93 ఏళ్ల వారసత్వం: మార్కెట్లోకి మోస్ట్ పవర్‌ఫుల్ 650సీసీ బుల్లెట్!
Royal Enfield 650: రాయల్ ఎన్‌ఫీల్డ్ తన చారిత్రక బుల్లెట్ శ్రేణిలో మోస్ట్ పవర్‌ఫుల్ మోడల్ అయిన బుల్లెట్ 650ని ఇటలీలోని మిలాన్‌లో జరిగిన EICMA 2025 మోటార్‌షోలో ఆవిష్కరించింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ ఇండియాలో బైక్ లవర్స్‌కు ఎంతో ఇష్టమైన బండిగా ప్రసిద్ధి చెందింది. 1932లో తొలిసారిగా విడుదలైనప్పటి నుంచి అనేక అప్‌డేట్లు చేసినా దాని క్లాసిక్ శైలిని కోల్పోకుండా.. ఇప్పటికీ 93 ఏళ్ల వారసత్వాన్ని కొనసాగిస్తూ కంపెనీ ఈ మోస్ట్ పవర్‌ఫుల్ మోడల్‌ను పరిచయం చేసింది.
కొత్త బుల్లెట్ 650లో శక్తివంతమైన 647.95 సీసీ ప్యారలల్-ట్విన్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది ఇప్పటికే ఇంటర్‌సెప్టర్, సూపర్ మీటియోర్ వంటి ఇతర 650సీసీ మోడల్స్‌లో విజయవంతంగా ఉపయోగించిన ఎయిర్, ఆయిల్-కూల్డ్ యూనిట్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ 7,250 RPM వద్ద 47 హార్స్‌పవర్ శక్తిని, 5,650 RPM వద్ద 52.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్లిప్పర్ క్లచ్‌తో కూడిన సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది.

ఈ మోటార్‌సైకిల్ స్టీల్ ట్యూబ్యులర్ స్పైన్ ఫ్రేమ్‌పై నిర్మించబడింది. రైడింగ్ సౌలభ్యం కోసం ముందు వైపున 120 మిమీ ట్రావెల్‌తో కూడిన 43 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, వెనుక వైపున 90 మిమీ ట్రావెల్ సస్పెన్షన్‌ను అందించే ట్విన్ షాక్‌లు ఉన్నాయి. భద్రతా పరంగా దీనిని డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో స్టాండర్డ్‌గా అందించారు. బ్రేకింగ్ కోసం 320 మిమీ ఫ్రంట్ డిస్క్, 300 మిమీ రియర్ డిస్క్ బ్రేక్ ఉన్నాయి. 19-అంగుళాల ఫ్రంట్ వీల్, 18-అంగుళాల రియర్ వీల్‌తో రోడ్డుపై పట్టు మరింత పటిష్టంగా ఉంటుంది.
బుల్లెట్ 650 తన చారిత్రక క్లాసిక్ లుక్‌ను పక్కన పెట్టకుండానే ఆధునిక ఫీచర్లను కూడా కలిగి ఉంది. టియర్‌డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్‌పై చేతితో పెయింట్ చేసిన పిన్‌స్ట్రైప్స్, టైగర్-ఐ పైలట్ ల్యాంప్‌తో కూడిన ఎల్ఈడీ హెడ్‌లైట్, క్రోమ్-ప్లేటెడ్ మడ్‌గార్డ్ వంటివి పాత మోడల్స్‌ను గుర్తుకు తెస్తాయి. ఎత్తైన హ్యాండిల్‌బార్, ఫుల్ బెంచ్ సీట్ నిటారుగా ఉండే, సౌకర్యవంతమైన రైడింగ్ పోస్చర్‌ను అందిస్తాయి. ఆధునికత కోసం ఇందులో సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ (ట్రిప్, గేర్ పొజిషన్ డిజిటల్ రీడౌట్‌తో), ఎల్ఈడీ లైటింగ్, USB-C ఛార్జింగ్ పాయింట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.
బుల్లెట్ 650కి సంబంధించిన ఇతర ముఖ్య వివరాలు చూస్తే.. దీని ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 14.8 లీటర్లు, గ్రౌండ్ క్లియరెన్స్ 154 మిమీ, కర్బ్ వెయిట్ 243 కిలోగ్రాములుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని ధర యూకేలో 6,749 యూరోలు (సుమారు రూ.7.79 లక్షలు), నార్త్ అమెరికాలో 7,499 డాలర్లు (సుమారు రూ.6.65 లక్షలు)గా ఉంది. బుల్లెట్ 650 త్వరలో భారతదేశంలో అమ్మకానికి అందుబాటులోకి వస్తుందని, ఇక్కడి మార్కెట్‌కు అనుగుణంగా మరింత పోటీ ధరతో విడుదల కావచ్చని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications