iPhone: యాపిల్ లో భారీ కుదుపు
ఐఫోన్ల తయారీ కంపెనీ యాపిల్ లో భారీ కుదుపు చోటు చేసుకోనుంది. ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ (Tim Cook) తన పదవి నుంచి వైదొలగనున్నాడు. వచ్చే రెండు మూడు నెలల్లో ఆయన యాపిల్ సీఈఓగా తప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎంపిక ప్రక్రియ కూడా ఆరంభమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓ ప్రత్యేక కథనాన్ని ఫైనాన్షియల్ టైమ్స్ ప్రచురించింది.
ఈ కథనం ప్రకారం- టిమ్ కుక్ రాజీనామా వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకుని ఆపిల్.. తన తదుపరి సీఈఓ ఎంపిక ప్రక్రియను కూడా ఇప్పటికే ప్రారంభించింది. టిమ్ కుక్ తర్వాత ఆపిల్ పగ్గాలు ఎవరు చేపడతారనేది ఇంకా స్పష్టంగా తెలియకపోయినప్పటికీ, కంపెనీ ఈ దిశగా పని మొదలుపెట్టింది కూడా. ప్రస్తుతం ఆపిల్ హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ టెర్నస్ ఈ పదవికి ప్రధాన పోటీదారుగా భావిస్తున్నారు. దీనిపై ఆపిల్ నుంచి ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి సమాచారం రాలేదు.

దాదాపు 14 సంవత్సరాలుగా ఆపిల్ ప్రధాన కార్యనిర్వాహక అధికారిగా బాధ్యతలను నిర్వర్తించారు టిమ్ కుక్. 1998లో ఆపిల్‌లో చేరారు. 2011లో స్టీవ్ జాబ్స్ రాజీనామా చేసిన తర్వాత ఆ సంస్థ పగ్గాలను అందుకున్నారు. ఆ సమయంలో కంపెనీ అనేక సవాళ్లను ఎదుర్కొంది. స్టీవ్ జాబ్స్ ఆపిల్ ఆపరేషన్స్ బృందానికి కొత్త దిశానిర్దేశం చేయడానికి టిమ్ కుక్‌ను నియమించారు. 2005 నుండి 2011 వరకు ఆయన కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేశారు.
ఈ సమయంలో ఐపాడ్, మ్యాక్‌బుక్, ఐఫోన్, ఐక్లౌడ్, ఆపిల్ మ్యూజిక్, ఆపిల్ టీవీ+, యాప్ స్టోర్ వంటి ఉత్పత్తుల ప్రపంచానికి పరిచయం చేశారు. టిమ్ కుక్ నాయకత్వ పటిమ వల్లే ఆపిల్ పెద్ద ఎత్తున ఉత్పత్తులను విడుదల చేయగలిగిందని చాలామంది నమ్ముతారు. స్టీవ్ జాబ్స్ అనారోగ్యం సమయంలో కూడా టిమ్ కుక్ కంపెనీకి తాత్కాలిక సీఈఓగా వ్యవహరించారు. 2011 ఆగస్టు 24న స్టీవ్ జాబ్స్, టిమ్ కుక్‌ను ఆపిల్ సీఈఓగా నియమించారు. కుక్ హయాంలో ఆపిల్ మూడు ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను చేరుకున్న మొట్టమొదటి కంపెనీగా నిలిచింది.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications