నెలారంభంలో బంగారం ధరల్లో భారీ పతనం

పసిడి ప్రియులకు శుభవార్త అందింది. దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా పసిడి ధరల్లో ఇదే ట్రెండ్ నెలకొంది. ఈ నెల ఆరంభంలోనూ అదే కొనసాగుతోంది. ఈ పరిణామాలతో కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు కొంత ఉపశమనం పొందుతున్నారు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో కూడా బంగారం, వెండి ఫ్యూచర్స్ ధరలు తీవ్ర ఒడిదొడుకుల నడుమ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

డిజిటల్ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్ లో ఆగస్టు గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ధర సుమారు 0.94 శాతం క్షీణించి 10 గ్రాములకు రూ. 1,41,600 వద్ద కదలాడుతోంది. అదే సమయంలో వెండి ఫ్యూచర్స్ ధర కూడా దాదాపు 1.86 శాతం మేర తగ్గింది. కిలో వెండి ధర 2,24,520 రూపాయలు పలుకుతోంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల్లో వస్తున్న భారీ మార్పులు దేశీయ బులియన్ విపణిని నేరుగా ప్రభావితం చేస్తున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

MCX Gold Slips to Rs 141600 as Silver Futures Down in 24K 22K and 999 Rates Marginally Down

సాధారణంగా ఆభరణాల తయారీకి ఎక్కువగా వినియోగించే 22 క్యారెట్ల బంగారాన్ని వినియోగదారులు కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. అత్యంత స్వచ్ఛమైనదిగా భావించే 24 క్యారెట్ల పసిడితో పోలిస్తే 22 క్యారెట్ల పసిడి ధర కాస్త తక్కువగా ఉంటుంది. నేడు ఈ రెండు రకాల బంగారం ధరలు కూడా దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో తగ్గాయి. వీటితో పాటు వెండి ధర కూడా కిలోకు గణనీయంగా పడిపోయింది.

హైదరాబాద్, చెన్నైలల్లో కిలో వెండి ధర గరిష్టంగా రూ.2,34,900 గా నమోదైంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరులలో కిలో వెండి ధర రూ.2,35,000 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా వివిధ రాష్ట్రాల్లో ఉండే స్థానిక పన్నులు, రవాణా ఛార్జీలు, ముడిసరుకు డిమాండ్ ఆధారంగా ధరలు మారుతుంటాయి.

హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,740, 22 క్యారెట్లు రూ.1,29,928 వద్ద స్థిరపడింది. ఇక్కడ కేజీ వెండి రూ.2,24,390 పలుకుతోంది. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,740, 22 క్యారెట్లు రూ. 1,29,828 వద్ద స్థిరపడింది. ఇక్కడ కేజీ వెండి రూ.2,24,220 ట్రేడ్ అవుతోంది.

చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,930, 22 క్యారెట్లు రూ. 1,30,103 వద్ద స్థిరపడింది. ఇక్కడ కేజీ వెండి రూ.2,24,690 పలుకుతోంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,340, 22 క్యారెట్లు రూ. 1,29,562 వద్ద స్థిరపడింది. ఇక్కడ కేజీ వెండి రూ.2,24,120 గా రికార్డయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+