College girl: లాక్ డౌన్ స్కెచ్, కాలేజ్ అమ్మాయికి స్ప్రే కొట్టి కట్టేసి ఉద్యోగి అరాచకం, 7 నెలలు!
చెన్నై/ వేలూరు: పాలిటెక్నిక్ కాలేజ్ లో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి టెక్నిక్స్ తో ఓ అమ్మాయిని లొంగదీసుకోవడానికి లాక్ డౌన్ టైమ్ లో పక్కాస్కెచ్ వేశాడు. కాలేజ్ లో చదువుతున్న అమ్మాయిని నమ్మించి పిలిపించి ఆమెపై స్ప్రే కొట్టి కట్టేసి అత్యాచారం చేశాడు. విషయం ఎవరికైనా చెబితే నీ ప్రాణాలు తీస్తానని, రేప్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని పాలిటెక్నిక్ కాలేజ్ ఉద్యోగి బెదిరించాడు.
నిరుపేద కుటుంబానికి చెందిన కాలేజ్ అమ్మాయి కొంచెం నిర్లక్షం చెయ్యడంతో ఆమె 7 నెలల గర్బవతి అయ్యింది. చివరికి కాలేజ్ అమ్మాయి నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించిన పాలిటెక్నిక్ కాలేజ్ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేసి బెండ్ తీస్తున్నారు.

అమ్మాయికి చదువే జీవితం
తమిళనాడులోని వేలూరు జిల్లా (ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా సరిహద్దు)లోని కాట్పాడి సమీపంలోని వడుగన్ తాంగల్ కు చెందిన అమ్మాయి ఇరయన్ గాడులోని పాలిటెక్నిక్ కాలేజ్ లో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. పేద కుటుంబానికి చెందిన అమ్మాయి బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేసి తల్లిదండ్రులను సంతోషంగా చూసుకోవాలని ఆశపడింది.

కాలేజ్ అమ్మాయి 7 నెలల గర్బవతి
నెల రోజుల నుంచి కాలేజ్ అమ్మాయి కొంచెం అనారోగ్యానికి గురైయ్యింది. ఆ అమ్మాయి సరిగా నడవలేకపోవడం, రోజురోజుకు కడుపు ముందుకు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అసలే కరోనా వైరస్ తాండవం చేస్తున్న సమయంలో గ్రామస్తులు భయపడ్డారు. ఈనెల 16వ తేదీన వైద్యశాఖ అధికారులు కాలేజ్ అమ్మాయిని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యపరీక్షలు చేశారు. కాలేజ్ అమ్మాయి 7 నెలల గర్బవతి అని వెలుగు చూడంటంతో బాలిక కుటుంబ సభ్యులు షాక్ కు గురైనారు.

మార్చి 28వ తేదీ లాక్ డౌన్ స్కెచ్
మార్చి 25వ తేదీ కరోనా వైరస్ దెబ్బతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. మార్చి 28వ తేదీన పాలిటెక్నిక్ కాలేజ్ లో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి అమ్మాయి తండ్రికి ఫోన్ చేశాడు. కాలేజ్ రికార్డు బుక్ తీసుకుని మీ అమ్మాయిని కాలేజ్ కు రావాలని ప్రిన్సిపాల్ చెప్పారని తనను నమ్మించారని బాలిక పోలీసులకు చెప్పింది. తాను రికార్డు బుక్ తీసుకుని కాలేజ్ కు వెళ్లానని బాలిక పోలీసులకు సమాచారం ఇచ్చింది.

స్ప్రే కొట్టి కట్టేసి రేప్
కాలేజ్ లోని స్టాఫ్ రూమ్ దగ్గరకు తాను వెళ్లానని, అక్కడ ఎవ్వరూ లేరని, తనకు ఫోన్ చేసిన వ్యక్తి మాత్రమే ఉన్నాడని అమ్మాయి పోలీసులకు చెప్పింది. రూమ్ దగ్గరకు వెళ్లిన తన మీద ఆ ఉద్యోగి స్ప్రే కొట్టాడని, తరువాత తాను స్పృహ కోల్పోవడంతో అతను అత్యాచారం చేశాడని అమ్మాయి పోలీసులకు సమాచారం ఇచ్చింది. స్పృహలోకి వచ్చి చూసేసరికి తాను అదే రూమ్ లో ఓ మూల బట్టలు లేకుండా ఉన్నానని, ఆ ఉద్యోగికూడా అదే రూమ్ లో ఉన్నాడని కాలేజ్ అమ్మాయి పోలీసులకు చెప్పింది.
Recommended Video

నగ్న వీడియో, చంపేస్తానని వార్నింగ్
నిన్ను అత్యాచారం చేసిన విషయం నువ్వు ఎవ్వరికైనా చెబితే నిన్ను, నీ కుటుంబ సభ్యులను చంపేస్తానని అతను బెదిరించాడని ఆమె పోలీసులకు చెప్పింది. కేసు నమోదు చేసిన పోలీసులు కాలేజ్ ఉద్యోగిని అరెస్టు చేసి బెండ్ తీసి విచారణ చేస్తున్నారు. కాలేజ్ అమ్మాయికి వైద్యపరీక్షలకు తరలించామని పోలీసులు అన్నారు. మాకు తినడానికే సక్రమంగా అన్నం చిక్కడం లేదని, మాకు ఇలాంటి కష్టాలు వస్తాయని జీవితంలో ఊహించలేదని, మా కూతురు జీవితం నాశనం అయ్యిందని అమ్మాయి తల్లి బోరున విలపిస్తోంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications