Actress: తిరిగిరాని లోకాలకు నటి చిత్రా, 300 సినిమాలు, రజనీకాంత్, శరత్ కుమార్ తో !
తిరిగిరాని లోకాలకు నటి చిత్రా, 300 సినిమాలు, రజనీకాంత్, శరత్ కుమార్ తో !
చెన్నై: అలనాటి నటి, 300కు పైగా సినిమాల్లో నటించిన చిత్రా గుండెపోటుతో మరణించారు. సొంత ఇంట్లో ఉన్న నటి చిత్రాకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించాడానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో నటి చిత్రా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తమిళ, మలయాళంలో సుమారు 300కు పైగా సినిమాల్లో నటించిన నటి చిత్రా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కుమార్తెను పెంచి పోషించాలని, ఆమెను బాగా చదివించాలని ఆశతో ముఖానికి రంగు వేసుకోవడం మానేసిన నటి చిత్రా వ్యాపారం చేసుకుంటూ కాలం గడిపారు.
సూపర్ స్టార్ రజనీకాంత్, జాతీయ ఉత్తమనటుడు కమల్ హాసన్ లాంటి నటులను సినీ రంగానికి పరిచయం చేసిన కే. బాలచందర్ నటి చిత్రాను కూడా సినీ రంగానికి పరిచయం చేశారు. తమిళంలో కే. బాలచందర్ తెరకెక్కించిన ఓ సినిమాలో బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన చిత్రా తరువాత వరుస సినిమాలతో దూసుకుపోయారు.

తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ఉర్కవలన్, చేరన్ పాండియన్ తదితర సినిమాలు చిత్రాకు నటిగా మంచి గుర్తింపు తీసుకు వచ్చాయి. తమిళంతో పాటు మలయాళంలో చిత్రాకు మంచి అవకాశాలు వచ్చాయి. ఇప్పటి వరకు చిత్రా సుమారు 300కు పైగా సినిమాల్లో నటించారు. తమిళంలో చిత్రా నటించిన అనేక సినిమాలు సూపర్ హిట్ కావడంతో నటిగా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్, శరత్ కుమార్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన చిత్రా వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న చిత్రాకు రానురాను సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి. చెన్నైలోని సాలిగ్రామ్ లో స్థిరపడిన చిత్రా సొంతంగా ఓ కంపెనీని ప్రారంభించి వ్యాపారం చేశారు. కూతురు శృతిని బాగా చదివించుకోవాలని నిర్ణయించిన చిత్రా సినిమాలకు పూర్తిగా దూరం అయ్యాయి. చిత్రా నటించిన సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. శనివారం ఉదయం సాలిగ్రామ్ లోని సొంత ఇంటిలో చిత్రా గుండెపోటు రావడంతో మరణించారు. శనివారం సాలిగ్రామ్ లోని చిత్రాకు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.
చిత్రా నటించిన అనేక తమిళ మలయాళం సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ చేశారు. చిత్రా కూతురు శృతి ఫ్లస్ టూ పరీక్షలు రాసింది. 300కు పైగా సినిమాల్లో నటించిన చిత్రా ఎక్కడా వివాదాల్లో చిక్కుకోకుండా కాలం గడిపారు. వివాదాలకు దూరంగా ఉంటున్న చిత్రాకు స్నేహితులు కూడా తక్కువగానే ఉన్నారని తెలిసింది. చిత్రా ఆకస్మిక మరణం గురించి తెలుసుకున్న తమిళ, మలయాళం సినీ ప్రములు విషాదం వ్యక్తం చేశారు.
తమిళంలో నటి చిత్రా దాదాపు అందరూ హీరోలతో కలిసి నటించింది. చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. సినిమా రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న చిత్రా వివాహం చేసుకోవాలని, పిల్లలను కనాలని ఎక్కువగా ఆశపడిందని, వివాహం చేసుకుంటే సినిమాల్లో అవకాశాలు తగ్గిపోతాయి అని తెలిసినా ఆమె ఏమాత్రం భయపడలేదని ఆమె సన్నిహితులు అంటున్నారు. మొత్తం మీద ఎంతో ఇష్టం అయిన సొంత ఇంటిలో కూతురి ముందు చిత్రా ప్రాణాలు వదిలిందని తెలుసుకున్న ఆమె స్నేహితులు విషాదం వక్తం చేస్తున్నారు. తమిళ, మలయాళం సినిమా రంగానికి చెందిన అనేక మంది నటి చిత్రాకు నివాళులు అర్పించారు. చిత్రా ఆత్మశాంతిచాలని పలువురు తమిళ సినీ ప్రముఖలు భగవంతుడిని వేడుకున్నారు.












Click it and Unblock the Notifications