Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

LIC కొత్త పాలసీ ‘జీవన్ ఉత్సవ్’.. గ్యారెంటీడ్ ఇన్‌కం ప్లాన్

ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తాజాగా 'జీవన్ ఉత్సవ్' పేరుతో కొత్త బీమా పాలసీని మార్కెట్లోకి తీసుకొచ్చింది. పొదుపుతో పాటు జీవిత భద్రత కోరుకునే వారికి అనువుగా, సింగిల్ ప్రీమియం విధానంలో జీవితాంతం ఆదాయం అందించేలా ఈ పాలసీని రూపొందించింది. ఒకేసారి ప్రీమియం చెల్లిస్తే, ఎంపిక చేసిన నిబంధనల మేరకు 100 ఏళ్ల వయసు వరకు వార్షిక ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

ఈ పాలసీ నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ ప్లాన్ కావడం గమనార్హం. అంటే మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా, ఎల్‌ఐసీ ముందుగానే నిర్ణయించిన ప్రయోజనాలే పాలసీదారులకు అందుతాయి. సంస్థ లాభాల్లో వాటా ఉండదు. ఈ పాలసీ జనవరి 12 నుంచి కొనుగోలుకు అందుబాటులోకి రానుంది.

LIC

అర్హత & బీమా మొత్తం

ఈ పాలసీని 30 రోజుల వయసున్న శిశువుల నుంచి 65 ఏళ్ల వయసు వరకు ఉన్న వారు తీసుకోవచ్చు. కనీస ప్రాథమిక బీమా మొత్తం రూ.5 లక్షలు, ఆపై అవసరాన్ని బట్టి ఎంత మొత్తమైనా ఎంపిక చేసుకోవచ్చు. గరిష్ఠ పరిమితి లేదు.

గ్యారెంటీడ్ అడిషన్స్ (GA)

పాలసీ కాలపరిమితిలో ప్రతి రూ.1,000 బీమా మొత్తానికి ఏటా రూ.40 చొప్పున గ్యారెంటీడ్ అడిషన్స్ జమ అవుతాయి. ఇవి పాలసీ ప్రయోజనాలను మరింత పెంచుతాయి.

రెండు ఆదాయ ఆప్షన్లు

'జీవన్ ఉత్సవ్' పాలసీలో పాలసీదారుల అవసరాలకు అనుగుణంగా రెండు రకాల ఆదాయ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.

ఆప్షన్-1: రెగ్యులర్ ఇన్‌కం బెనిఫిట్

ఈ ఆప్షన్‌లో, పాలసీదారులు ఎంచుకున్న వ్యవధి (7 నుంచి 17 సంవత్సరాల మధ్య) పూర్తైన తర్వాత, ప్రతి ఏడాది ప్రాథమిక బీమా మొత్తంలో 10 శాతం ఆదాయం లభిస్తుంది. ఎంపిక చేసిన కాలం పూర్తైన తర్వాతి ఏడాది నుంచే ఈ ఆదాయం ప్రారంభమవుతుంది.

ఆప్షన్-2: ఫ్లెక్సీ ఇన్‌కం బెనిఫిట్

ఈ ఆప్షన్‌లో వచ్చే 10 శాతం వార్షిక ఆదాయాన్ని వెంటనే తీసుకోకుండా, ఎల్‌ఐసీ వద్దే నిల్వ ఉంచుకోవచ్చు. ఆ మొత్తంపై ఏటా 5.5 శాతం వడ్డీ (చక్రవడ్డీతో) లభిస్తుంది. అవసరాన్ని బట్టి, జమ అయిన మొత్తంలో 75 శాతం వరకు ఎప్పుడైనా వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంటుంది.

మరణం, మెచ్యూరిటీ ప్రయోజనాలు

పాలసీ వ్యవధిలో పాలసీదారుడు మరణిస్తే, నామినీకి ప్రాథమిక బీమా మొత్తం + ఇప్పటివరకు జమ అయిన గ్యారెంటీడ్ అడిషన్స్ చెల్లిస్తారు. పాలసీదారు గడువు పూర్తయ్యే వరకు జీవించి ఉంటే, మెచ్యూరిటీ సమయంలో ప్రాథమిక బీమా మొత్తం లేదా సింగిల్ ప్రీమియానికి 1.25 రెట్లు (ఏది ఎక్కువైతే అది), దానికి తోడు గ్యారెంటీడ్ అడిషన్స్ కలిపి చెల్లిస్తారు.

అదనపు రైడర్లు

ఈ పాలసీకి ఎల్‌ఐసీ యాక్సిడెంట్ డెత్ అండ్ డిజెబిలిటీ బెనిఫిట్ రైడర్, ఎల్‌ఐసీ న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్ వంటి అదనపు రైడర్లను జోడించుకోవచ్చు. వీటికి అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని అర్హత ప్రమాణాలు వర్తిస్తాయి.

ఉదాహరణతో అర్థం చేసుకుంటే...

35 ఏళ్ల వయసున్న సాగర్, రూ.10 లక్షల బీమా మొత్తంతో ఈ పాలసీ తీసుకున్నారని అనుకుందాం. గ్యారెంటీడ్ అడిషన్ కాలాన్ని 10 ఏళ్లుగా ఎంచుకుంటే, అతడు రూ.8,08,650 సింగిల్ ప్రీమియం చెల్లించాలి. అతడికి 45 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత, ప్రతి ఏడాది రూ.లక్ష చొప్పున ఆదాయం అందుతుంది. ఈ ఆదాయం అతడు వందేళ్లు వచ్చే వరకు కొనసాగుతుంది.

10 ఏళ్ల పాలసీ కాలానికి గాను, గ్యారెంటీడ్ అడిషన్స్ కింద ఏటా రూ.40 వేల చొప్పున అదనంగా జమ అవుతాయి. పాలసీ మధ్యలో ఏదైనా జరిగితే, నామినీకి సుమారు రూ.14.22 లక్షలు అందుతాయి.
అదే ఫ్లెక్సీ ఇన్‌కం ఆప్షన్ ఎంచుకుంటే, అవసరమైనప్పుడు... జమ అయిన మొత్తంలో 75 శాతం వరకు తీసుకోవచ్చు. మొత్తం నిల్వపై ఎల్‌ఐసీ 5.5 శాతం వడ్డీ చెల్లిస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+