LIC సరికొత్త ప్లాన్లు చూశారా? 3 బిగ్ ఆఫర్లు.. ఈ నెల 19 నుంచి కొత్త పాలసీలు!
ప్రముఖ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) తమ వినియోగదారుల కోసం మరో అద్భుతమైన అవకాశం తీసుకొచ్చింది. పాలసీదారుల భవిష్యత్తు అవసరాలు, ఆరోగ్య అత్యవసర పరిస్థితులు, పింఛను భద్రతను దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 19, 2026 నుంచి మూడు కొత్త పథకాలను మార్కెట్లోకి అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ విభాగంలో ఈ మూడు కొత్త పథకాలను రూపొందించారు. ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్ లోనూ ఏజెంట్లు, బ్రోకర్ల ద్వారా ఈ పాలసీలను సొంతం చేసుకోవచ్చు.
1. న్యూ జీవన్ ధారా-II: రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన పింఛను!
రిటైర్మెంట్ తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం కోరుకునే వారి కోసం 'న్యూ జీవన్ ధారా-II' (ప్లాన్ నంబర్ 892) ప్లాన్ను ఎల్ఐసీ తీసుకొచ్చింది. ఇది ఒక ఇండివిజువల్ సేవింగ్స్ విభాగానికి చెందిన డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్.

- ప్రత్యేకతలు: ఈ ప్లాన్ తీసుకునే సమయంలోనే యాన్యుటీ (పింఛను) రేట్లు గ్యారెంటీగా ఖరారవుతాయి.
- చెల్లింపు విధానాలు: సింగిల్ ప్రీమియం లేదా రెగ్యులర్ ప్రీమియం చెల్లించే వెసులుబాటు ఉంది. అలాగే సింగిల్ లైఫ్ లేదా జాయింట్ లైఫ్ యాన్యుటీ ఆప్షన్లను ఎంచుకోవచ్చు.
- టాప్-అప్ సదుపాయం: డిఫర్మెంట్ వ్యవధిలో అదనపు ప్రీమియం చెల్లించి తమ యాన్యుటీ మొత్తాన్ని పెంచుకునే (టాప్-అప్) అరుదైన అవకాశం ఈ ప్లాన్ ద్వారా లభిస్తుంది.
2. హెల్త్ షీల్డ్: ఆసుపత్రి ఖర్చులకు కొండంత అభయం!
సడన్గా వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి ఆర్థిక రక్షణ కల్పించేందుకు 'హెల్త్ షీల్డ్' (ప్లాన్ నంబర్ 907) అనే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ను తీసుకొచ్చారు.
- హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్: చికిత్స సమయంలో ప్రతిరోజూ హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ అందించడంతో పాటు, ఏదైనా పెద్ద సర్జరీలు లేదా క్రిటికల్ ఇల్ నెస్ సోకినప్పుడు ఎల్ఐసీ ఒకేసారి భారీ మొత్తాన్ని చెల్లిస్తుంది.
- ఫ్యామిలీ కవరేజ్: ఈ ప్లాన్ కింద కుటుంబం మొత్తానికి రక్షణ కల్పించవచ్చు. అలాగే నో-క్లెయిమ్ బెనిఫిట్ ద్వారా హెల్త్ కవర్ను పెంచుకోవచ్చు. అవసరమైతే అదనపు ప్రీమియంతో రైడర్లను కూడా జోడించుకోవచ్చు.
3. న్యూ క్యాన్సర్ కవర్: క్యాన్సర్ మహమ్మారిపై ఆర్థిక పోరాటానికి ధీటైన ప్లాన్!
క్యాన్సర్ వంటి మహమ్మారి బారిన పడినప్పుడు అయ్యే భారీ ఖర్చుల నుంచి కుటుంబాలను కాపాడేందుకు 'న్యూ క్యాన్సర్ కవర్' (ప్లాన్ నంబర్ 908) ప్లాన్ దోహదపడుతుంది.
- నగదు పరిహారం: ఆసుపత్రిలో అయిన అసలు బిల్లులతో సంబంధం లేకుండా, ముందస్తుగా ఎంచుకున్న 'సమ్ అస్యూర్డ్' ఆధారంగా ఎల్ఐసీ నేరుగా పరిహారాన్ని చెల్లిస్తుంది.
- నెలవారీ ఆదాయం: క్యాన్సర్ ముదిరిన తీవ్రమైన దశలో ఉన్నట్లు నిర్ధారణ అయితే, నెలకు కొంత మొత్తాన్ని స్థిరమైన ఆదాయంగా అందించడంతో పాటు రాబోయే ప్రీమియం వేవర్ బెనిఫిట్ చేసే సౌకర్యాన్ని నిబంధనల ప్రకారం ఇస్తుంది.
పాలసీ ఎలా తీసుకోవాలి?
అక్టోబర్ 19, 2026 నుంచి ఎల్ఐసీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో గానీ, లేదా లైసెన్స్ పొందిన ఇన్సూరెన్స్ ఏజెంట్లు, కార్పొరేట్ ఏజెంట్లు, బ్రోకర్లు, మార్కెటింగ్ సంస్థల ద్వారా ఆఫ్లైన్లో గానీ ఈ మూడు పాలసీలను కొనుగోలు చేయవచ్చు. అభ్యర్థులు తమ వయస్సు, అర్హతలు, ప్రీమియం ఛార్ట్, ఇతర మినహాయింపుల సమాచారం కోసం ఎల్ఐసీ అధికారిక బ్రోచర్ను పరిశీలించవచ్చని సంస్థ తెలిపింది.














Click it and Unblock the Notifications
