ఆందోళనకరంగా బంగారం ధరలు
దేశీయ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ఈ వారం మొదట్లో ఆరంభమైన పసిడి రేట్ల పరుగు వేగం కొనసాగుతూనే వస్తోంది. ఇప్పుడు మరింత పెరిగింది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ లో స్పాట్ బంగారానికి నెలకొన్న డిమాండ్, అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ బలహీనపడటం, ప్రస్తుతం ఉన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కూడా పసిడి ధరల పెరుగుదలకు కారణం అయ్యాయి. గోల్డ్ ఫ్యూచర్స్ దాదాపు 0.65 శాతం మేర పెరిగాయి.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,39,320, 22 క్యారెట్లు రూ. 1,27,710గా నమోదైంది. స్పాట్ మార్కెట్‌లో కిలో వెండి సుమారు రూ.2,48,900గా ఉంది. ఢిల్లీ, జైపూర్‌లలో 22 క్యారెట్లకు రూ. 1,27,860, 24 క్యారెట్లకు రూ. 1,39,470. అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లకు రూ.1,27,760, 24 క్యారెట్లకు రూ.1,39,370గా నమోదయ్యాయి. పుణె, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి ఇతర ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రూ.1,27,710, 24 క్యారెట్లు రూ.1,39,320గా స్థిరంగా కొనసాగింది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 13,965, 22 క్యారెట్లు - రూ. 12,900, 18 క్యారెట్లు - రూ. 10,765
ముంబై..
24 క్యారెట్లు - రూ. 14,046, 22 క్యారెట్లు- రూ. 12,875, 18 క్యారెట్లు - రూ. 10,534
ఢిల్లీ..
24 క్యారెట్లు - రూ. 14,061, 22 క్యారెట్లు- రూ. 12,890, 18 క్యారెట్లు - రూ. 10,549
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 14,046, 22 క్యారెట్లు- రూ. 12,875, 18 క్యారెట్లు- రూ. 10,534
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 14,046, 22 క్యారెట్లు- రూ. 12,875, 18 క్యారెట్లు- రూ. 10,534
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 14,046, 22 క్యారెట్లు- రూ. 12,875, 18 క్యారెట్లు- రూ. 10,534
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 14,046, 22 క్యారెట్లు- రూ. 12,875, 18 క్యారెట్లు- రూ. 10,534












Click it and Unblock the Notifications