Cheating: భార్య టెక్కీ, నా మొగుడు ఆ పని చెయ్యలేదు, అక్కడ ఏ పని చెయ్యలేదు, మీరే చూడండి!
చెన్నై/ తేనీ/ మదురై: అమ్మాయి ఎంసీఏ పూర్తి చేసి ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తోంది. కాలేజ్ లో లెక్చరర్ గా ఉద్యోగం చేస్తున్నాడని ఓ యువకుడితో అమ్మాయి పెళ్లి గ్రాండ్ గా జరిపించారు. కట్నకానుకల కింద భర్తకు భారీ మొత్తంలో బంగారు నగలు, నగదు, లక్షల రూపాయల విలువైన ఖరీదైన వస్తువులు తీసిచ్చారు. దంపతులకు పండంటి బిడ్డపుట్టింది. భర్త కాలేజ్ కు వెళ్లకుండా భార్య పుట్టింటి నుంచి తీసుకు వచ్చిన కట్నం డబ్బుతో పాటు తెచ్చిన బంగారు నగలు కుదువ పెట్టి జల్సాలు చేస్తున్నాడు. నా భర్త ఇక్కడ నా పని సక్రమంగా చెయ్యడం లేదు ?, కాలేజ్ కు వెళ్లి అక్కడ ఏపని చెయ్యడం లేదు ? అసలు ఏం జరుగుతోంది ? అంటూ భార్య ఆరా తీసింది. అంతే సీన్ కట్ చేస్తే భార్య జిల్లా పోలీసు ఎస్పీ ఆఫీసులో ప్రత్యక్షం అయ్యి నా మొగుడు ఇక్కడ ఈపని చెయ్యడం లేదు, అక్కడ ఏ పని చెయ్యడం లేదు మీరే చూడండి అని ఫిర్యాదు చెయ్యడంతో కలకలం రేపింది.

హెచ్ పీ కంపెనీ సాఫ్ట్ వేర్ ఉద్యోగి
తమిళనాడులోని దిండుగల్ జిల్లా వట్లకూండులోని బెథానీ వీధిలో నివాసం ఉంటున్న బీఎస్ ఎఫ్ రిటైడ్ ఉద్యోగి ఇజ్రాయల్ కుమార్తె ప్రేమా (26) ఎంసీఏ పూర్తి చేసింది. ఎంసీఏ పూర్తి చేసిన ప్రేమా 2018లో చెన్నైలోని హెచ్ పీ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. అనంతరం ప్రేమాకు వివాహం చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు చాలా పెళ్లి సంబంధాలు చూశారు.

కాలేజ్ లెక్చరర్ ఉద్యోగి
పెరియాకుళం సమీపంలోని డి. కల్లిపట్టి ప్రాంతంలోని శాస్త్రీ వీధిలో నివాసం ఉంటున్న వైద్యుడు జ్ఞానమ్ కుమారుడు ప్రవీణ్ కుమార్. ప్రవీణ్ కుమార్ కు ప్రేమాకు పెళ్లి చూపులు జరిగాయి. పెరియాకుళంలోని ఈవినింగ్ కాలేజ్ లో ప్రవీణ్ కుమార్ లెక్చరర్ గా ఉద్యోగం చేస్తున్నాడని ప్రేమా కుటుంబ సభ్యులకు చెప్పారు.

భారీ మొత్తంలో మనోడికి కట్నకానుకలు
ప్రవీణ్ కుమార్, ప్రేమా పెళ్లి చెయ్యాలని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. 2019లో ప్రవీణ్ కుమార్, ప్రేమా పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది. పెళ్లి సమయంలో ప్రవీణ్ కుమార్ కు ప్రేమా కుటుంబ సభ్యులు 40 తులాల బంగారు నగలు, రూ. లక్షల విలువైన ఖరీదైన వస్తువులు, లక్షల రుపాయలు కట్నంగా ఇచ్చారు. అప్పటి నుంచి ప్రవీణ్ కుమార్, ప్రేమా దంపతులు సంతోషంగా కాపురం చేశారు. ప్రవీణ్ కుమార్, ప్రేమా దంపతులకు ఆరు నెలల పాప ఉంది.

ఫుల్ గా మద్యం..... మసాలా వంటలు.... అంతే
పెళ్లి జరిగిన తరువాత ప్రవీణ్ కుమార్ ప్రతిరోజు శుభ్రంగా స్నానం చేసి రెఢీ అయ్యి తాను కాలేజ్ కు వెలుతున్నానని భార్య ప్రేమాకు చెప్పి బయటకు వెళ్లి రాత్రి ఎప్పుడో ఇంటికి తిరిగి వెళ్లేవాడు. అయితే ఇటీవల ప్రవీణ్ ఇంటికే పరిమితం అయ్యాడు. ప్రతిరోజు రాత్రి ఫుల్ గా మద్యం సేవించి ఇంట్లో చేస్తున్నమసాలా కూరలతో భోజనం చేసి హాయిగా నిద్రపోతున్నాడు.

నా మొగుడు ఇక్కడ ఆ పని అక్కడ ఏ పని చెయ్యలేదు
గత ఆరు నెలల నుంచి ప్రవీణ్ కుమార్ కాలేజ్ కు వెళ్లడం లేదు. మీరు ఎందుకు ఇంట్లోనే ఉంటున్నారు, కాలేజ్ కు ఎందుకు వెళ్లడం లేదు అని భార్య ప్రశ్నించింది. ఇదే విషయంలో ప్రవీణ్ కుమార్, ప్రేమా దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. తన మొగుడు తనతో సక్రమంగా కాపురం చెయ్యడం లేదు, కాలేజ్ వెళ్లి జీతం సంపాధించడం లేదు, అసలు ఏం జరుగుతోంది ? అంటూ భార్య ప్రేమా ఆరా తియ్యడం మొదలుపెట్టింది.

డిగ్రీ పాస్ కాలేదు..... లెక్చరర్ అయ్యాడా ?
పెరియాకుళం కాలేజ్ దగ్గరకు వెళ్లిన ప్రేమా ఇక్కడ ప్రవీణ్ కుమార్ లెక్చరర్ గా ఉద్యోగం చేస్తున్నాడా ?, జీతం ఎంత వస్తోంది ? అంటూ ఆరా తీసింది. ఇక్కడ ప్రవీణ్ కుమార్ పేరుతో ఎవ్వరు లెక్చరర్ గా ఉద్యోగం చెయ్యడం లేదని కాలేజ్ సిబ్బంది చెప్పారు. తరువాత అమ్మా తల్లి నీ మొగుడు ప్రవీణ్ కుమార్ కనీసం డిగ్రీ కూడాపాస్ కాలేదని, అతనికి లెక్చరర్ ఉద్యోగం ఎవరు ఇచ్చారని స్థానికులు చెప్పడంతో ప్రేమా షాక్ కు గురైయ్యింది.

నా మొగుడి కథ మీరే చూడండి
తన భర్త ప్రవీణ్ కుమార్ పచ్చి మోసగాడని తెలుసుకున్న ప్రేమా రగిలిపోయింది. ప్రేమా ఆరు నెలల పాపను ఎత్తుకుని నేరుగా తేనీ జిల్లా పోలీసు ఎస్పీ కార్యాలయానికి చేరుకుంది. నా మొగుడు పచ్చి మోసగాడు, కాలేజ్ లో ఉద్యోగం చేస్తున్నానని తనతో పాటు కాలేజ్ యాజమాన్యాన్ని మోసం చేశాడని ,అతని కథ మీరే చూడండి, లేదంటే నేను కోర్టుకు పోతాను అంటూ ప్రేమ జిల్లా ఎస్పీకి చెప్పింది. సొంత భార్య ప్రవీణ్ కుమార్ కాలేజ్ యాజమాన్యాన్ని మోసం చేస్తున్నాడని ఫిర్యాదు చెయ్యడం తేనీ జిల్లాలో కలకలం రేపింది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications