Credit Card అప్లికేషన్ ఎందుకు రిజెక్ట్ అవుతోంది?
లోన్ కోసం అప్లై చేసి "Congratulations!" అనే మెసేజ్ కోసం ఫోన్ చూస్తూ ఉండగా... బదులుగా "We regret to inform you..." అని వస్తే ఎలా ఉంటుంది? ఒక్క క్షణం గుండె బరువెక్కుతుంది. "నా జీతం తక్కువే కాబట్టి అయి ఉంటుంది..." అని మనమే మనకు కారణం చెప్పేసుకుంటాం.
కానీ నిజం ఏమిటంటే.. బ్యాంకులు కేవలం మీ జీతం చూసి నిర్ణయం తీసుకోవు. మీ డబ్బు అలవాట్లు, చెల్లింపుల క్రమశిక్షణ, క్రెడిట్ కార్డ్ వాడకం.. ఇవన్నీ కలిసి మీ ఆర్థిక వ్యక్తిత్వాన్ని చెప్పేస్తాయి. చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు అసలు గుట్టు ఎక్కడుందో సింపుల్‌గా చూద్దాం.

Credit స్కోర్ తక్కువగా ఉండట
ఇది చాలా కామన్ కారణం. మీరు EMI ఒకటి ఆలస్యంగా చెల్లించినా, క్రెడిట్ కార్డ్ బిల్ మిస్ చేసినా.. అది మీ క్రెడిట్ రిపోర్టులో రికార్డ్ అవుతుంది. "ఒక్కసారి ఆలస్యం చేశాను, అంతేగా!" అనిపించొచ్చు. కానీ బ్యాంక్ దృష్టిలో అది ఒక రిస్క్ సిగ్నల్. మీ స్కోర్ బ్యాంక్ నిర్ణయించిన కనీస స్థాయికి దిగువన ఉంటే, దరఖాస్తు వెంటనే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
Credit Card లిమిట్ ఫుల్‌గా వాడటం
ప్రతి నెలా మీ కార్డ్ గరిష్ట పరిమితి దాకా వాడుతున్నారా? మీరు టైమ్‌కి బిల్ చెల్లిస్తున్నా కూడా, ఇది బ్యాంక్‌కు ఒక మెసేజ్ ఇస్తుంది. "ఇతను అప్పులపై ఎక్కువగా ఆధారపడుతున్నాడు" అని. క్రెడిట్ వినియోగం తక్కువగా ఉంచితేనే మీరు బాధ్యతాయుతంగా వాడుతున్నట్టు కనిపిస్తుంది.
తక్కువ సమయంలో చాలా అప్లికేషన్లు
ఒక నెలలో రెండు-మూడు లోన్లు లేదా కార్డుల కోసం అప్లై చేస్తే, ప్రతి సారి మీ క్రెడిట్ రిపోర్ట్‌పై హార్డ్ చెక్ జరుగుతుంది. ఎక్కువ చెక్స్ అంటే "డబ్బు కోసం ఆతురతగా ఉన్నాడు" అనే ఇంప్రెషన్. దాంతో స్కోర్ కూడా తాత్కాలికంగా పడిపోతుంది.
ఉద్యోగం - ఆదాయం స్థిరంగా లేకపోవడం
బ్యాంక్‌కు స్థిరత్వం చాలా ముఖ్యం. తరచూ ఉద్యోగం మారడం, ఆదాయం ఎప్పుడో ఎక్కువగా, ఎప్పుడో తక్కువగా ఉండటం.. ఇవన్నీ రిస్క్‌గా కనిపిస్తాయి. స్వయం ఉపాధి చేసేవారికి ఆదాయ ప్రూఫ్ క్లియర్‌గా లేకపోతే కూడా సమస్యే.
Credit రిపోర్ట్‌లో తప్పులు
కొన్ని సార్లు తప్పు మీది కాదు. ఇప్పటికే క్లోజ్ చేసిన లోన్ ఇంకా యాక్టివ్‌గా చూపించవచ్చు. మీరు చేయని డిఫాల్ట్ కూడా కనిపించొచ్చు. ఇవి సరిచేయకపోతే, మీ స్కోర్‌కు అనవసర నష్టం.
ఒకసారి రిజెక్ట్ అయ్యిందంటే అంతే అన్నట్టు కాదు. అది ఒక సిగ్నల్ మాత్రమే.. "కొంచెం ఫైనాన్స్ హాబిట్స్ మెరుగుపరుచుకో" అని. బిల్లులు టైమ్‌కి చెల్లించడం, కార్డ్ వినియోగం తగ్గించడం, అవసరం లేకుండా కొత్త లోన్ల కోసం అప్లై చేయకపోవడం.. ఇవి కొద్దికాలంలోనే మీ స్కోర్‌ను మెరుగుపరుస్తాయి.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications