All Time Record: నడి సంద్రంలో 12.7 మిలియన్ టన్నుల సరుకు మార్పిడి..

భారతదేశ సముద్ర వాణిజ్య చరిత్రలోనే గుజరాత్‌లోని దీన్‌దయాళ పోర్ట్ మరో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ప్రపంచ నౌకా రంగానికి భారత్ ఎంతటి కీలక వ్యాపార కేంద్రంగా మారుతుందో చాటిచెబుతూ, సముద్రంలో నేరుగా ఒక ఓడ నుంచి మరొక ఓడలోకి సరుకులను మార్చే 'షిప్-టు-షిప్ ట్రాన్స్‌షిప్‌మెంట్' ప్రక్రియలో సరికొత్త ఆల్ టైమ్ రికార్డ్‌ నమోదు చేసింది. సెప్టెంబర్ 1, 2026 నాటికి ఏకంగా 12.7 మిలియన్ టన్నుల ట్రాన్స్‌షిప్‌మెంట్ మైలురాయిని అధిగమించి, దేశంలోనే అగ్రగామి ఓడరేవుగా తన సత్తాను మరోసారి ప్రపంచానికి నిరూపించుకుంది.

ఈ ఒక్క రికార్డే కాదు, ఇటీవల కండ్లా పోర్ట్ వరుస విజయాలతో హోరెత్తిస్తోంది. ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2026-27) ఆగస్టు 22 నాటికే 70 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణాను పూర్తి చేసి, ఇండియాలోని అన్ని ప్రధాన పోర్టుల కంటే వేగంగా ఈ మార్కును దాటిన మొదటి పోర్టుగా నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఏకంగా 32 రోజుల ముందే ఈ భారీ లక్ష్యాన్ని చేరుకోవడం విశేషం. ఏటా 23 శాతం వృద్ధిరేటుతో దూసుకుపోతూ, జూలై 27న ఒకే రోజులో అత్యధికంగా 7.83 లక్షల మెట్రిక్ టన్నుల రవాణా చేసి పాత రికార్డులను తిరగరాసింది.

Maritime Growth Record DPA Kandla Handles All-Time High 12 7 MT Transhipment via Ship to Ship Operations

వాడినాన్ ఆఫ్‌షోర్ వద్ద రికార్డు స్థాయిలో లిక్విడ్ కార్గో రవాణా!

పోర్ట్‌కి చెందిన వాడినాన్ ఆఫ్‌షోర్ ఆయిల్ టెర్మినల్ వద్ద కూడా సరుకు రవాణా వేగం పుంజుకుంది. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 5.09 లక్షల మెట్రిక్ టన్నుల లిక్విడ్ కార్గో విజయవంతంగా హ్యాండిల్ చేసి సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేసింది. పోర్ట్ ఛైర్మన్ సుశీల్ కుమార్ సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. "ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు, కండ్లా పోర్ట్ టీమ్ రాత్రింబవళ్లు పడిన కష్టం, సహకారం వల్లనే సాధ్యమైంది" అని ఆనందం వ్యక్తం చేశారు.

సరిహద్దు దాటి పరుగులు తీసిన మన రైలు.. ఇక నేరుగా విదేశానికి
సరిహద్దు దాటి పరుగులు తీసిన మన రైలు.. ఇక నేరుగా విదేశానికి

దేశానికి తొలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చారిత్రక పోర్ట్!

గుజరాత్‌లోని కచ్ జిల్లా గాంధీధామ్ సమీపంలో ఉన్న కండ్లా పోర్ట్‌కు ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉంది. స్వాతంత్య్రానంతరం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకలా నిలిచిన ఈ పోర్ట్, 2016లోనే ఏటా 100 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోను హ్యాండిల్ చేసిన మొదటి భారతీయ పోర్టుగా చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 150 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణాను దాటేసి, మన దేశ లాజిస్టిక్స్ రంగానికి ప్రధాన చోదక శక్తిగా మారింది.

Rupee: దుమ్ము రేపిన రూపాయి, రెండు నెలల రికార్డులు బద్ధలు
Rupee: దుమ్ము రేపిన రూపాయి, రెండు నెలల రికార్డులు బద్ధలు

వ్యాపార దిగ్గజంగా మారుతున్న కండ్లా పోర్ట్!

మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, వేగవంతమైన సేవలను అందుబాటులోకి తేవడమే కండ్లా పోర్ట్ సాధిస్తున్న ఈ అద్భుత రికార్డులకు ప్రధాన కారణం. సముద్ర మార్గంలో రవాణాను మరింత సరళతరం చేస్తూ, దేశ వాణిజ్య రంగాన్ని పరుగులు తీస్తున్న కండ్లా పోర్ట్ ప్రయాణం నేడు ఇతర పోర్టులకు కూడా ఆదర్శంగా నిలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+