Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

స్టాక్ మార్కెట్ క్లోజ్: ఈ వారంలో 3 రోజులు ట్రేడింగ్ బంద్!

Stock Market Holidays: స్టాక్ మార్కెట్ ట్రేడర్లు, ఇన్వెస్టర్లకు అలర్ట్. ఈ వారం షేర్ మార్కెట్ వరుసగా సెలవులను జరుపుకోనుంది.శని, ఆదివారాలతో పాటు జనవరి 15(గురువారం)న కూడా స్టాక్ మార్కెట్లు పనిచేయవని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్(బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్(ఎన్ఎస్ఈ) అధికారికంగా ప్రకటించాయి. దీంతో ఈ వారంలో ట్రేడింగ్ కేవలం 4 రోజులు మాత్రమే జరుగుతుంది.

సెలవుకు కారణం ఏమిటి?
జనవరి 15న మహారాష్ట్రలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC)తో పాటు మరో 29 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజున పబ్లిక్ హాలిడే ప్రకటించింది. స్టాక్ మార్కెట్ కార్యకలాపాలు ప్రధానంగా ముంబై కేంద్రంగా సాగుతాయి కాబట్టి, ఇన్వెస్టర్లు ఓటు వేసేందుకు వీలుగా ఎక్స్ఛేంజ్‌లు ట్రేడింగ్‌ను నిలిపివేశాయి. ఈ రోజున ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్ విభాగాల్లో ఎటువంటి లావాదేవీలు జరగవు.

Stock Market Closed Trading Halted for 3 Days This Week

డెరివేటివ్స్ ఎక్స్‌పైరీ డేలో మార్పు
సాధారణంగా ప్రతి గురువారం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వంటి ఈక్విటీ డెరివేటివ్ కాంట్రాక్టుల వీక్లీ ఎక్స్‌పైరీ జరుగుతుంది. అయితే జనవరి 15 గురువారం సెలవు కావడంతో ఆ రోజు ముగియాల్సిన కాంట్రాక్టుల గడువును ఒక రోజు ముందుకు అంటే జనవరి 14 (బుధవారం) కు మార్చారు. ట్రేడర్లు ఈ విషయాన్ని గమనించి తమ పొజిషన్లను ఒక రోజు ముందుగానే క్లోజ్ చేసుకోవడం లేదా రోల్ ఓవర్ చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

సెటిల్‌మెంట్ హాలిడే, కమోడిటీ మార్కెట్
జనవరి 15ను కేవలం ట్రేడింగ్ సెలవుగానే కాకుండా 'సెటిల్‌మెంట్ హాలిడే'గా కూడా పరిగణిస్తున్నారు. అంటే ఆ రోజున బ్యాంకులకు కూడా సెలవు ఉండటం వల్ల నగదు, షేర్ల బదిలీ ప్రక్రియ జరగదు. ఇక మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) విషయానికి వస్తే, ఉదయం సెషన్ (ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు) సెలవు ఉంటుంది, కానీ సాయంత్రం సెషన్ మాత్రం యథావిధిగా సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభమవుతుంది.

2026లో మరిన్ని మార్కెట్ సెలవులు
జనవరి 15 సెలవుతో కలిపి, 2026 సంవత్సరంలో వారాంతపు సెలవులు కాకుండా మొత్తం 16 రోజులు స్టాక్ మార్కెట్లకు సెలవు ఉండనుంది. ఈ నెలలోనే జనవరి 26 (గణతంత్ర దినోత్సవం) నాడు మార్కెట్లకు మరో సెలవు ఉంది. ఫిబ్రవరిలో మహాశివరాత్రి ఆదివారం రావడంతో అదనపు సెలవు లేదు. మార్చిలో హోలీ(మార్చి 3), శ్రీరామనవమి(మార్చి 26), మహావీర్ జయంతి(మార్చి 31) సందర్భంగా మూడు సెలవులు రానున్నాయి. ఏప్రిల్ నెలలోలో గుడ్ ఫ్రైడే (ఏప్రిల్ 3), అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14)న సెలవులు ఉన్నాయి. మే నెలలో మహారాష్ట్ర దినోత్సవం (మే 1), బక్రీద్ (మే 28) సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవులు ఉన్నాయి.ఈ ఏడాది ద్వితీయార్థంలో మొహర్రం (జూన్ 26), వినాయక చవితి (సెప్టెంబర్ 14), గాంధీ జయంతి (అక్టోబర్ 2), దసరా (అక్టోబర్ 20), దీపావళి (నవంబర్ 10), గురునానక్ జయంతి (నవంబర్ 24), క్రిస్మస్ (డిసెంబర్ 25) సెలవులు ఉన్నాయి. ఇన్వెస్టర్లు ఈ సెలవుల క్యాలెండర్‌ను బట్టి తమ పెట్టుబడి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+