శుభవార్త: ఫిబ్రవరిలోనే జియో 4జీ స్మార్ట్‌ఫోన్, తైవాన్ కంపెనీతో ఒప్పందం
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరతీస్తోంది. 4జీ వాయిస్ స్మార్ట్‌ఫోన్‌ను రిలయన్స్ మార్కెట్లోకి తీసుకు రానుంది. ఈ మేరకు తైవాన్ కు చెందిన చిప్ ల తయారీ కంపెనీ మీడియా టెక్‌తో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకొంది. త్వరలోనే 4జీ స్మార్ట్‌పోన్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు జియో ప్రయత్నాలను ప్రారంభించింది.
సంచలనాలతోనే జియో మార్కెట్లోకి ప్రవేశించింది. ఉచిత వాయిస్ కాల్స్, ఉచిత డేటాతో ఇతర టెలికం ఆపరేటర్లకు జియో చుక్కలు చూపించింది. దీంతో జియోకు పోటీగా మార్కెట్లో నిలబడాలంటే టారిఫ్ ప్లాన్లను మార్చుకోవాల్సిన అనివార్య పరిస్థితులు ఇతర టెలికం కంపెనీలకు నెలకొంంది.
మార్కెట్లో ఇతర టెలికం ఆపరేట్లకు పోటీగా నిలబడేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్లతో జియో అడుగులేస్తోంది. దీంతో ప్రత్యర్థులకు గట్టి సవాల్‌ను విసురుతోంది. తాజాగా 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని జియో యోచిస్తోంది.

4జీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టనున్న జియో
ఎల్‌వైఎఫ్ బ్రాండు కింద ఆల్ట్రా లో-ధరతో ఆండ్రాయిడ్ గో ఆధారితంగా 4జీ వాయిస్‌ఓవర్ ఎల్టీఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయాలని రిలయన్స్ ప్లాన్ చేస్తోంది. దీనికోసం తైవనీస్ చిప్‌సెట్ తయారీదారి మీడియా టెక్‌తో కూడా భాగస్వామ్యం ఏర్పరచుకుంది. ఇండియాకు చెందిన మొబైల్ కంపెనీలతో పోటీని ఎదుర్కొనేందుకు జియో ఈ నిర్ణయం తీసుకొందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

తక్కువ ధరకే 4జీ స్మార్ట్‌ఫోన్
ఇండియాకు చెందిన మొబైల్ కంపెనీలు కొన్ని మొబైల్ ఆపరేటర్లతో ఒప్పందం కుదుర్చుకొని స్మార్ట్‌ఫోన్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లను ముందుకు తీసుకువస్తున్నాయి. అయితే అదే తరహలోనే జియో కూడ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ మేరకు తక్కువ ధరల్లో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావాలని జియో యోచిస్తుందని సమాచారం.

మీడియా టెక్ కంపెనీతో జియో ఒప్పందం
రిలయన్స్ జియో 4జీ టెలికాం ఆపరేటర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు చిప్‌సెట్ తయారీదారి మీడియాటెక్ ధృవీకరించింది. ఆండ్రాయిడ్ గో స్మార్ట్‌ఫోన్‌పై జియో బులిష్‌గా ఉందని, తమతో కలిసి రిలయన్స్ పనిచేస్తుందని మీడియాటెక్ ఇంటర్నేషనల్ కార్పొరేట్ సేల్స్ కంట్రీ హెడ్ కుల్దీప్ మాలిక్ తెలిపారు.
Recommended Video


ఫిబ్రవరిలోనే 4 జీ స్మార్ట్‌పోన్ మార్కెట్లోకి
2018 ఫిబ్రవరిలోనే జియో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావాలని జియో ప్లాన్ చేస్తోంది అయితే ఇతర మొబైల్ కంపెనీలు ప్రస్తుతం ఇస్తున్న ధరతో సమానంగా లేదా దాని కంటే తక్కువ ధరకు జియో 4జీ స్మార్ట్‌ఫోన్ ను అందిస్తోందా అనేది 15 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదు.












Click it and Unblock the Notifications