Coronavirus: హీరో క్యాప్టెన్ కు కరోనా పాజిటివ్, పొంతనలేని ప్రకటనలు, సీఎం, ప్రేమలత, ప్రతిపక్షాలు !
చెన్నై/ మదురై/ బెంగళూరు: బహుబాష నటుడు, డీఎండీకే పార్టీ చీఫ్, క్యాప్టెన్ విజయ్ కాంత్ కు కరోనా వైరస్ (COVID-19) అని నిర్దారణ అయ్యింది. క్యాప్టెన్ విజయ్ కాంత్ చెన్నైలోని మియోట్ ఇంటర్నేషనల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని డీఎండీకే పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఆసుపత్రి వర్గాలు విడుదల చేసిన హీరో విజయ్ కాంత్ హెల్త్ బులిటిన్ కు, డీఎండీకే పార్టీ వర్గాలు విడుదల చేసిన ప్రకటనకు పొంతనలేకపోవడంతో పార్టీ వర్గాలతో పాటు క్యాప్టెన్ అభిమానులు అయోమయానికి గురైనారు. క్యాప్టెన్ త్వరగా కోలుకోవాలని సీఎం, ఉప ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఆకాంక్షించారు.

హీరో హెల్త్ బులిటిన్
చెన్నైలో హీరో విజయ్ కాంత్ చికిత్స పొందుతున్న మియోట్ ఇంటర్నేషనల్ ఆసుపత్రి ముందు గురువారం ఆయన అభిమానులు, డీఎండీకే పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమికూడటంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఇదే సమయంలో మియోట్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పృథ్వీ మోహన్ దాస్ హీరో విజయ్ కాంత్ హెల్త్ బులిటిన్ విడుదల చేశారు.

విజయ్ కాంత్ కు కరోనా !
హీరో విజయ్ కాంత్ కు తేలికపాటి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని, ఆసుపత్రిలోనే ఆయనకు చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం క్యాప్టన్ పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్ పృథ్వీ మోహన్ దాస్ వివరించారు. విజయ్ కాంత్ ప్రస్తుతం చికిత్సకు సహకరిస్తున్నారని, ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదటపడిన తరువాతే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని డాక్టర్ పృథ్వీ మోహన్ దాస్ విడుదల చేసిన హెల్త్ బులిటిన్ లో వివరించారు.

కరోనా లేదంటున్న పార్టీ ?
హీరో విజయ్ కాంత్ ఆరోగ్యం గురించి ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటిన్ విడుదల చేయక ముందు డీఎండీకే పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. క్యాప్టన్ విజయ్ కాంత్ కు కరోనా లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ఆయనకు కరోనా పాజిటివ్ అని ఇంకా వెలుగు చూడటేదని, సాధారణ చెకప్ కోసం ఎప్పటిలాగా మియోట్ ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తీసుకెళ్లామని, తరువాత ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారని డీఎండీకే పార్టీ వర్గాలు వివరించాయి.
Recommended Video

అయోమయంలో ఫ్యాన్స్
డీఎండీకే పార్టీ వర్గాలు విడుదల చేసిన ప్రకటనకు, ఆసుపత్రి విడుదల చేసిన హెల్త్ బుటిలిన్ కు పొంతనలేకపోవడంతో హీరో విజయ్ కాంత్ అభిమానులు, ప్రజలు అయోమయానికి గురైనారు. హీరో విజయ్ కాంత్ త్వరగా కోలుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే పార్టీ చీఫ్ ఎంకే, స్టాలిన్ తదితరులు ఆకాంక్షిస్తున్నారు. హీరో విజయ్ కాంత్ ఆరోగ్యం విషయంపై ఆయన సతీమణి ప్రేమలత విజయ్ కాంత్ పక్కా క్లారిటీ ఇవ్వాల్సి ఉందని క్యాప్టెన్ అభిమానులు అంటున్నారు.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications