Daughter: దత్తపుత్రిక, ఇంటర్ చదువుతున్న కూతురు, తండ్రితో పాటు ముగ్గురు కొడుకులు ?, శాడిస్టు ఫ్యామిలీ!

చెన్నై/టీ నగర్: కూతురు పుట్టిన నెల రోజుల తరువాత ఆమె తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అనాథ అయిన బంధువుల అమ్మాయి ఓ కుటుంబ సభ్యులు దత్తత తీసుకున్నారు. అప్పటికే ఇద్దరు భార్యలు, ముగ్గురు కొడుకులు ఉన్న అతను అమ్మాయిని బాగా చూసుకుంటానని బంధువులకు చెప్పాడు. దత్తపుత్రిక పెరిగి పెద్దది అయ్యి ఇంటర్ చదువుతోంది .ఇటీవల దత్తపుత్రిక పోలీసులకు ఫోన్ చేసి షాకింగ్ విషయం చెప్పింది.

తనను దత్తత తీసుకుని పెంచిన తండ్రితో పాటు ఆయన ముగ్గురు కొడుకులు తనను రెండు సంవత్సరాల నుంచి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని, ఇప్పటికే అబార్షన్లు చేయించారని దత్తపుత్రిక బోరున విలపించింది. కాలేజ్ నుంచి వచ్చిన తరువాత ఇంటి పని చేస్తున్న సమయంలో తండ్రి, ముగ్గురు కొడుకులు రోజు నాలుగైదుసార్లు తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని, ఈ టార్చర్ నేను తట్టుకోలేకపోతున్నానని కాలేజ్ అమ్మాయి చెప్పింది.

తన గోడు మొత్తం తనను పెంచి పెద్ద చేసిన తల్లికి చెబితే నీకు ఇష్టం ఉంటే ఇంట్లో ఉండాలని, లేదంటే ఇంట్లో నుంచి వెళ్లిపో అని చెబుతోందని అమ్మాయి విలపించడంతో పోలీసులు హడలిపోయారు. కామాంధులైన తండ్రి, అతని ఇద్దరి కొడుకులు, అమ్మాయిని పెంచి పెద్ద చేసిన పెంపుడు తల్లిని పోలీసులు అరెస్టు చెయ్యడం కలకలం రేపింది.

నెల రోజులకే తల్లిదండ్రులు చనిపోయారు

నెల రోజులకే తల్లిదండ్రులు చనిపోయారు

చెన్నై సిటీలోని తిరువళ్లిఖేణి ప్రాంతంలో నివాసం ఉంటున్న దంపతులకు 17 సంవత్సరాల క్రితం కూతురు పుట్టింది. కూతురు పుట్టిన నెల రోజుల తరువాత ఆమె తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అనాథ అయిన బంధువుల అమ్మాయి చెన్నైలోని రాయపేట్ లో నివాసం ఉంటున్న షరీఫ్ (64), జమీలా (58) దంపతులు దత్తత తీసుకున్నారు.

ఇద్దరు భార్యలు... ముగ్గురు కొడుకులు

ఇద్దరు భార్యలు... ముగ్గురు కొడుకులు

షరీఫ్ అప్పటికే జమీలాతో పాటు మరో భార్య ఉంది. షరీఫ్ కు ఇర్ఫాన్, ఇంతియాజ్, హనీఫ్ అనే ముగ్గురు కొడుకులు ఉన్నారు. షరీఫ్ చెన్నైలోని చెంకురం ప్రాంతంలో మెకానిక్ షెడ్ ఉంది. షరీఫ్ కుటుంబ సభ్యులు దత్తత తీసుకున్న అమ్మాయి పెరిగిపెద్దది కావడంతో ఇప్పుడు ఆమెకు 17 సంవత్సరాల వయసు వచ్చింది.

 పోలీసులకు ఫోన్ చేసిన కాలేజ్ అమ్మాయి

పోలీసులకు ఫోన్ చేసిన కాలేజ్ అమ్మాయి

షరీఫ్ దత్తపుత్రిక పెరిగి పెద్దది అయ్యి ఇంటర్ చదువుతోంది. ఇటీవల దత్తపుత్రిక చెన్నై సిటీ మహిళా పోలీసులకు ఫోన్ చేసి షాకింగ్ విషయం చెప్పింది. తనను దత్తత తీసుకుని పెంచిన తండ్రి షరీఫ్ తో పాటు ఆయన ముగ్గురు కొడుకులు ఇర్ఫాన్, హనీఫ్, ఇంతియాజ్ తనను రెండు సంవత్సరాల నుంచి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పింది.

తండ్రీ కొడుకులు వదలడం లేదు

తండ్రీ కొడుకులు వదలడం లేదు

ఇప్పటికే ఆసుత్రికి పిలుచుకునివెళ్లి తనకు అబార్షన్లు చేయించారని దత్తపుత్రిక పోలీసులకు ఫోన్ చేసి బోరున విలపించింది. కాలేజ్ నుంచి వచ్చిన తరువాత ఇంటి పని చేస్తున్న సమయంలో తనను పెంచి పెద్ద చేసిన తండ్రి షరీఫ్, ఆయన ముగ్గురు కొడుకులు రోజు నాలుగైదుసార్లు తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆ అమ్మాయి చెప్పింది.

మీరే నన్ను కాపాడండి

మీరే నన్ను కాపాడండి

తండ్రీ కొడుకుల టార్చర్ నేను తట్టుకోలేకపోతున్నానని కాలేజ్ అమ్మాయి పోలీసులకు చెప్పింది. తన గోడు మొత్తం తనను పెంచి పెద్ద చేసిన తల్లి జమీలాకు చెబితే నీకు ఇష్టం ఉంటే ఇంట్లో ఉండాలని, లేదంటే ఇంట్లో నుంచి వెళ్లిపో అని చెబుతోందని అమ్మాయి విలపించడంతో పోలీసులు హడలిపోయారు.

పెంపుడు తల్లిదండ్రులు, కామాంధులు అరెస్టు

పెంపుడు తల్లిదండ్రులు, కామాంధులు అరెస్టు

విషయం తెలుసుకున్న పోలీసులు షరీఫ్ ఇంటి దగ్గరకు వెళ్లి బాధితురాలిని విచారణ చేసి వివరాలు సేకరించారు. బాధితురాలు రెండు సంవత్సరాల నుంచి ఏమి జరిగింది అని మొత్తం చెప్పింది. కామాంధులైన తండ్రి షరీఫ్ తోపాటు, అతని ఇద్దరి కొడుకులు ఇంతియాజ్, ఇర్ఫాన్, అమ్మాయిని పెంచి పెద్ద చేసిన పెంపుడు తల్లి జలీమాను పోలీసులు అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. నిందితులు నలుగురిని జైలుకు పంపించామని, తప్పించుకున్న హనీఫ్ కోసం గాలిస్తున్నామని చెన్నై సిటీ మహిళా పోలీసులు చెప్పారని తమిళ మీడియా తెలిపింది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+