Beautiful wife: ఎవరు వాళ్లు ? ఎందుకొస్తున్నారు ?, భార్య గొంతు ఉల్లిపాయ కోసినట్లు కోసేసిన భర్త !

చెన్నై: కుటుంబ గొడవల కారణంగా భర్త సహనం కోల్పోయిన భార్య గొంతుకోసి దారుణంగా చంపేశాడు. ఇంట్లో లేని సమయంలో తన ఇంటికి ఎవరెవరో వచ్చి వెలుతున్నారని చాలా కాలం నుంచి భర్తకు అనుమానం ఉంది. పెళ్లి చేసుకుని కుమార్తె భర్తతో ఉండటం, కొడుకు ఉద్యోగం కోసం బయటకు వెళ్లడంతో ఇంట్లో ఎవ్వరూ లేని టైమ్ లో తన ఇంటికి బయటి వ్యక్తులు ఎందుకు వస్తున్నారు ? అంటూ భర్త నిత్యం భార్యతో గొడవపడేవాడు. ఇదే విషయంలో గొడవ జరగడంతో భర్య మొడను ఉల్లిపాయ కత్తిరించినట్లు కత్తిరించిన భర్త ఆమెను కిరాతకంగా చంపేసి టెన్షన్ తో చెక్కేశాడు.

చెన్నైలో కాపురం

చెన్నైలో కాపురం


చెన్నై సిటీలోని పూనమల్లె ప్రాంతంలోని రైటర్స్ స్ట్రీట్ లో నూరుద్దీన్ (52), అసీనా బేగం (42) దంపతులు నివాసం ఉంటున్నారు. నూరుద్దీన్, అసీనా దంపతులకు అల్తాఫ్ అనే కుమారుడు, ఓ కుమార్తె ఉంది. అసీనా బేగం కుమార్తె వివాహం చేసుకుని చెన్నైలోనే భర్తతో కలిసి వేరుగా కాపురం ఉంటున్నది. నూరుద్దీన్, అసీనా బేగం, వారి కుమారుడు అల్తాఫ్ సొంత ఇంటిలో నివాసం ఉంటున్నారు.

ఎవరి కోసం వస్తున్నారు ?

ఎవరి కోసం వస్తున్నారు ?

నూరుద్దీన్ వ్యాపారం చేస్తున్నాడు. అల్తాప్ ఉద్యోగం చేస్తున్నాడు. ప్రతిరోజు ఉదయం నూరుద్దీన్ అతని కుమారుడు అల్తాఫ్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. ఇంట్లో అసీనా బేగం మాత్రమే ఉంటున్నది. తాను ఇంట్లో లేని సమయంలో ఇంటికి ఎవరో వచ్చి వెలుతున్నారని నూరుద్దీన్ కు అనుమానం వచ్చింది. నేను ఇంట్లో లేని సమయంలో ఇంటికి ఎవరు వస్తున్నారు ? ఎందుకు వస్తున్నారు ? అంటూ భార్య అసీనా బేగంతో నూరుద్దీన్ గొడవపడుతున్నాడని తెలిసింది.

 రోజూ ఇదే పంచాయితి

రోజూ ఇదే పంచాయితి

ప్రతిరోజు తన తండ్రి నూరుద్దీన్ తన తల్లి అసీనా బేగంతో గొడవ పడుతున్నాడని తెలుసుకున్న అల్తాఫ్ తండ్రికి నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. పెళ్లి చేసుకుని భర్తతో కలిసి వేరే కాపురం ఉంటున్న కుమార్తె కూడా అప్పుడప్పుడు ఇంటికి వచ్చి తల్లిదండ్రులు నూరుద్దీన్, అసీనా బేగంకు సర్దిచెబుతూ వచ్చింది. అయితే ఇంట్లో నిత్యం నూరుద్దీన్, అసీనా బేగం గొడవల పంచాయితీ జరుగుతూనే ఉందని తెలిసింది.

కొడుకు వచ్చిచూస్తే షాక్

కొడుకు వచ్చిచూస్తే షాక్

ఉద్యోగానికి వెళ్లిన అల్తాఫ్ తల్లి అసీనా బేగంకు ఫోన్ చేశాడు. ఎంత సేపటికి తల్లి అసీనా బేగం ఫోన్ రిసీవ్ చెయ్యకపోవడంతో అల్తాఫ్ కు అనుమానం పెరిగిపోయింది. ఇంటికి వెళ్లిన అల్తాఫ్ రక్తపుమడుగులో పడి ఉన్న తల్లిని చూసి షాక్ అయ్యి గట్టిగా కేకలు వేశాడు. ఇరుగుపొరుగు వారి సహాయంతో అసీనా బేగంను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై అసీనా బేగం ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని వైద్యులు తెలిపారు.

కూరగాయల కత్తితో కోసేశాడు

కూరగాయల కత్తితో కోసేశాడు

ఇంట్లో నూరుద్దీన్, అతని భార్య అసీనా బేగం గొడవ పడుతున్న విషయం అంతకు ముందు స్థానికులు గుర్తించారు. గొడవ పెద్దదికావడంతో సహనం కోల్పోయిన నూరుద్దీన్ ఇంట్లో కూరగాయలు కత్తిరించే కత్తి తీసుకుని భార్య అసీనా బేగం గొంతును ఉల్లిపాయ (ఎర్రగడ్డ) కత్తిరించాడని, ఆమె ముఖం మీద కత్తితో కాట్లు పెట్టాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

Recommended Video

    Bigg Boss Telugu 4 : YouTuber Mahathalli & Husband Entry ! || Oneindia Telugu
    మొబైల్ టవర్ చిక్కకూడదని

    మొబైల్ టవర్ చిక్కకూడదని

    భార్య అసీనా బేగం గొంతు కోసిన నూరుద్దీన్ పోలీసులకు మొబైల్ టవర్ చిక్కకుండా జాగ్రతలు తీసుకున్నాడు. నూరుద్దీన్ అతని మొబైల్ ఫోన్ ఇంట్లోనే వదిలేసి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. భార్య అసీనా బేగంను దారుణంగా హత్య చేసి పరారైన నూరుద్దీన్ కోసం చెన్నై పోలీసులు గాలిస్తున్నారు. అసీనా బేగం అతిదారుణంగా హత్యకు గురి కావడంతో ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+