభమైంది.వివిధ ఆసియా స్టాక్ మార్కెట్లలో ఉదయం ప్రారంభ సెషన్‌లో బంగారం ధరలు 0.20% తగ్గాయి. అంతర్జాతీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధర ఔన్సు స్థాయికి దాదాపు 1,938 డాలర్లుగా ఉంది. వెండి ధర కిలో రూ.72,280 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో కనిష్ఠ స్థాయి రూ.72,212.

gold price

రష్యా, సౌదీ అరేబియా ముడిచమురు సరఫరాను కఠినతరం చేశాయి. ఈ ప్రభావం డాలర్ పై పడింది. ఆర్థిక వ్యవస్థను మెరుగు పరిచేందుకు చెనా అడిషనల్ రిలీఫ్ ప్యాకేజ్ ప్రకటించవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.యూఎస్ ఆర్థిక వ్యవస్థ 1,87,000 ఉద్యోగాలను జోడించింది. అంచనా వేసిన రెండు లక్షల కంటే ఈ సంఖ్య తక్కువ. సగటు గంట ఆదాయం వార్షిక ప్రాతిపదికన 4.4% పెరిగింది. అంచనా మాత్రం 4.2%.

gold price

పెట్టుబడిదారులు 2023, ఆగస్టు 8 నుంచి 10 వరకు జరిగే RBI MPC సమావేశాన్ని నిశితంగా గమనించాలి. వ్యాపారులు చైనా, యూఎస్ ద్రవ్యోల్బణ డేటాను గమనిస్తారు. దీనివల్ల బంగారం ధరలు ఒక పరిధిలో ఉంటాయి. ఔన్సుకు 1,935 డాలర్లు, 10 గ్రాములకు రూ.59,100 వద్ద డాలరు మద్దతునిస్తోంది. 10 గ్రాములకు రూ.59,850 దాటితే, రాబోయే రోజుల్లో 10 గ్రాముల ధర రూ.60,500కి చేరుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+