రిలయన్స్ సంచలనం: సింగపూర్ కంటే 3 రెట్లు పెద్ద సోలార్ ప్లాంట్

భారతీయ పారిశ్రామిక రంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL) మరోసారి తన సత్తా చాటుకుంది. భారత ఇంధన భవిష్యత్తును పూర్తిగా మార్చేసే ఒక భారీ ప్రణాళికను ఆ సంస్థ ఛైర్మన్ ముఖేష్ అంబానీ వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకైక సోలార్ ప్లాంట్‌ను గుజరాత్‌లోని కచ్‌లో నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మెగా ప్రాజెక్ట్ మొత్తం 5,50, 000 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ పరిమాణం సింగపూర్ దేశం కంటే దాదాపు మూడు రెట్లు పెద్దది కావడం గమనార్హం.

ఈ మెగా ప్రాజెక్ట్ భారత విద్యుత్ రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి సుమారు 4 ఎకరాలు అవసరమని అంచనా వేస్తే.. ఈ ప్లాంట్ మొత్తం 137.5 గిగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదు. కంపెనీ 'రిలయన్స్ స్పీడ్'తో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భారీ ప్రాజెక్ట్ నిర్మాణం 2026 చివరి నాటికి దశలవారీగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Reliance to Build World s Largest Solar Plant in Gujarat 3 Times Bigger Than Singapore

దేశ విద్యుత్ అవసరాలకు ఒక గేమ్-ఛేంజర్
రిలయన్స్ వార్షిక సాధారణ సమావేశంలో ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. ఈ కచ్ సోలార్ ప్లాంట్ కేవలం ఒక విద్యుత్ ప్రాజెక్ట్ మాత్రమే కాదని, ఇది భారతదేశానికి ఒక గేమ్-ఛేంజర్ అని చెప్పారు. ఈ ప్లాంట్ రాబోయే దశాబ్ధంలో భారతదేశ మొత్తం విద్యుత్ అవసరాలలో 10 శాతం వరకు తీర్చగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది దేశ ఇంధన భద్రతను గణనీయంగా పెంచుతుంది.

సోలార్ పీవీ తయారీలో సాంకేతిక ముందడుగు
ఈ ప్రాజెక్టుకు అవసరమైన సోలార్ మాడ్యూల్స్‌ను కూడా రిలయన్స్ సొంతంగా తయారు చేయనుంది. జామ్ నగర్‌లోని తన గిగా కాంప్లెక్స్‌లో అత్యాధునిక సోలార్ పీవీ తయారీ ప్లాట్‌ఫారంను ఇప్పటికే ప్రారంభించింది. మొదటి దశలో 200 మెగావాట్ల హెటెరో జంక్షన్ టెక్నాలజీ(HJT) ఆధారిత సోలార్ మాడ్యూల్స్‌ను తయారు చేసింది. ఈ మాడ్యూల్స్‌లో అనేక విశేషాలు ఉన్నాయి. అవి సాధారణ మాడ్యూల్స్‌తో పోలిస్తే 10 శాతం ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఉష్ణోగ్రతలకు 20 శాతం మెరుగైన పనితీరును చూపుతాయి. 25 శాతం తక్కువ డీగ్రేడేషన్‌ను కలిగి ఉంటాయి.

రిలయన్స్ ఈ మాడ్యూల్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సంవత్సరానికి 10 గిగావాట్లకు, ఆ తర్వాత 20 గిగావాట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనితో ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద, అత్యంత సమీకృత ఏకైక సోలార్ పీవీ తయారీ కాంప్లెక్స్‌గా మారనుంది. ఈ విజన్ ప్రాజెక్ట్‌తో రిలయన్స్ ఇంధన రంగంలో తన నాయకత్వాన్ని మరోసారి నిరూపించుకోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+