Girl: వన్ సైడ్ లవ్, దెబ్బకు ఇళ్లు మారిపోయింది, అమ్మాయి ఇంటి మీద పెట్రోల్ బాంబులతో దాడులు!

వన్ సైడ్ లవర్ టార్చర్ దెబ్బతో అమ్మాయి ఫ్యామిలీ ఇల్లు ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది. ఫ్రెండ్స్ తో కలిసి ప్రేమిస్తున్న అమ్మాయి ఇంటి మీద కన్నింగ్ ప్రియుడు పెట్రోల్ బాంబుల వర్షం కురిపించడం కలకలం రేపింది.

చెన్నై/మధురై: ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువకుడికి, ఓ అమ్మాయికి పరిచయం అయ్యింది. ఒకే వీధిలో ఎదురెదురు ఇళ్లలో నివాసం ఉంటున్న ఇద్దరూ ప్రతిరోజు ఒకరిని ఒకరు చూసుకుంటున్నారు. ఎవ్వరూ లేని సమయంలో ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. అయితే మ్యాటర్ అమ్మాయి తండ్రికి తెలిసిపోయింది. తన కూతురితో మాట్లాడకూడదని అమ్మాయి తండ్రి ఆ యువకుడికి వార్నింగ్ ఇచ్చాడు. అయితే యువకుడు మాత్రం చెప్పినమాట వినలేదు.

ఇదే సమయంలో క్రిమినల్ కేసుల్లో యువకుడు జైలుకు వెళ్లాడు. అమ్మాయి ఫ్యామిలీ ఇల్లు ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది. జైలు నుంచి బయటకు వచ్చిన ప్రియుడు ఫ్రెండ్స్ ను కలిశాడు, లిక్కర్ పార్టీలో అమ్మాయి విషయంలో జోరుగా చర్చ జరిగింది. ఫ్రెండ్స్ తో కలిసి ప్రేమిస్తున్న అమ్మాయి ఇంటి మీద కన్నింగ్ ప్రియుడు పెట్రోల్ బాంబుల వర్షం కురిపించడం కలకలం రేపింది.

మైనర్ అమ్మాయి

మైనర్ అమ్మాయి

తమిళనాడులోని మధురై నగరంలోని మేలపడవాడి ఏరియాలోని వడివేలన్ వీధిలో చాలా సంవత్సరాల నుంచి కుమ్మరి శరవణకుమార్ కుటుంబం, మారుతి బండి అలియాస్ మారుతి కుటుంబం నివసించేవారు. శరవణకుమార్‌ కు 15 ఏళ్ల వయసు ఉన్న కుమార్తె ఉంది. మారుతికి మణిరత్నం(23) అనే కుమారుడు ఉన్నాడు. శరవణకుమార్ మైనర్ కుమార్తెతో మణిరత్నంకు పరిచయం అయ్యింది. శరవణకుమార్ కుమార్తె 10వ తరగతి చదువుతోంది.

ఎదురింటి అబ్బాయి అని మాట్లాడింది

ఎదురింటి అబ్బాయి అని మాట్లాడింది

మణిరత్నం ఎదురింటిలో ఉండటంతో ఆ అమ్మాయి అతనితో అప్పుడప్పుడు మాట్లాడేది. ఎదురు ఇళ్లు కావడంతో కనపడిన సమయంలో అమ్మాయి అతన్ని చూసి నవ్వేది. అయితే రానురాను మణిరత్నం మైనర్ అమ్మాయిని బయటకు రావాలని, తనతో తిరగాలని ఆమెను వేధించేవాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని తండ్రి శరవణకుమార్ ఎదురింటి అబ్బాయి మణిరత్నంను నువ్వు మర్యాదగా ఉండాలని హెచ్చరించాడు.

కూతురి కోసం ఇళ్లు మార్చేశాడు

కూతురి కోసం ఇళ్లు మార్చేశాడు

మణిరత్నం వేధింపులు రోజురోజుకూ ఎక్కువ కావడంతో అమ్మాయి తండ్రి శరవణకుమార్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. ఆ తరువాత పోలీసులు మణిరత్నంను పిలిచి వార్నింగ్ ఇచ్చారు. తరువాత పలు క్రిమినల్ కేసుల్లో మణిరత్నం మధురై సెంట్రల్ జైలకు వెళ్లాడు. అయితే మణిరత్నంతో ఇబ్బందులు తప్పవని భావించిన శరవణకుమార్ కుటుంబం ఇల్లు ఖాళీ చేసి మధురైలోని చిన్నకన్మాయి ప్రాంతానికి వెళ్లిపోయింది.

సెంట్రల్ జైల్లో వన్ సైడ్ లవర్

సెంట్రల్ జైల్లో వన్ సైడ్ లవర్

దొంగతనం, దోపిడీలు, దాడులు సహా పలు నేరాల్లో జైలుకు వెళ్లిన మణిరత్నం ఆరు నెలల క్రితం జైలు నుంచి బెయిల్ మీద విడుదల అయ్యాడు. తరువాత ఎదురింటి అమ్మాయి ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయిందని తెలుసుకుని ఆమె ఇంటి అడ్రస్ కోసం వెతికాడు. పలు క్రిమినల్ కేసుల్లో జైలుకు వెళ్లిన మణిరత్నంకు మద్యం, గంజాయి సేవించే అలవాటు ఉంది.

అమ్మాయి ఇంటి మీద పెట్రోల్ బాంబులతో దాడులు

అమ్మాయి ఇంటి మీద పెట్రోల్ బాంబులతో దాడులు

పాత క్రిమినల్ కేసుల విచారణ కోసం సోమవారం మధురై జిల్లా కోర్టుకు మణిరత్నంతో పాటు అతని స్నేహితులు హాజరైనారు. కోర్టు విచారణ పూర్తి అయిన తరువాత మణిరత్నం అతని స్నేహితులతో కలిసి మద్యం సేవించారు. మద్యం మత్తులో మణిరత్నం అతని వన్ సైడ్ లవ్ విషయంలో ఫ్రెండ్స్ తో పశ్చాత్తాపపడ్డాడు.

ఆవేశంలో ఉన్న స్నేహితులు మణిరత్నంను రెచ్చగొట్టారు. అందరూ కలిసి పెట్రోల్ బాంబులు తయారు చేశారు. తన స్నేహితులతో కలిసి అమ్మాయి తండ్రి శరవణకుమార్ ఇంటికి వెళ్లిన మణిరత్నం వాళ్లు ఇంటి తలుపులు, కిటికీలపై పెట్రోల్ బాంబులు విసిరి పరారయ్యాడు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో తలుపు వద్ద ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పలేదు.

శాడిస్టు ఫ్రెండ్స్ తో కలిసి?

శాడిస్టు ఫ్రెండ్స్ తో కలిసి?

ఇంట్లో ఉన్న శరవణకుమార్ శబ్ధం విని బయటకు వచ్చి చూడగా పెట్రోల్ బాంబులు పేలడం చూసి షాక్‌కు గురై వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలు పరిశీలించి కేసు నమోదు చేసి మణిరత్నం, అతని స్నేహితుడు పార్థసారథి (22)ని కొన్ని గంటల్లో అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మణిరత్నం స్నేహితులు మరో ఇద్దరిక ోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+