Gold Price Today: బంగారం ప్రియులకు పండగే పండగ! దిగివస్తున్న పసిడి ధరలు.. నేటి ధరలు ఇవే!
బంగారం కొనాలని చూస్తున్నారా? అయితే మీకు శుభవార్త! గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ఇప్పుడు నెమ్మదిగా దిగివస్తున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టడం కొనుగోలుదారులకు ఎంతో ఊరటనిచ్చే విషయం. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, ఉద్రిక్తతలు, డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వంటి కారణాలతో దేశీయంగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు స్వల్పంగా ధరలు తగ్గడంతో, పసిడి మార్కెట్లో కొనుగోళ్ల సందడి మొదలయ్యే అవకాశం ఉంది.
భారతదేశంలో బంగారానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తరతరాలుగా ఇది కేవలం ఆభరణంగానే కాకుండా, సురక్షితమైన పెట్టుబడిగా, ఆపదకాలంలో ఆదుకునే ఆస్తిగా భావిస్తూ వస్తున్నాం. అందుకే దీనిని "పసిడి" అని ప్రేమగా పిలుచుకుంటాం. అలాంటి బంగారం, సాధారణంగా స్థిరమైన పెట్టుబడిగా పేరుగాంచినప్పటికీ, ఈ ఏప్రిల్ నెలలో తీవ్రమైన ఒడిదుడుకులకు లోనవుతోంది. ధరలు అమాంతం ఆకాశాన్నంటడం, ఆ వెంటనే అనూహ్యంగా పడిపోవడం వంటి పరిణామాలు పెట్టుబడిదారులను, బంగారం కొనాలనుకునే సామాన్యులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

నేటి గోల్డ్ ధరలు ఇలా ఉన్నాయి:
ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.3 తగ్గి రూ.9,002కు చేరింది. అదే 24 క్యారెట్ బంగారం కూడా రూ.3 తగ్గి గ్రాముకు రూ.9,821 వద్ద కొనసాగుతోంది. అంటే 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర ప్రస్తుతం రూ.90,020 కాగా, 24 క్యారెట్ బంగారం ధర రూ.98,210గా ఉంది. గత వారం ప్రారంభంలో వీటి ధరలు అధికంగా ఉండగా, ఇప్పుడు కొంత ఊరట లభిస్తోంది.
నగరాలవారీగా బంగారం ధరలు:
హైదరాబాద్, విజయవాడ, వరంగల్, విశాఖపట్నం
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.9,821
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.9,000
అహ్మదాబాద్ :
24 క్యారెట్ల బంగారం: రూ.9,826
22 క్యారెట్ల బంగారం: రూ.9,007
అమృతసర్ & ఢిల్లీ -
24 క్యారెట్ల బంగారం: రూ.9,831
22 క్యారెట్ల బంగారం: రూ.9,017
బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, మదురై, ముంబై, కోల్కతా, కేరళ -
24 క్యారెట్ల బంగారం: రూ.9,821
22 క్యారెట్ల బంగారం: రూ.9,002
ధరలు తగ్గిన కారణం ఏమిటి?
అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలపడటం, పెట్టుబడిదారుల ధనవినియోగ మార్గాలు మారటం, ఆభరణాల డిమాండ్ తక్కువగా ఉండటం వంటి అంశాలు బంగారం ధరల తగ్గుదలకి దోహదం చేస్తున్నాయి. ఇక భారతదేశంలో ఉగాది, అక్షయ తృతీయ వంటి పండుగల తర్వాత తాత్కాలికంగా డిమాండ్ తగ్గడం కూడా ప్రభావం చూపినట్లు నిపుణులు చెబుతున్నారు.
గోల్డ్ కొనుగోలు పై సూచనలు:
ఈ ధరల తగ్గుదలను అవకాశంగా మార్చుకునే వారికి ఇది మంచి టైమ్. అయితే కొనుగోలు చేసే ముందు బ్యాంక్ రేట్లు, జువెల్లరీ షాపుల మెయికింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటి విషయాలను పరిగణలోకి తీసుకోవాలి.












Click it and Unblock the Notifications