ఫార్చ్యూనర్ పని ఖతం!: MG నుంచి దిమ్మతిరిగే ఎస్‌యూవీ.. లాంచ్ అప్పుడే!
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ 'మెజెస్టర్' (Majestor) ను ఫిబ్రవరి 12, 2026న భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. గతేడాది జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో తొలిసారిగా ప్రదర్శించిన ఈ భారీ ఎస్‌యూవీ ప్రస్తుతం మార్కెట్లో రారాజుగా వెలుగుతున్న టయోటా ఫార్చ్యూనర్‌కు గట్టి సవాల్ విసరనుంది. దీని ధర సుమారు రూ. 40 లక్షల నుంచి రూ. 50 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండే అవకాశం ఉంది.
డిజైన్, లుక్ అదిరింది..
ఎంజీ మెజెస్టర్ చూడటానికి చాలా భారీగా, విలాసవంతంగా ఉంటుంది. ఇది పొడవులో 5 మీటర్ల కంటే ఎక్కువగా ఉండటంతో ఫార్చ్యూనర్ కంటే పెద్దదిగా కనిపిస్తుంది. దీని ముందు భాగంలో భారీ ఆక్టాగోనల్ గ్రిల్, నిలువుగా అమర్చిన ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఆకర్షణీయమైన ఎల్‌ఈడీ డీఆర్ఎల్స్ ఉన్నాయి. వెనుక వైపు కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్, 19-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ దీనికి ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి.

లగ్జరీ ఇంటీరియర్, ఫీచర్లు
కారు లోపలి భాగం చాలా విశాలంగా, అత్యాధునిక సాంకేతికతతో కూడి ఉంటుంది. ఇందులో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా వంటి సౌకర్యాలు ఉన్నాయి. ప్రయాణీకుల సౌకర్యం కోసం మసాజ్ ఫంక్షన్‌తో కూడిన వెంట్లేటెడ్ సీట్లు, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, సురక్షిత ప్రయాణం కోసం లెవల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటి ఫీచర్లు హైలైట్‌గా నిలవనున్నాయి.
పవర్ ఫుల్ ఇంజిన్
మెజెస్టర్ రెండు రకాల 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో వచ్చే అవకాశం ఉంది. ఒకటి సింగిల్ టర్బో ఇంజిన్ (161 PS పవర్, 373 Nm టార్క్), మరొకటి శక్తివంతమైన ట్విన్-టర్బో ఇంజిన్ (218 PS పవర్, 480 Nm టార్క్). దీనికి 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పాటు కఠినమైన దారుల్లో ప్రయాణించేందుకు వీలుగా అడ్వాన్స్‌డ్ 4WD (ఫోర్ వీల్ డ్రైవ్) సిస్టమ్, విభిన్న టెర్రైన్ మోడ్స్ కూడా ఉండనున్నాయి.












Click it and Unblock the Notifications