Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

No Holiday: ఆదివారం సెలవు లేదు..

దేశ ఆర్థిక ఆర్ధిక చరిత్రలో కీలక అధ్యాయం నమోదు కాబోతుంది. స్వతంత్ర భారతావని చరిత్రలో తొలిసారి దేశమంతా ఆశ్చర్యపోయే విధంగా బడ్జెట్ 2026 (Union Budget 2026) ను ఆదివారం ప్రవేశపెట్టబోతుంది కేంద్ర ప్రభుత్వం. దేశ ఆర్థిక దిశను నిర్దేశించే కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. సాధారణంగా ఆదివారాల్లో మూసి ఉండే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లు ఈసారి ఫిబ్రవరి 1న ట్రేడింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం అదే రోజు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు శుక్రవారం విడివిడిగా సర్క్యులర్లు విడుదల చేశాయి. బడ్జెట్ రోజున మార్కెట్ కార్యకలాపాలు పూర్తిగా లైవ్‌లో కొనసాగుతాయని, సాధారణ ట్రేడింగ్ డే మాదిరిగానే ఉదయం 9.15 గంటల నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు కొనుగోలు-విక్రయాలు జరుగుతాయని స్పష్టం చేశాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లకు ఎలాంటి పరిమితులు ఉండవని పేర్కొన్నాయి.

Stock Markets to Remain Open on February 1 as Union Budget 2026 Is Presented on Sunday

ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్ డే ఆదివారానికి పడటంతో తేదీ మార్పు ఉండొచ్చన్న ఊహాగానాలు కొద్ది రోజులుగా వినిపించాయి. అయితే ప్రభుత్వం మాత్రం సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అదే తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.

జనవరి 29న ఆర్థిక సర్వే

ఇది నిర్మలా సీతారామన్‌కు తొమ్మిదో బడ్జెట్ కావడం విశేషం. ఇప్పటికే బడ్జెట్ రూపకల్పనకు సంబంధించిన కీలక ప్రక్రియలు పూర్తయ్యాయని సమాచారం. జనవరి 29న ఆర్థిక సర్వే విడుదల కానుండగా, దాని ఆధారంగానే బడ్జెట్‌లో కీలక విధానాలు, కేటాయింపులు ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

స్టాక్ మార్కెట్లపై బడ్జెట్ ప్రభావం

బడ్జెట్ రోజున మార్కెట్లు తెరుచుకోవడం వల్ల విధాన ప్రకటనల ప్రభావం తక్షణమే షేర్ ధరల్లో ప్రతిబింబించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పన్నుల విధానం, మౌలిక వసతులు, క్యాపిటల్ మార్కెట్లకు సంబంధించిన ప్రకటనలు మార్కెట్ దిశను నిర్ణయించనున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు బడ్జెట్‌పై ప్రత్యేక దృష్టి సారించారు.

మొత్తానికి, ఈసారి బడ్జెట్ డే కేవలం రాజకీయంగా కాదు.. ఆర్థికంగా కూడా అత్యంత కీలకంగా మారనుంది. ఆదివారం అయినప్పటికీ స్టాక్ మార్కెట్లు తెరుచుకోవడం దేశ ఆర్థిక ప్రాధాన్యతను మరింత హైలైట్ చేస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+