పాత స్టైల్, కొత్త పవర్: ఐకానిక్ ఎస్‌యూవీ రీ-ఎంట్రీ!
Tata Sierra SUV India Launch: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన టాటా సియెర్రా నేడు తిరిగి వచ్చింది. పాత తరం సియెర్రా పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణను ఉపయోగించుకుంటూ.. ఈ సరికొత్త మోడల్ ఆధునిక డిజైన్, హైటెక్ ఫీచర్లు, కొత్త పవర్‌ట్రెయిన్‌తో మధ్య-శ్రేణి ఎస్‌యూవీ విభాగంలోకి దూసుకొచ్చింది. నేడు ఈ ఎస్‌యూవీ అధికారికంగా లాంచ్ అయింది.
సియెర్రా డిజైన్ పాత మోడల్ ఐకానిక్ అంశాలను తీసుకుని, నేటి అవసరాలకు అనుగుణంగా మార్చబడింది. ఈ ఎస్‌యూవీ క్యాబిన్‌లో విశాలమైన స్థలం లభిస్తుంది. ఒరిజినల్ సియెర్రా ప్రత్యేకత అయిన వెనుక వైపు క్వార్టర్ గ్లాస్ (Alpine window-inspired design) డిజైన్‌ను ఈ కొత్త మోడల్ కొనసాగిస్తుంది. 19 అంగుళాల భారీ అల్లాయ్ వీల్స్, బలమైన ఎక్స్‌టీరియర్ క్లాడింగ్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్ దీనికి ప్రీమియం లుక్ ఇస్తాయి. కనెక్టెడ్ LED డేటైమ్ రన్నింగ్ లైట్లు (DRLs), ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు,మెరిసే టాటా లోగో దీని ఫాసియాకు ఆధునికతను ఇస్తాయి. దీని డిజైన్‌కు అంతర్జాతీయంగా 'Red Dot Design Award' లభించడం విశేషం.

పవర్‌ట్రెయిన్, పనితీరు
సియెర్రా మొదట ICE (పెట్రోల్/డీజిల్) వేరియంట్లలో విడుదల కాగా.. తర్వాత ఎలక్ట్రిక్ వెర్షన్‌లో రిలీజ్ కానుంది. ఇది ప్రత్యేకంగా సియెర్రా కోసం రూపొందించబడిన కొత్త 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో రానుంది. ఇది అత్యంత శక్తివంతమైన 170 hp శక్తిని, 280 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉంది. టాటా హారియర్, సఫారీలలో ఉపయోగించిన 2.0-లీటర్ క్రయోటెక్ డీజిల్ ఇంజిన్ (170 hp, 350 Nm టార్క్) కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు అందుబాటులో ఉంటాయి.
సియెర్రా క్యాబిన్ సౌలభ్యం, లగ్జరీ, టెక్నాలజీకి ప్రాధాన్యత ఇస్తుంది. లేయర్‌డ్ డాష్‌బోర్డ్, తేలికపాటి రంగుల థీమ్, విశాలమైన పనోరమిక్ సన్‌రూఫ్ కారణంగా క్యాబిన్ ఎంతో విశాలంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ముందు భాగంలో వెంటిలేటెడ్, పవర్డ్ సీట్లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. టాప్-ఎండ్ వేరియంట్లలో ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) ఫీచర్లు, 6 నుంచి 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా భద్రతను పెంచుతాయి. లార్జ్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, కనెక్టెడ్-కార్ టెక్నాలజీ వినోదం కనెక్టివిటీకి భరోసా ఇస్తాయి.
అంచనా ధర.. మార్కెట్‌లో పోటీ
సియెర్రా టాటా ఎస్‌యూవీల శ్రేణిలో 'కర్వ్' ఎస్‌యూవీ కంటే పై స్థానంలో నిలుస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 11 లక్షల నుంచి రూ. 22 లక్షల మధ్య ఉంటుందని అంచనా. కొన్ని నివేదికలు ప్రారంభ ధర రూ. 15 లక్షల నుంచి రూ. 25 లక్షల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నాయి. కాసేపట్లో దీని ధర తెలియనుంది. సియెర్రా భారతదేశంలో అత్యంత పోటీ ఉన్న మధ్య-శ్రేణి ఎస్‌యూవీ మార్కెట్‌లోకి ప్రవేశించి.. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, స్కోడా కుషాక్ వంటి ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications