Super CM: రోడ్డు పక్కన కుర్చుని టీ తాగిన సీఎం, నర్సులతో సెల్ఫీలు, రూటే సపరేట్, అందరి లాగా కాదు !

చెన్నై/ చెంగల్పట్టు: తమిళనాడులో నాలుగు రోజులు కురిసిన భారీ వర్షాల దెబ్బతో ఆ రాష్ట్రం అతలాకుతలం అయ్యింది. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీ పరిస్థితి సరేసరి. శుక్రవారం చెన్నై సిటీ ప్రజలతో పాటు తమిళనాడు ప్రజలు కొంచెం ఊపిరిపీల్చుకున్నారు. భారీ వర్షాల దెబ్బతో సర్వం కోల్పోయిన వారిని, పాక్షికంగా నష్టపోయిన వారిని సహాయక శిభిరాలకు తరలించారు. సహాయక శిభిరాల్లో ఉంటున్న ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి స్వయంగా సీఎం వెళ్లారు. సహాయక కేంద్రాల్లో ఉన్న ప్రజలను పలకరించిన సీఎం అక్కడ వారికి అందుతున్న ఆహారం గురించి, వైద్యసేవల గురించి, అధికారులు అందిస్తున్న సహాయ సహకారాల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. తరువాత అక్కడి నుంచి వేరే ప్రాంతానికి బయలుదేరిన సీఎం ఒక్కసారిగా రోడ్డు పక్కన ఓ టీ స్టాల్ దగ్గర కారు ఆపాలని డ్రైవర్ కు చెప్పాడు. కారు దిగిన సీఎం ఆయన వెంట ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్ దగ్గరకు వెళ్లారు. రోడ్డు పక్కన టీ స్టాల్ ముందు ఉన్న కుర్చీలో కుర్చున్న సీఎం హాయిగా టీ తాగారు. విషయం గుర్తించిన సామాన్య ప్రజలు సీఎం దగ్గరకు పరుగు తీశారు. రోడ్డు పక్కన టీ స్టాల్ లో టీ తాగుతున్న సీఎం అక్కడికి వెళ్లిన నర్సులు, సామాన్య ప్రజలతో సెల్ఫీలు తీసుకుని సాధారణ మనిషిలా అందరితో కలిసి పోవడం హాట్ టాపిక్ అయ్యింది. సీఎం హోదాలో ఉన్న ముఖ్యమంత్రి ఇలా సర్వసాధారణంగా అందరితో కలిసిపోవడం ఆయనకు మాత్రమే సాధ్యం అవుతుందని ఆయన అభిమానులు అంటున్నారు. సీఎం కుర్చీలో కుర్చుకున్న చాలా మంది ముఖ్యమంత్రులు సామాన్య ప్రజలను దగ్గరకు కూడా రానివ్వని విషయం మనం చాలానే చూస్తున్నామని సామాన్య ప్రజలు అంటున్నారు.

తల్లడిల్లిపోయిన తమిళ ప్రజలు

తల్లడిల్లిపోయిన తమిళ ప్రజలు


తమిళనాడులో నాలుగు రోజులు కురిసిన భారీ వర్షాల దెబ్బతో ఆ రాష్ట్రం అతలాకుతలం అయ్యింది. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీ పరిస్థితి సరేసరి. శుక్రవారం చెన్నై సిటీ ప్రజలతో పాటు తమిళనాడు ప్రజలు కొంచెం ఊపిరిపీల్చుకున్నారు. భారీ వర్షాల దెబ్బతో సర్వం కోల్పోయిన వారిని, పాక్షికంగా నష్టపోయిన వారిని సహాయక శిభిరాలకు తరలించారు.

 రంగంలోకి దిగిన సీఎం

రంగంలోకి దిగిన సీఎం

తమిళనాడులోని చెన్నై, చెంగల్పట్టు జిల్లాల్లోని సహాయక శిభిరాల్లో ఉంటున్న ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ రంగంలోకి దిగారు. శుక్రవారం చెంగల్పట్టు జిల్లాలోని సహాయక కేంద్రాల్లో ఉన్న ప్రజలను పలకరించడానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అక్కడి వెళ్లారు.

ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా ?

ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా ?

చెంగల్పట్టులోని సహాయక శిభిరాలలో ఉంటున్న ప్రజలను పలకరించిన సీఎం స్టాలిన్ వారికి మూడుపూటలా అందుతున్న ఆహారం గురించి, వైద్యసేవల గురించి, అధికారులు అందిస్తున్న సహాయ సహకారాల గురించి అడిగి తెలుసుకున్నారు. సహాయక శిభిరాల్లో మీకు ఏమైనా సమస్యలు ఎదురౌతున్నాయా అంటూ సీఎం స్టాలిన్ అడిగి తెలుసుకున్నారు.

 రోడ్డు పక్కన టీస్టాల్ దగ్గర కారు నిలిపేసిన సీఎం

రోడ్డు పక్కన టీస్టాల్ దగ్గర కారు నిలిపేసిన సీఎం


చెంగల్పట్టులోని సహాయక శిభిరాల దగ్గర నుంచి వేరే ప్రాంతానికి బయలుదేరిన సీఎం ఎంకే. స్టాలిన్ ఒక్కసారిగా రోడ్డు పక్కన ఓ టీ స్టాల్ దగ్గర కారు ఆపాలని డ్రైవర్ కు చెప్పాడు. కారు దిగిన సీఎం స్టాలిన్ ఆయన వెంట ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్ దగ్గరకు వెళ్లారు. రోడ్డు పక్కన టీ స్టాల్ ముందు ఉన్న కుర్చీలో కుర్చున్న సీఎం స్టాలిన్ హాయిగా, సామాన్య వ్యక్తి లాగా టీ తాగారు.

షాక్ అయిన ప్రజలు..... నర్సులతో సీఎం సెల్ఫీలు

షాక్ అయిన ప్రజలు..... నర్సులతో సీఎం సెల్ఫీలు

సీఎం హోదాను పక్కన పెట్టిన ఎంకే. స్టాలిన్ సాధార వ్యక్తి లాగా రోడ్డు పక్కన టీ తాగడంతో స్థానికులు షాక్ అయ్యారు. విషయం గుర్తించిన సామాన్య ప్రజలు సీఎం స్టాలిన్ కుర్చున్న టీ స్టాల్ దగ్గరకు పరుగు తీశారు. రోడ్డు పక్కన టీ స్టాల్ లో టీ తాగిన సీఎం స్టాలిన్ అక్కడికి వెళ్లిన ఓ ఆసుపత్రిలో పని చేస్తున్న నర్సులు, సామాన్య ప్రజలతో సెల్ఫీలు తీసుకుని సాధారణ మనిషిలా అందరితో కలిసి పోవడం హాట్ టాపిక్ అయ్యింది.

స్టాలిన్ అందరివాడు.... .అందరు సీఎం లాగా కాదు

స్టాలిన్ అందరివాడు.... .అందరు సీఎం లాగా కాదు

సీఎం హోదాలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ ఇలా సర్వసాధారణంగా అందరితో కలిసిపోవడం ఆయనకు మాత్రమే సాధ్యం అవుతుందని ఆయన అభిమానులు అంటున్నారు. సీఎం కుర్చీలో కుర్చుకున్న చాలా మంది ముఖ్యమంత్రులు సామాన్య ప్రజలను దగ్గరకు కూడా రానివ్వని విషయం మనం చాలానే చూస్తున్నామని, కాని మా సీఎం అలా కాదని తమిళనాడులోని సామాన్య ప్రజలు అంటున్నారు.

స్టాలిన్ రూటే సపరేటు

స్టాలిన్ రూటే సపరేటు

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ రోడ్డు పక్కన టీ స్టాల్ లో కుర్చుని టీ తాగుతున్న సమయంలో తీసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రోడ్డు పక్కన కారు నిలిపేసి సామాన్య ప్రజలను పలకరించి వారి కష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. సీఎం స్టాలిన్ రూటే సపరేట్ అని మరోసారి రుజువు అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+