Businessman: పుట్టింటిలో డాక్టర్ భార్య, అర్దరాత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో కాల్పులు, జస్ట్ మిస్!
చెన్నై: రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వ్యక్తి డబ్బులు బాగా సంపాధిస్తున్నాడు. ఫేమస్ స్కిన్ స్పెషలిస్టుగా పని చేస్తున్న డాక్టర్ ను రియల్ ఎస్టేట్ వ్యాపారి వివాహం చేసుకున్నాడు. డాక్టర్ గా భార్య, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భర్త బాగా డబ్బులు సంపాధిస్తున్నారు. విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో దంపతులు నివాసం ఉంటున్నారు. భార్య గర్బవతి అయ్యింది. భర్త ఇంట్లోనే లేడీ డాక్టర్ శ్రీమంతం గ్రాండ్ గా జరిగింది. కాన్పు కోసం భార్యను పుట్టింటికి పంపించారు. ఇంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక్కడే ఉంటున్నాడు. అర్దరాత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో రివాల్వర్ కాల్పులు వినిపించాయి. పక్క ఫ్లాట్ లో నివాసం ఉంటున్న వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎడమ చేతి భుజం మీద బుల్లెట్లు దూసుకుపోయి నేల మీద కుప్పకూలి ఉన్న విషయం గుర్తించారు. వెంటనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఆసుపత్రికి తరలించారు. భార్య పుట్టింటికి వెళ్లిన తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎడమ చేతి భుజం మీద బుల్లెట్లు దూసుకోవడం, కొంచెం పక్కన బుల్లెట్లు దూసుకుపోయి ఉంటే గుండెలోకి వెళ్లి అతని ప్రాణం పోయేదని పోలీసులు అంటున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి భుజంలోకి బుల్లెట్లు ఎలా దూసుకోపాయియి ? అంటూ పోలీసులు ఆరా తియ్యడంతో అసలు మ్యాటర్ బయటకు వచ్చింది.

రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫ్యామిలి
చెన్నైలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సెంథిల్ (39) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సెంథిల్ రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా చేస్తున్నాడు. చెన్నైలోని భైరవి (32) అనే మహిళ ప్రముఖ చర్మవ్యాధి వైద్యురాలిగా (స్కిన్ స్పెషలిస్టు డాక్టర్)గా పని చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సెంథిల్, డాక్టర్ భైరవి వివాహం చేసుకున్నారు.

విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో కాపురం
చెన్నైలోని అడయార్ లోని మత్తులక్ష్మి రోడ్డులోని క్వాడ్రండ్ విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో సెంథిల్, డాక్టర్ భైరవి దంపతులు నివాసం ఉంటున్నారు. డాక్టర్ గా భార్య భైరవి, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆమె భర్త సెంథిల్ బాగా డబ్బులు సంపాధిస్తున్నారు. సెంథిల్ భైరవి దంపతులు చాలా సంతోషంగా జీవినం సాగిస్తున్నారు.

శీమంతం చేసుకుని పుట్టింటికి వెళ్లిన భార్య
సెంథిల్ భార్య భైరవి గర్బవతి అయ్యింది. భర్త సెంథిల్ ఇంట్లోనే లేడీ డాక్టర్ భైరవి శ్రీమంతం గ్రాండ్ గా జరిగింది. కాన్పు కోసం డాక్టర్ భైరవిని ఆమె పుట్టింటికి పంపించారు. ఇంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి సెంథిల్ ఒక్కడే ఉంటున్నాడు.
అర్దరాత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి సెంథిల్ ఇంట్లో రివాల్వర్ కాల్పులు వినిపించాయి. పక్క ఫ్లాట్ లో నివాసం ఉంటున్న వారు తలుపులు తట్టినా సెంథిల్ మాత్రం తలుపు తియ్యకపోవడంతో అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న వారు అడయార్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కుప్పకూలిపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి
చెన్నై పోలీసులు రియల్ ఎస్టేట్ వ్యాపారి సెంథిల్ ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎడమ చేతి భుజం మీద బుల్లెట్లు దూసుకుపోయి అతను నేల మీద కుప్పకూలి ఉన్న విషయం గుర్తించారు. వెంటనే రియల్ ఎస్టేట్ వ్యాపారి సెంథిల్ ను అడయార్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

ఏం జరిగింది ?
భార్య డాక్టర్ భైరవి పుట్టింటికి వెళ్లిన తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారి సెంథిల్ ఎడమ చేతి భుజం మీద బుల్లెట్లు దూసుకోవడం, కొంచెం పక్కన బుల్లెట్లు దూసుకుపోయి ఉంటే గుండెలోకి వెళ్లి అతని ప్రాణం పోయేదని పోలీసులు అంటున్నారు. అర్దరాత్రి సెంథిల్ మీద ఎవరైనా కాల్పులు జరిపారా ? అని పోలీసులు ఆరా తీశారు.

మ్యాటర్ చెప్పిన రియల్ ఎస్టేట్ వ్యాపారి
ఇంట్లో ఒంటరిగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి సెంథిల్ భుజంలోకి బుల్లెట్లు ఎలా దూసుకోపాయియి ? అంటూ పోలీసులు ఆరా తియ్యడం మొదలు పెట్టారు. కొంచెం కోలుకున్న సెంథిల్ అసలు మ్యాటర్ బయటకు చెప్పాడు. రివాల్వర్ శుభ్రం చేస్తుంటే బుల్లెట్లు దూసుకుపోయాయని సెంథిల్ చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు.

అర్దరాత్రి రివాల్వర్ లో బెల్లెట్లు లోడ్ చేసి క్లీన్ చేస్తారా?
రియల్ ఎస్టేట్ వ్యాపారి సెంథిల్ రివాల్వర్ కు లైసెన్స్ ఉందని పోలీసు అధికారులు అంటున్నారు. రివాల్వర్ లైసెన్స్ ఉన్న వాళ్లు బుల్లెట్లు అన్నీ తీసేసి వాటిని క్లీన్ చేస్తారని, అలా కాకుండా అర్దరాత్రి సెంథిల్ రివాల్వర్ లో బుల్లెట్లు లోడ్ చేసి నిర్లక్షంగా క్లీన్ చేశాడని పోలీసు అధికారులు అంటున్నారు. గతంలో బిగ్ బాస్ సెలబ్రిటీ, మోడల్ రైసా పట్ల సెంథిల్, డాక్టర్ భైరవి దంపతులు అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారి సెంథిల్ మీద రెండు సెక్షల కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసుల విచారణలో తాను రివాల్వర్ శుభ్రం చేస్తుంటే అది ఆకస్మికంగా పేలిపోయిందని రియల్ ఎస్టేట్ వ్యాపారి సెంథిల్ చెప్పాడని పోలీసు అధికారులు అంటున్నారు. రివాల్వర్ పగటిపూట శుభ్రం చెయ్యకుండా అర్దరాత్రి పూట, అది ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఎందుకు శుభ్రం చెయ్యడానికి ప్రయత్నించాడు అనే విషయంలో సెంథిల్ పక్కా క్లారిటీ ఇవ్వడం లేదని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications